ఎన్టీఆర్ నటించిన ఆ మూవీ వేణుస్వామి బయోపికా.? ఇంతకీ ఆ సినిమా ఏంటంటే.!
Adhurs Movie: టైటిల్ చూసి కొంచెం షాక్ అయ్యారా.? ఎన్టీఆర్ చేసిన ఓ చిత్రం వేణు స్వామి బయోపికా అని అనుకుంటున్నారా.? మరి ఆ సినిమా ఏంటి.? డైరెక్టర్ ఎవరు.? అనే విషయాలు ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా..

ఇంటర్నెట్‌లో వేణు స్వామి వైరల్..
ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో సినిమాలకు పూజా కార్యక్రమాలు చేయడమే కాదు.. పలువురు సెలబ్రిటీలకు కూడా జాతకాలు చెబుతూ తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటారు వేణుస్వామి. అలాగే సెలబ్రిటీలపై ఆయన చేసే పలు నెగటివ్ కామెంట్స్‌కు కూడా విమర్శలు పాలవుతుంటారు.
గతంలో చేసిన కామెంట్స్ వైరల్..
గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో జ్యోతిష్యుడు వేణు స్వామి చేసిన పలు కామెంట్స్ మళ్లీ ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. ఆయన ఎన్టీఆర్ సినిమా గురించి మాట్లాడారు. ఎన్టీఆర్ నటించిన ఓ సూపర్ హిట్ చిత్రం తన బయోపిక్ చిత్రం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అదుర్స్ సినిమా..
ఎన్టీఆర్, దర్శకుడు వివి వినాయక్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం 'అదుర్స్'. ఈ మూవీలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేశాడు. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎంతటి సక్సెస్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 'చారి' పాత్రలో ఎన్టీఆర్ తన నటనా విశ్వరూపాన్ని ప్రదర్శించాడు.
రెండు పాత్రలు నావే..
వివి వినాయక్ తీసిన ఈ చిత్రం తన బయోపిక్ చిత్రం అని.. ఇందులో ఎన్టీఆర్ నటించిన రెండు పాత్రలు తనవేనని వేణుస్వామి అన్నారు. ఈ చిత్రం పూజా కార్యక్రమంలో ఎన్టీఆర్ కొట్టిన కొబ్బరికాయలో పువ్వు వచ్చిందని.. అప్పుడే ఈ సినిమా సక్సెస్ అవుతుందని తానే చెప్పానని పేర్కొన్నారు. ఇక ఈ కామెంట్స్ అప్పట్లో విపరీతంగా వైరల్ అయ్యాయి.
ఎన్టీఆర్ ప్రస్తుతం మూవీస్..
ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'డ్రాగన్' మూవీ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే.. 'దేవర-2' సినిమాపై త్వరలోనే ఓ కీలక అప్‌డేట్ రానుంది. ఆపై త్రివిక్రమ్‌తో కలిసి కూడా ఓ సినిమా చేయనున్నారని టాక్.

