మీసం తిప్పిన నాగబాబు దుకాణం సర్దినట్టేనా... హైపర్ ఆది చెప్పిందే జరిగింది!
First Published Jan 5, 2021, 11:06 AM IST
మెగా బ్రదర్ నాగబాబు సారథ్యంలో మొదలైన బొమ్మ అదిరింది షోకి తెరపడిందని టాక్ వినిపిస్తుంది. అనుకున్నంత ఆదరణ దక్కని నేపథ్యంలో నాగబాబు బొమ్మ అదిరింది టాక్ షోకి చరమ గీతం పాడాడని టాలీవుడ్ కోడై కూస్తుంది. గత రెండువారాలుగా బొమ్మ అదిరింది షో ప్రసారం నిలిచిపోవడమే దీనికి కారణం.

జబర్ధస్త్ షో నుండి బయటికి వచ్చిన నాగబాబు అదిరింది పేరుతో అదే తరహాలో ఓ కామెడీ షో జీ తెలుగులో ప్రారంభించారు. పోతూపోతూ జబర్ధస్త్ నిర్వాహకులపై అవాకులు చవాకులు పేల్చాడు. జబర్ధస్త్ కష్టసమయాలలో నన్ను ఆదుకుంది అంటూనే... నావలన కూడా ఆ షోకి ప్రయోజనం చేకూరింది అన్నాడు.

తనతో పాటు జబర్ధస్త్ టీమ్ లీడర్స్ చమ్మక్ చంద్ర, కిరాక్ ఆర్పీ, ధనా ధన్ ధన్ రాజ్ లను మరియు జబర్ధస్త్ డైరెక్టర్స్ ని నాగబాబు అదిరింది షోకి తీసుకెళ్లారు. పరోక్షంగా జబర్ధస్త్ షోని తొక్కేస్తామని ఆయన ప్రగల్బాలు పలికారు.
Today's Poll
ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?