రామ్ పోతినేనికి పెళ్లై ఇంత పెద్ద కొడుకు కూడానా! వైరల్ అవుతున్న ఫొటో.. ఇంతకీ విషయం ఏంటీ?
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) పెళ్లి గురించి ఇప్పటికే అభిమానులు ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. తాజాగా రామ్ పెట్టిన పోస్ట్ ఇంటర్నె ట్ లో వైరల్ గా మారింది.
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 19 ఏండ్లకే హిట్ అందుకున్న రామ్ తన ఎనర్జీ, డాన్స్, హ్యాండ్సమ్ లుక్, యాక్టింగ్ స్కిల్స్ తో తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ నూ దక్కించుకున్నారు.
‘దేవదాస్’తో వెండితెరకు పరిచయం అయిన రామ్ పోతినేని 15 ఏండ్లుగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తూనే వచ్చారు. గతంలో రొమాంటిక్ జోనర్ చిత్రాల్లో ఎక్కువగా నటించిన ఆయన.. ప్రస్తుతం మాస్ యాక్షన్ సినిమాలు చేసేందుకే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అలాంటి ప్రాజెక్ట్స్ నే ఓకే చేస్తున్నారు.
అయితే, రామ్ పోతినేనికి ప్రస్తుతం 34 ఏండ్లు. మరో నాలుగు నెలలు పోతే 35వ ఏట అడుగు పెట్టనున్నారు. ఇండస్ట్రీలో 35 దాటినా పెళ్లి చేసుకోకుండా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ గా హీరోలు చాలానే మంది ఉన్నారు. అందులో రామ్ పోతినేని ఒకరు.
ప్రస్తుతం ఒక్కొక్కరుగా పెళ్లిపీటలు ఎక్కుతున్నారు. దీంతో అభిమానులు ఈయన పెళ్లి ఎప్పుడంటూ ఎదురుచూస్తున్నారు. గతేడాది రామ్ పోతినేని సీక్రెట్ గా పెళ్లి చేసుకోబోతున్నారంటూ నెట్టింటిలో వార్తలు పుట్టుకొచ్చాయి. దీనిపై రామ్ వెంటనే స్పందిస్తూ పుకార్లని కొట్టిపారేశారు.
కాగా, తాజాగా ఆయన షేర్ చేసిన ఫొటో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో రామ్ కు పెళ్లి అయ్యిందా? ఇంత పెద్ద కొడుకు కూడా ఉన్నాడా అంటూ నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇంతకీ ఆ పోస్ట్ ఏంటంటే.. రామ్ పిల్లవాడితో దిగిన ఓ స్మైలీ ఫొటోను అభిమానులతో పంచుకుంటూ.. ‘SON’day.. Sidhanth Pothineni అంటూ క్యాషన్ ఇచ్చాడు.
దీంతో నెటిజన్లు షాక్ అవుతూ రకరకాలుగా కామెంట్లలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఆ పిల్లవాడు తన అన్నయ్య కొడుకని తెలుస్తోంది. ప్రస్తుతం ఫొటో ఇంటర్నెట్ లో వైరల్ అవుతుండటంతో.. దీనిపై రామ్ పోతినేని మరోసారి స్పందించక తప్పడం లేదనిపిస్తోంది. ఇక ఎనర్జిటిక్ స్టార్ ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో నటిస్తున్నారు. యంగ్ బ్యూటీ శ్రీలీలా హీరోయిన్. షూటింగ్ శరవేగంగా సాగుతోంది. థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.