సమంత ‘సామ్ జామ్’ ఇలా షాకిచ్చిందేంటి? హిట్టా ..ఫట్టా?

First Published 15, Nov 2020, 8:48 AM

ఒక్కరోజు బిగ్ బాస్ హోస్ట్‌గా అదరగొట్టిన సామ్.. తన క్యూట్ అండ్ స్వీట్ స్మైల్‌తో ‘సామ్ జామ్’ అంటూ వచ్చేసిన విషయం తెలిసిందే. ఈ షోకు సంబంధించి రిలీజైన ప్రోమో రిలీజైన దగ్గర నుంచి ఈ షోపై ఎక్సపెక్టేషన్స్ బాగా పెరిగాయి. సూపర్ ఎంటర్టైన్మెంట్ పంచుతుందని అంతా ఊహించారు. ఫస్ట్ ఎపిసోడ్‌కు రౌడీ హీరో విజయ్ దేవరకొండ హాజరయ్యటం ప్లస్ అవుతుందని అందరూ భావించారు. ఆ అంచనాలే ఇబ్బందిగా మారాయి. ఈ నేపధ్యంలో ఈ షో ఫస్ట్ ఎపిసోడ్ ఎలా ఉంది..బయిట టాక్ ఏం నడుస్తోంది

నాటీ క్వశ్చన్స్ అడుగుతూ విజయ్ ఫ్యాన్స్‌కు మాత్రమే కాకుండా అందరికీ సూపర్‌గా నచ్చేసేలా ప్రోగ్రాం ఉంటుందని అనుకున్నారు. అయితే ఫస్ట్ ఎపిసోడ్ లో ఆ కిక్ కనపడలేదని సోషల్ మీడియాలో ఓ టాక్ నడుస్తోంది. మరో ప్రక్క ఈ షో ప్లాఫ్ షో అని మీడియాలో ఓ వర్గం ప్రచారం మొదలెట్టేసారు.

పోగ్రామ్ డిజైన్, కంటెంట్ అదిరిపోయే క్వాలిటీతో లేదనేది నిజం. ఆ విషయంలో ఎందుకో ఆహా టీమ్ సక్సెస్ కాలేదు. కేవలం సమంత అక్కడ ఉంటే చాలు అనుకున్నట్లు సాగింది.

ఈ షో ప్రోమో చూసిన వారంతా ..ఇది కొత్త ప్యాకేజ్ తో వస్తుందనుకున్నారు. అంచనాలు పెంచేసుకున్నారు. అదే డిజప్పాయింట్ మెంట్ కారణమైంది. ఓవర్ ఎక్సపెక్టేన్స్ ఈ షో పై సదాభిప్రాయం కలగనీయలేదు.

రొటీన్ ఛాట్ షో గా ప్రారంభమైన కాసేపటికే మారిపోయిందనే విమర్శలు వినపడుతున్నాయి. ఇప్పటికే హిట్టైన బతుకు జట్కాబండి, అలీతో సరదాగా, సుమ నిర్వహిస్తున్న క్యాష్ లు కలిపి ఈ షో స్క్రిప్టు రెడీ చేసారనిపించేలా ఉంది.

సైకాలజిస్ట్, డాక్టర్ ని తీసుకువచ్చి కౌన్సిలింగ్ చేసారు. ఓ పేద కుటుంబాన్ని తీసుకువచ్చి మాట్లాడించారు. మరో ప్రక్క వైవా హర్ష చేత కామెడీ చేయించే ప్రయత్నం చేసారు. ఇవన్ని కలగూరగంపలా మారాయి.

ఎంటర్టైన్మెంట్ షో ని ఎవేర్నెస్,మేసేజ్, ఎమోషన్స్ తో కూడిన షోగా మార్చేసారు. ఇవన్ని కేవలం ఎంటర్నైన్మెంట్ ని మాత్రమే ఊహించిన ప్రేక్షకుడుని కాస్త ఇబ్బంది పెట్టాయి.

అయితే ఫస్ట్ ఎపిసోడ్ కే ఈ షో హిట్టా..ప్లాఫా అనేది డిసైడ్ చేయటం మాత్రం సరైన పద్దతి కాదు. మీడియా ఈ విషయంలో అత్యుత్సాహం చూపించటం అనవసరం.  ఎందుకంటే ఇదేమీ సినిమా కాదు..మొదటి షోకే తేలిపోవటానికి. ఇలాంటి షో ఆమెకీ కొత్తే.

ఎంతటి వారికైనా మొదట రెండు మూడు ఎపిసోడ్స్ లో ఖచ్చితంగా తడబాటు ఉంటుంది. తప్పులు సరిచేసుకుని మెల్లిమెల్లిగా జనాల్లోకి వెళ్తుందనేది సమంత అభిమానుల నమ్మకం.

సమంత ఒంటిచేత్తో నడిపించిన ఈ షో లో కేవలం సెలబ్రెటీతోనే కాకుండా ఆడియన్స్‌తోనూ కలిసిపోయి అల్లరి చేసేసింది.మరింత అల్లరి, చిలిపితనంతో ‘సామ్ జామ్ షో’ను ఓ రేంజ్‌కు తీసుకుపోగలదని హండ్రెడ్ పర్సెంట్  చెప్పచ్చు.

విజయ్‌తో ఛిట్‌ఛాట్ మాత్రమే కాకుండా ఫన్నీ టాస్కులు కూడా చేయించటం అభిమానులు పిచ్చ పిచ్చగా నచ్చేసింది. ఈ టాక్ షోలో ప్రశ్నలు, ఫన్నీ టాస్క్‌లతో పాటు ఛారిటీ కూడా ఉండబోతున్నట్టుగా ఈ ఎపిసోడ్ తో తెలుస్తోంది. కష్టాల్లో ఉన్నవారికి ఓ  షో ద్వారా సహాయం కూడా అందించబోవటం మాత్రం మంచి విషయమే.

loader