- Home
- Entertainment
- Shruti Haasan: ముంబై ప్రియుడితో శృతి హాసన్ కి చెడిందా... తెరపైకి స్టార్ హీరోయిన్ బ్రేకప్ రూమర్స్!
Shruti Haasan: ముంబై ప్రియుడితో శృతి హాసన్ కి చెడిందా... తెరపైకి స్టార్ హీరోయిన్ బ్రేకప్ రూమర్స్!
శృతి హాసన్ ప్రియుడు శాంతను హజారికతో విడిపోయారంటూ కథనాలు వెలువడుతున్నాయి. శృతి హాసన్ లేటెస్ట్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ ఈ రూమర్స్ కి కారణమైంది.

Shruti Haasan
స్టార్ హీరోయిన్ శృతి హాసన్ ముంబైలో ఉంటున్నారు. ఆమె డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికను ప్రేమిస్తున్నారు. ఒకే ఇంటిలో ఉంటూ లివింగ్ రిలేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. రెండేళ్లకు పైగా శృతి-శాంతను రిలేషన్ కొనసాగుతుంది.
Shruti Haasan
శృతి (Shruti Haasan)చెల్లి అక్షర హాసన్ బర్త్ డే వేడుకల్లో శాంతను హజారిక పాల్గొనడం విశేషం. ఈ బర్త్ డే ఈవెంట్ కి కమల్ హాసన్ సైతం పాల్గొన్నాడు. తండ్రికి శాంతనుని పరిచయం చేసింది. ఇక శాంతనుతో తన హ్యాపీ మూమెంట్స్ ని శృతి హాసన్ సోషల్ మీడియాలో షేర్ చేస్తారు. పదుల సంఖ్యలో శృతి హాసన్-శాంతను ఫోటోలు, వీడియోలు ఆమె పోస్ట్ చేశారు.
Shruti Haasan
కాగా శృతి హాసన్, శాంతను హజారిక విడిపోయారన్న వార్త తెరపైకి వచ్చింది. శృతి తాజా ఇంస్టాగ్రామ్ పోస్ట్ ఈ ఉహాగానాలకు కారణమైంది. శృతి ఇంస్టాగ్రామ్ లో... నాతో నేను ఉంటేనే సంతోషం. నా విలువైన సమయాన్ని, ఒంటరితనాన్ని ప్రేమిస్తున్నాను. జీవితంలో ఇక్కడ వరకు రావడం గొప్ప అదృష్టం. అందుకు కృతఙ్ఞతలు, ఎట్టకేలకు నాకు ఆ విషయం బోధపడింది, అంటూ కామెంట్ పోస్ట్ చేశారు.
Shruti Haasan
శృతి హాసన్ ఒంటరిగా ఉండటమే ఆనందమని చెప్పడానికి బ్రేకప్ కారణం అంటున్నారు. మరి ఈ వార్తలపై శృతి ఎలా స్పందిస్తారో చూడాలి. కాగా 2019లో శృతి లండన్ ప్రియుడు మైఖేల్ కోర్ల్సేకి బ్రేకప్ చెప్పారు. కొంచెం గ్యాప్ ఇచ్చి శాంతనుకి దగ్గరయ్యారు. ఇప్పుడు ఆయన్ని కూడా వదిలేశారనే వార్తలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Shruti Haasan
శృతి తెలుగులో మూడు భారీ చిత్రాలు చేస్తున్నారు. చిరంజీవి, బాలకృష్ణలకు జంటగా నటించిన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాలు 2023 సంక్రాంతి కానుకగా విడుదల కానున్నాయి. ఇక ప్రభాస్ తో చేస్తున్న సలార్ చిత్రీకరణ జరుపుకుంటుంది. వచ్చే ఏడాది సలార్ విడుదల కానుంది.