‘మిస్టర్ బచ్చన్’ఫెయిల్యూర్ కారణం ఎవరు? హరీష్ శంకర్ కాదా?
రవితేజ ఈ మధ్య కాలంలో చేసిన వరస పది సినిమాల్లో కేవలం రెండు మాత్రమే ఆడాయి.
రవితేజ ఖాతాలో మరో డిజాస్టర్ పడింది. హరీశ్ శంకర్ దర్శకత్వంలో మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన ‘మిస్టర్ బచ్చన్’ సినిమా విడుదలకు ముందు మంచి బజ్ తెచ్చుకుంది. ప్రమోషన్లతో పాటు హరీశ్ శంకర్ కామెంట్లతో బాగా హైప్ వచ్చేసింది. దానికి తోడు పాటలు ఆకట్టుకోవడం, ట్రైలర్ బాగుండటంతో ఎక్సపెక్టేషన్స్ పెరిగాయి. అయితే, మిస్టర్ బచ్చన్ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ బుధవారం (ఆగస్టు 14) సాయంత్రమే ప్రీమియర్ల షోలతో ఈ చిత్రం రాగా.. గురువారం పూర్తిస్థాయిలో రిలీజ్ అయింది. ఈ మూవీకి ప్రీమియర్ల నుంచే నెగెటివ్ టాక్ వచ్చింది. చివరకి వీకెండ్స్ కూడా వర్కవుట్ అయ్యేట్లు కనపడటం లేదు. అందుకు కారణం ఎవరు అనేది డిస్కషన్ గా మారింది.
ఈ సినిమా ఫెయిల్యూర్ కు హరీష్ శంకర్ కారణం అంటూ సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది. అయితే ఈ సినిమా ఫెయిల్యూర్ కు అసలు కారణం ఎవరు..ఎక్కడ పొరపాటు జరిగింది. ఎవరూ కావాలని సినిమా ఫెయిల్యూర్ చేసుకోరు కదా ...ఎక్కడ తప్పు ఉంది. అంటే రవితేజ వైపు నుంచే సమస్య అంటున్నారు. మొదట రవితేజ తన ప్రయారిటీస్ మార్చుకోబట్టే ఇలాంటి సినిమాలు వస్తున్నాయంటున్నారు.
రవితేజ ఈ మధ్య కాలంలో చేసిన వరస పది సినిమాల్లో కేవలం రెండు మాత్రమే ఆడాయి. క్రాక్, థమాకా లు మాత్రమే వర్కవుట్ అయ్యాయి. అందుకు కారణం రవితేజ గతంలో స్క్రిప్టు ఏమిటి, కథ ఏమిటి అనేది పట్టించుకునే వారు. ఇప్పుడు కేవలం తన రెమ్యునరేషన్ ని మాత్రమే చూసుకుంటున్నారు. తనకు 30 కోట్లు ఎవరు ఇస్తారో ఆ నిర్మాతకు డేట్స్ ఇచ్చేస్తున్నారు అనే టాక్ వినపడుతోంది.
పీపుల్స్ మీడియా వారికి నాలుగు సినిమాలు 100 కోట్లకు చేస్తానని ఎగ్రిమెంట్ చేసి అందులో భాగంగా ధమాకా, ఈగల్, మిస్టర్ బచ్చన్ చేసారని, ఇంకో సినిమా పెండింగ్ ఉందని తెలుస్తోంది. అలా ముందు తన పేమెంట్ సెట్ అయ్యితే డేట్స్ ఇచ్చేద్దామనే ధోరణే రవితేజని ముంచేస్తోందని ట్రేడ్ లో , ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఆయన గత నాలుగైదు ఏళ్లుగా ఈ స్కీమ్ లోకి వచ్చారని చెప్తున్నారు. అయితే మూడు సినిమాల్లో ఒకటే ఆడింది. అదే ధమాకా.
Raviteja, puri jagan
అయితే రవితేజలో గొప్పతనం ఏమిటి అంటే వయస్సు మీద పడుతున్నా ..ఎక్కడా ఆ ప్రభావం కనపడనివ్వకుండా అదే ఉత్సాహంతో , ఊపుతో ముందుకు వెళ్లటం. అది తోటి హీరోలను ఆశ్చర్యపరుస్తోంది. రవితేజ ఇరవై ఏళ్ళ క్రితం ఎలా ఉన్నాడో ఇప్పటికి అలాగే ఉన్నాడని, ఎనర్జీ కోల్పోలేదని ఆయనతో పనిచేసిన వారు చెప్తారు. అయితే సినిమా పరిశ్రమలో హిట్ లు, ఫ్లాపు ల కామన్... సక్సెస్ వస్తే అన్నీ మర్చిపోయి నిర్మాతలు ఇంటి ముందు క్యూ కడతారు. ఆ రోజులు త్వరలోనే వస్తాయని నమ్ముదాం.