MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సందీప్ వంగా స్పెషల్ డిమాండ్ , ఓకే చేసిన ప్రభాస్ ? అందుకే షూటింగ్ లేటు

సందీప్ వంగా స్పెషల్ డిమాండ్ , ఓకే చేసిన ప్రభాస్ ? అందుకే షూటింగ్ లేటు

ప్రభాస్ ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారు. అలాంటి ఆఫీసర్ జాబ్ లో, తనకి దగ్గర వ్యక్తి విషయంలో ఒక తప్పు జరుగుతుంది. ఆ తరువాత ఆ పోలీస్ ఆఫీసర్ ఎలా రియాక్ట్ అయ్యాడు

3 Min read
Surya Prakash
Published : Oct 09 2024, 06:22 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
19
Sandeep Vanga, Spirit Movie, Prabhas

Sandeep Vanga, Spirit Movie, Prabhas

రీసెంట్ గా  'కల్కి2898 AD' సినిమాతో మాసివ్ సక్సెస్ అందుకున్నారు   ప్రభాస్ . 'కల్కి'లో రెబల్ స్టార్ యాక్టింగ్​కు నార్త్​లోనూ మరోసారి ఓ రేంజి క్రేజ్ ఏర్పడింది. అక్కడి వాళ్లు కూడా ప్రభాస్  సినిమా వస్తే ఖచ్చితంగా చూడాలని ఫిక్స్ అయ్యిపోయారు. దాంతో  'కల్కి' తర్వాత ప్రభాస్‌ నుంచి వచ్చే తర్వాతి సినిమా ఏంటి అనే ఆసక్తి మొదలైంది.

ఇప్పటికే ప్రభాస్  'కల్కి'తో పాటు ఫౌజీ,  'సలార్ 2', 'రాజాసాబ్​', 'స్పిరిట్​', 'కన్నప్ప' మూవీస్​కు సైన్ చేసిన సంగతి తెలిసిందే.  'కల్కి' షూటింగ్ టైమ్ లోనే  అప్పుడప్పుడు రాజాసాబ్, కన్నప్ప  సెట్స్​లోనూ సందడి చేసేవారు. అయితే ఈ సినిమాలు కాకుండా అభిమానులు మాత్రం స్పిరిట్ కోసం ఎదురుచూస్తున్నారు. అందుకు కారణం డైరక్టర్ సందీప్ వంగా. 
 

29
Sandeep Vanga, Spirit Movie, Prabhas

Sandeep Vanga, Spirit Movie, Prabhas


సందీప్ వంగా ఇప్పటికే తన నెక్ట్స్ చిత్రం స్పిరిట్  స్క్రిప్టు దాదాపు పూర్తి చేసేసారు. ఫిల్మ్ ప్రీ ప్రొడభన్ ప్రారంభమైపోయింది. రెగ్యులర్ షూటింగ్ 2025లో మొదలు కానుంది. అయితే సందీప్ వంగా అక్టోబర్ 2024లో షూట్ మొదలు పెడదామనుకున్నారు. కాని దాన్ని ఆరు నెలలు పాటు ముందుకు తోసారు.

అందుకు ప్రత్యేకమైన కారణం ఉంది. దానికి ప్రభాస్ సైతం ఓకే చెప్పారు.ఈ సినిమాలో సందీప్ వంగా స్పెషల్ క్యారక్టరైజషన్ డిజైన్ చెయ్యటమే కాకుండా లుక్ కూడా పూర్తిగా మార్చబోతున్నారు. ఈ మేరకు ఫొటో షూట్ లు సైతం జరిగాయి..ఐదారు రకాలుగా లుక్ లు చూసుకుని ఒకటి ఓకే చేసారు.

39
Sandeep Vanga, Spirit Movie, Prabhas

Sandeep Vanga, Spirit Movie, Prabhas


అయితే సందీప్ వంగా ప్రభాస్ కు ఓ కండీషన్ లాంటి డిమాండ్ చేసారు. అదేమిటంటే తన స్పిరిట్ సినిమా చేసేటప్పుడు వేరే దృష్టి ఉండకూడదు. పూర్తిగా క్యారక్టర్ లోనే ఉండాలి. అంటే స్పిరిట్ సినిమా చేసేటప్పుడు వేరే ప్రాజెక్టులు చెయ్యకూడదు. ఫోకస్ డివైడ్ కాకూడదని సందీప్ కోరిక.సందీప్ వంగా రిక్వెస్ట్ ని ప్రభాస్ ఓకే చేసారు. దాంతో నవంబర్ లేదా డిసెంబర్ కు ది రాజా సాబ్ ని పూర్తి చేసేస్తారు. అలాగే స్పిరిట్ ప్రారంభం నాటికే హను రాఘవపూడి తో చేస్తున్న ఫౌజీ సగం షూటింగ్ అవ్వకొట్టేస్తారు. 

49
Sandeep Vanga, Spirit Movie, Prabhas

Sandeep Vanga, Spirit Movie, Prabhas


 సందీప్‌ వంగా దర్శకత్వం​లో తెరకెక్కునున్న 'స్పిరిట్‌'పై రెబల్ అభిమానులు భారీగానే ఆశలు పెట్టుకున్నారు. ఇందులో ప్రభాస్ ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్​గా కనిపిస్తారన్న చెప్పటంతో ఈ  చిత్రం మరింత క్రేజ్ సంపాదించుకుంది.  అలాగే ఈ సినిమా కథ మొత్తం డ్రగ్ మాఫియా చుట్టూ తిరగనుందని తెలుస్తోంది. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు. 

బిగ్ బాస్ హౌజ్ నుంచి ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు?

59
spirit telugu movie budget is 500 crores prabhas sandeep reddy vanga

spirit telugu movie budget is 500 crores prabhas sandeep reddy vanga

   
ఈ సినిమాలో కొరియన్ స్టార్ హీరో మా డాంగ్-సియోక్ (డాన్ లీ) నటించబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. డాన్ లీ  దక్షిణ కొరియాతో పాటు అటు హాలీవుడ్‌లో కూడా చాలా సినిమాలు చేసారు.డాన్ లీ (Don Lee) అలియాస్ మా డోంగ్ సియోక్ యాక్ష‌న్ సినిమా కేరాఫ్ ఎడ్రస్.  'ట్రైన్ టూ బూసన్' తో  వ‌ర‌ల్డ్ వైడ్‌గా హీరోగా అవతరించాడు. మార్వెల్ (Marvel) మూవీస్‌లో డాన్ లీ న‌టించాడు.  ముఖ్యంగా ఆయన నటించిన 'ది ఔట్‌లాస్', 'ది గ్యాంగ్‌స్టర్, ది కాప్, ది డెవిల్', 'అన్‌స్టాపబుల్', 'ఛాంపియన్', వంటి సినిమాలు మన తెలుగు వాళ్లకు కూడా పరిచయమే. 

69
Asianet Image


ఈ సినిమాల మాత్రమే కాకుండా  డాన్ లీ ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో ఆయన సపోర్టింగ్ రోల్స్, విలన్‌గా కూడా నటించారు. స్వతహాగా మార్షల్ ఆర్ట్స్‌లో మాస్టర్ అయిన డాన్ లీ.. తన సినిమాల్లో చేసే యాక్షన్‌ సీన్స్‌కి వీరాభిమానులు ఉన్నారు.  నిజంగా డాన్ లీ.. ప్రభాస్‌ సినిమాలో విలన్‌గా నటిస్తే ఇంటర్నేషనల్ లెవల్లో  ప్రాజెక్టు కు క్రేజ్ రావటం ఖాయం.  ఏదైమైనా ఈ వార్త పై అధికారిక ప్రకటన వచ్చేంత వరకు నమ్మటానికి లేదు.

79
Asianet Image


ఈ మూవీ స్టోరీ లైన్ గురించి సందీప్ వంగా మాట్లాడుతూ.. “ప్రభాస్ ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారు. అలాంటి ఆఫీసర్ జాబ్ లో, తనకి దగ్గర వ్యక్తి విషయంలో ఒక తప్పు జరుగుతుంది. ఆ తరువాత ఆ పోలీస్ ఆఫీసర్ ఎలా రియాక్ట్ అయ్యాడు” అనేది కథని చెప్పుకొచ్చారు.  
 
 

89
Asianet Image

అలాగే స్పిరిట్ బడ్జెట్ విషయానికి వస్తే... దాదాపు రూ.300 కోట్లతో తెరకెక్కనుందని తెలియచేసారు. అలాగే 'స్పిరిట్' సినిమాప్రభాస్​తో మూవీ అనగానే రూ.300+ కోట్లు కూడా ఇన్వెస్ట్​ చేయడానికి ముందుకొచ్చే ప్రొడ్యుసర్లు ఉన్నారని సందీప్ అన్నారు. దాంతో తనకు ఈ సినిమా బడ్జెట్ విషయంలో అసలు ఆలోచించుకోవాల్సిన పనిలేదని తెల్చి చెప్పారు.

అలాగే  భారీ బడ్జెట్​తో రూపొందనున్న స్పిరిట్, ప్రభాస్ ఇమేజ్​తోనే టీజర్, ట్రైలర్, ఆడియో రిలీజ్, ప్రీ ప్రమోషన్స్​తోపాటు శాటిలైట్, డిజిటల్ రైట్స్​తోనే పూర్తి బడ్జెట్ రికవరీ అయ్యే అవకాశం ఉందని సందీప్ అభిప్రాయపడ్డారు. 

99
Asianet Image

  ఈ సినిమాతో సందీప్ కచ్చితంగా రూ2000 కోట్లు వసూళ్లు చేస్తారని అంటున్నారు.  ఈ సినిమా స్క్రిప్ట్ ని యానిమల్ కంటే ముందే ప్రభాస్ కి వినిపించారట. కరోనా సమయంలో ప్రభాస్ కి ఈ స్టోరీ లైన్ చెప్పగా.. ఆయనకి బాగా నచ్చేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఇక 2024 నవంబర్​ లేదా డిసెంబర్​లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని సందీప్ అన్నారు.  
    
నిర్మాత భూషణ్ కుమార్ మాట్లాడుతూ...‘‘  ‘స్పిరిట్‌’చాలా ప్రత్యేకమైన సినిమా. పోలీస్‌ డ్రామాగా తెరకెక్కనుంది. ఇందులో ప్రభాస్‌ తొలిసారి ఖాకీ దుస్తులు ధరించి, లాఠీ ఝుళిపించనున్నారు. అలాగే ఈ సినిమాకు సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ చిత్రం గురించి ఒక విషయం కచ్చితంగా చెప్పగలను. ఇందులో మునుపెన్నడూ చూడని ప్రభాస్‌ని చూస్తారు’’ అని భూషణ్‌ కుమార్‌ చెప్పారు 
  

Surya Prakash
About the Author
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా. Read More...
ప్రభాస్
 
Recommended Stories
Top Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved