MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • వివాదంలో మహేష్ ...ఆ వీడియోలు ఎవరు డిలేట్ చేసారు?

వివాదంలో మహేష్ ...ఆ వీడియోలు ఎవరు డిలేట్ చేసారు?

నార్త్ మీడియా మహేష్ ని విమర్శించటమే పనిగా పెట్టుకుంది. దాంతో మహేష్ బాబు పాన్ బహార్ ప్రకటనలో నటించడం మీద డిజిటల్ ఆగ్రహం కట్టలు తెంచుకున్న రీతిలో ప్రమోట్ చేస్తున్నారు. 

4 Min read
Surya Prakash
Published : Apr 29 2024, 10:24 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112


మహేష్ బాబు వివాదాలకు చాలా చాలా దూరంగా ఉంటారు. బహిరంంగగా ఆయన  ఒక్క మాట తూలరు. దేనిపైనా కామెంట్ చేయటానికి ఇష్టపడరు. తన పనేదో తాను చేసుకుంటూ పోతూ సూపర్ స్టార్ స్టేటస్ ని కంటిన్యూ చేస్తున్నారు.  ఇప్పటికీ ప్రిన్స్ గానే వెలిగిపోతున్నారు. ప్రస్తుతం రాజమౌళి సినిమా కోసం ప్రిపరేషన్ లో ఉన్న మహేష్ ని ఇప్పుడు ఓ వివాదం చుట్టముడుతోంది. ఆ వివాదం మహేష్ కు నిజానికి కొత్తేమీ కాదు. కానీ ఇప్పుడు మహేష్ పీఆర్ చాలా జాగ్రత్త పడుతోంది. అటువంటివి మీడియాలో లేకుండా చూసే ప్రయత్నం చేస్తోంది.ఇంతకీ ఏం జరిగింది...

212


సూపర్ స్టార్ మహేష్  సినిమా   కార్పొరేట్ సంస్థల యాడ్స్ లో నటించడం, వాటికి అంబాసడర్లుగా వ్యవహరించడం  ఎప్పటి నుంచో చేస్తున్నారు. ఈ యాడ్స్ వ్యవహారం మొదట్లో  ఎక్కువగా బాలీవుడ్ లోనే ఉండేది. అమితాబ్ అమీర్ లాంటి వాళ్ళతో యాడ్స్ చేసినప్పుడు వాటితోనే దేశవ్యాప్తంగా మార్కెటింగ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎక్కడిక్కడ లోకల్ రీజనల్ యాడ్స్ చేస్తే బెస్ట్ అనే డెసిషన్ కు నిర్మాతలు వచ్చారు.  దానికి తోడు ఈ మధ్యకాలంలో  నార్త్ కన్నా సౌత్ సినిమా డామినేషన్ పెరిగిపోయింది. ఈ క్రమంలో యాడ్స్ లో కూడా పాన్ ఇండియాలు వస్తున్నాయి.
 

312

దాంతో మాగ్జిమం  ఇండియన్ టాప్ మోస్ట్ కార్పొరేట్ బ్రాండ్స్ అన్నీ ఇప్పుడు మహేష్ బాబు చుట్టూ తిరుగుతున్నాయి. తమ ప్రొడక్ట్స్  కోసం ఎంత ఖర్చు పెట్టినా  పర్లేదు అనే స్థాయిలో కోట్లాది రూపాయల రెమ్యునరేషన్లు ఇచ్చేందుకు రెడీ అవుతున్నాయి.  అలాగే ఆ బ్రాండ్స్ కోసం ఈవెంట్స్ కూడా చేస్తున్నారు. ఆ మధ్యన  బిగ్ సి కోసం మహేష్ ప్రత్యేకంగా ఈవెంట్ చేయడం, అందులో భాగంగా మీడియాతో పాటు ఇతర వర్గాల ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడం సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది. అలాగే  ఫ్లిప్ కార్ట్ యాడ్స్ లో మహేష్ విస్తృతంగా కనిపిస్తున్నాడు. ఈ క్రమంలోనే పాన్ బహార్ బ్రాండ్ ని కూడా ప్రమోట్ చేస్తున్నారు. అయితే అంతా బాగానే ఉన్నా ఈ పాన్ బహార్ బ్రాండ్ ని  ప్రమోటింగ్  చేచేయడం పట్ల కామెంట్స్ మొదలయ్యాయి.
 

412


తాజాగా పాన్ బహార్ ఈవెంట్ కు మహేష్ హాజరయ్యారు. దాంతో ఇలాంటి గుట్కా ప్రొడక్ట్స్ కు  మహేష్ ప్రమోట్ చేయటం ఏంటి...ఈవెంట్ కు హాజరవటం ఏమిటి అని  విమర్శస్తూ ఓ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవటం మొదలెట్టింది. ఎవరు తయారు చేసిన వీడియోనో కానీ రీచ్ బాగా ఉండటంతో మహేష్ ఫ్యాన్స్ కలవర పడ్డారు. అయితే ఇది మహేష్ పీఆర్ కు తెలిసిందేమో ..ఆ వీడియో మాయమైంది. సోషల్ మీడియా నుంచి తీసేసారు. అయితే అది పీఆర్ తీయించారో లేక మరొకరో కానీ మంచిదైంది అంటున్నారు. పీఆర్ కు ధాంక్స్ చెప్తున్నారు అభిమానులు. 

 

512

ఇక పాన్ బహార్ ని మహేష్ ప్రమోట్ చెయ్యటంలో విమర్శలు మాత్రం ఆగలేదు. పాన్ బహార్ ..ఏమీ చ్యవనప్రాశ్య్ కాదు.  పోషకాహారం కాదు. అది పేరుకు మౌత్ ఫ్రెషనర్ కానీ అందులో …తంబాకు, పొగాకు మిశ్రమాలతో చేసిన నోటి క్యాన్సర్ కు కారణమయ్యే ఒకానొక పదార్థం ఉంటుంది.  అలాగే పాన్ బహార్ లో నిషేధిత మెగ్నీషియం కార్బోనేట్ ఉందని మీడియాలో లెక్కలేనన్ని వార్తలు వచ్చాయి. వస్తున్నాయి అవేమీ మహేష్ పట్టించుకోరా అంటున్నారు. 

612


ముఖ్యంగా నార్త్ మీడియా మహేష్ ని విమర్శించటమే పనిగా పెట్టుకుంది. దాంతో మహేష్ బాబుని మహేష్ బాబు పాన్ బహార్ ప్రకటనలో నటించడం మీద డిజిటల్ ఆగ్రహం కట్టలు తెంచుకున్న రీతిలో ప్రమోట్ చేస్తున్నారు. అందుకు కారణం ఒకప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు బాలీవుడ్ ఎంట్రీ గురించి బాలీవుడ్ మీడియాలో  చేసిన వ్యాఖ్యలే.

712

మహేష్ బాబు నిర్మాతగా నిర్మించిన అడవి శేష్ మేజర్ సినిమాని హిందీలో ప్రమోట్ చేస్తున్న సమయంలో మీ బాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు అని అడిగితే మహేష్ బాబు దానికి ఆసక్తికరంగా సమాధానం ఇచ్చారు. చెబితే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కానీ నిజానికి బాలీవుడ్ నుంచి నాకు చాలా సినిమా అసలు వస్తున్నాయి కానీ నన్ను బాలీవుడ్ భరించలేదు అంటే రెమ్యూనరేషన్ పరంగా తనను తట్టుకోలేదు అంటూ కామెంట్లు చేశారు.

812


ఈ వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయ్యాయి. అయితే మహేష్ బాబు అప్పట్లో ఆ మాటలు అన్నా సరే ఇప్పుడు ప్యాన్ ఇండియా లెవిల్లో  ఎంట్రీ ఇవ్వడానికి అంతా సిద్ధమైంది,  మహేష్ బాబు వద్దు అనటానికి లేదు. ఎందుకంటే రాజమౌళికి ఉన్న మార్కెట్ దృష్ట్యా నిర్మాతలు కచ్చితంగా ఆ సినిమాను బాలీవుడ్ లో కూడా విడుదల చేస్తారు. నన్ను బాలీవుడ్  భరించలేదు అని  కామెంట్ చేసిన మహేష్ బాబు ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీకి సిద్దం అయ్యారనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దాన్ని ఈ వివాదానికి ముడి పెడుతున్నారు. 

912

ఇక మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రం ఆయన నేరుగా బాలీవుడ్ సినిమా చేయనన్నారు కానీ ఇప్పుడు ఇది తెలుగు సినిమానే డబ్బింగ్ చేసి మిగతా భాషలలో విడుదల చేస్తున్నారు కాబట్టి బాలీవుడ్ ఎంట్రీ కాదు కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు.  

1012


 సూపర్ స్టార్ మహష్ బాబుతో రాజమౌళి చేయబోతున్న సినిమా చేయబోతుండటంతో ఈ సినిమాపై అంచనాలు పీక్స్‌కు చేరాయి.  ఇక అభిమానుల  ఎదురు చూపులు ఫలించే రోజులు రానే వచ్చాయి.  ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన .. మే 31న సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే రోజున ప్రకటించనున్నారు. మహేష్ బాబు ప్రతి యేడాది తన తండ్రి పుట్టిన రోజు సందర్బంగా తన సినిమాలకు సంబంధించిన ప్రకటన చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సారి కూడా రాజమౌళితో చేయబోయే సినిమాను మే 31న అఫిషియల్‌గా ప్రకటించనున్నారు.

1112

ఆర్ఆర్ఆర్ తర్వాత ఆ సినిమా రేంజ్‌కు ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమాను  రాజమౌళి తెరకెక్కించనున్నారని తెలుస్తోంది.  ఇప్పటికే ఈ సినిమా కథ ఫైనలైజ్ అయిపోయింది.   అంతేకాదు  మహేష్ బాబు తప్ప మిగిలిన నటీనటులు ఎవరు ఫైనల్ కాలేదన్నారు. తాజాగా ఈ సినిమాలో ఆలియా భట్ మహేష్ బాబుకు జోడిగా నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరోవైపు జాన్వీ కపూర్ పేరును పరిశీలిస్తున్నారు.  మహేష్ బాబుతో చేయబోయే సినిమా నెవర్ బిఫోర్ అనే విధంగా ఉండనున్నట్టు చెప్తున్నారు. ఇప్పటికే విజయేంద్ర ప్రసాద్.. ఈ సినిమా కథతో పాటు స్రీన్ ప్లే, డైలాగ్స్ వెర్షన్స్, స్కెచెస్ కూడా పూర్తి అయినట్టు సమాచారం. ఆగష్టు 9న మహేష్ బాబు బర్త్ డే రోజు నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

1212

"నా నెక్స్ట్ మూవీ మొదలైంది. ఇప్పటికే స్క్రిప్ట్ పని పూర్తయింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కానీ ఇంకా క్యాస్టింగ్ పూర్తి కాలేదు. కేవలం హీరోను మాత్రమే సెలక్ట్ చేశాం. ఆయన పేరు మహేష్ బాబు.. తెలుగు యాక్టర్. మీలో చాలా మందికి ఆయన తెలుసు అనుకుంటా. మహేష్ చాలా అందగాడు. వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేసి రిలీజ్ టైమ్‌లో మహేష్‌ను ఇక్కడికి తీసుకువచ్చి మీ అందరికీ పరిచయం చేస్తాను." అంటూ రాజమౌళి చెప్పారు.

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
Latest Videos
Recommended Stories
Recommended image1
ఎట్టకేలకు వెంకీ కోరిక నెరవేరబోతోంది.. వెంకటేశ్వర్లు, నందు, ఆశా, పింకీ చేసే రచ్చకి గెట్ రెడీ
Recommended image2
బిగ్ బాస్ హౌస్ లో సంజన కథ ముగిసిందా ? నాగార్జున షాకింగ్ డెసిషన్
Recommended image3
ప్రభాస్ 'స్పిరిట్' లో స్టార్ హీరో భార్య ? వంగా ప్లానింగ్ నెక్స్ట్ లెవల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved