MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Ileana: పెళ్లి చేసుకోకుండా ఇలియానాను తల్లిని చేసింది ఆ స్టార్ హీరోయిన్ తమ్ముడా? షాకింగ్ డీటెయిల్స్!

Ileana: పెళ్లి చేసుకోకుండా ఇలియానాను తల్లిని చేసింది ఆ స్టార్ హీరోయిన్ తమ్ముడా? షాకింగ్ డీటెయిల్స్!

ఇలియానా పెళ్లి కాకుండా ప్రెగ్నెన్సీ ప్రకటించి సంచలనానికి తెరలేపింది. ఆమెను గర్భవతిని చేసింది ఓ స్టార్ హీరోయిన్ తమ్ముడంటూ ప్రచారం జరుగుతుంది.

2 Min read
Author : Sambi Reddy
| Updated : Apr 19 2023, 07:48 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Ileana

Ileana

బాలీవుడ్ లో దారుణమైన ట్రెండ్ నడుస్తుంది. పెళ్ళికి ముందు సహజీవనం, గర్భం దాల్చడం చాలా చిన్న విషయమైపోయింది. ఒకప్పుడు పెళ్లి కాకుండా తల్లి కావడం పరువు తక్కువ వ్యవహారంగా సమాజం చూసేది. అలాంటి పట్టింపులు గాల్లో కలిసిపోయాయి. పెళ్ళికి శృంగారానికి లింక్ ఏంటీ? నచ్చితే కలిసి తిరగడమేనన్న భావనకు వస్తున్నారు. అలియా భట్, అమీ జాక్సన్ వంటి హీరోయిన్స్ పెళ్ళి కాకుండానే తల్లి అయ్యారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27

బాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ఇలియానా ప్రెగ్నెసీకి కారకుడు హీరోయిన్ కత్రినా కైఫ్ బ్రదర్ అంటున్నారు. కత్రినా తమ్ముడైన సెబాస్టియన్ లారెన్ట్ మైఖేల్ తో ఏడాది కాలంగా డేటింగ్ చేస్తున్న ఇలియానా అతని కారణంగా తల్లి అయ్యారంటున్నారు. వారి వాదనకు కొన్ని ఆధారాలు చూపుతున్నారు.

37
Ileana

Ileana

ఆ మధ్య విక్కీ కౌశల్-కత్రినా దంపతులు మాల్దీవ్స్ వెకేషన్ కి వెళ్లారు. వీరి ట్రిప్ లో ఫ్రెండ్స్ తో పాటు ఇలియానా, సెబాస్టియన్ సైతం హాజరయ్యారు. మాల్దీవ్స్ వెకేషన్ ఫొటోల్లో సన్నిహితంగా ఉన్న ఇలియానా-సెబాస్టియన్ హైలెట్ అయ్యారు. తమ రిలేషన్ పై ఓపెన్ కాకున్నా ఇద్దరి మధ్య కొన్నాళ్లుగా ఘాడమైన ప్రేమ బంధం కొనసాగుతుందని బాలీవుడ్ వర్గాల భోగట్టా. ఇక తల్లిని అయ్యానని చెప్పిన ఇలియానా దానికి కారకులను అధికారికంగా ప్రకటిస్తే బాగుంటుందని అభిమానుల డిమాండ్...

47
Ileana

Ileana

మరోవైపు ఇలియానా కెరీర్ ఒడిదుడుకులతో సాగుతుంది. అడపాదడపా ఆఫర్స్ తో నెట్టుకొస్తోంది. తాజాగా 'సబ్ గజబ్' టైటిల్ తో ఓ ఆల్బమ్ చేశారు. ఆ సాంగ్ లో ఇలియానా లుక్ షాక్ ఇచ్చింది. బెల్లీ అందాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన ఇలియానా హిప్ షేప్ కోల్పోయి దారుణంగా కనిపించారు. ఆమె ఫిట్నెస్ వదిలేసినట్లు క్లియర్ గా అర్థం అవుతుంది.

57

 కాగా ఇలియానా తీసుకున్న రాంగ్ డెసిషన్స్ కెరీర్ ని నాశనం చేశాయి. సౌత్ లో స్టార్ గా వెలిగిపోతున్న సమయంలో నార్త్ పై కన్నేసి అసలుకే ఎసరు తెచ్చుకుంది.2012లో విడుదలైన బర్ఫీ చిత్రంలో రన్బీర్ కపూర్, ప్రియాంక చోప్రా, ఇలియానా ప్రధాన పాత్రలు చేశారు. క్రిటిక్స్ మెప్పు పొందిన బర్ఫీ కమర్షియల్ గా ఆడలేదు. మానసిక రోగి పాత్ర చేసిన ప్రియాంక మార్కులు కొట్టేసింది. బర్ఫీ మూవీతో ఇలియానా బాలీవుడ్ కి పరిచయమయ్యారు. 
 

67
Image: Ileana DCruz/Instagram

Image: Ileana DCruz/Instagram

బాలీవుడ్ కి వెళ్ళాక ఇలియానా టాలీవుడ్ ని విస్మరించింది. ఇక్కడ స్టార్ హీరోల చిత్రాలు కాదని అక్కడ టూ టైర్ హీరోల చిత్రాలు చేయడం మొదలుపెట్టారు. ఇలియానా నటించిన ఒక్క హిందీ చిత్రం కూడా చెప్పుకోదగ్గ విజయం అందుకోలేదు. ఈ లోగా సౌత్ ప్రేక్షకులు ఆమెను మర్చిపోయారు.

77


ప్రేమ వ్యవహారం కూడా ఇలియానా ప్రస్తుత పరిస్థితికి కారణం. ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ ఆండ్రూ తో ఇలియానా కొన్నాళ్ల పాటు రిలేషన్ నడిపారు. ఆండ్రూ 2019లో ఇలియానాకు బ్రేకప్ చెప్పాడు. ఈ పరిణామం ఆమెను మానసిక వేదనకు గురి చేసింది. ఆ డిప్రెషన్ నుండి బయటపడిన ఇలియానా మళ్ళీ కెరీర్ పై ఫోకస్ పెట్టారు.  ముంబైలోనే ఉంటున్న ఇలియానా బాలీవుడ్ ని నమ్ముకుని కెరీర్ సాగిస్తున్నారు. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Trisha: ఎట్టకేలకు అధికారికంగా హింట్‌ ఇచ్చిన త్రిష.. విజయ్ సీఎం అయ్యాక ఫస్ట్ పోస్ట్.. నెట్టింట రచ్చ
Recommended image2
Ashu Reddy: హీరో మరణంతో అల్లాడిపోయిన ఆషు రెడ్డి.. హృదయం కదిలించేలా ఎమోషనల్‌ పోస్ట్
Recommended image3
Renu Desai: సినిమాలు చేయకుండానే రేణు దేశాయ్‌ కోట్ల సంపాదన, ఎలానో తెలిస్తే మైండ్‌ బ్లాక్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved