MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఈ మూవీతోనేనా?.. ఇంట్రెస్టింగ్ బజ్.. నిజమైతే రచ్చే!

జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఈ మూవీతోనేనా?.. ఇంట్రెస్టింగ్ బజ్.. నిజమైతే రచ్చే!

బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడనేది ఆసక్తికరంగా మారుతోంది.  మరోవైపు సౌత్ హీరోలపై జాన్వీ కామెంట్స్ కూడా అతి త్వరలోనేని సూచిస్తున్నాయి.  ఈ క్రమంలో ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తోంది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 29 2022, 06:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

అతిలోక సుందరి, దివంగత శ్రీదేవి - స్టార్ ప్రొడ్యూసర్ బోణీ కపూర్ కూతురు జాన్వీ కపూర్ (Janhvi Kapoor) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.  స్టార్ కిడ్ గా, బాలీవుడ్ యువనాయికగా యూత్ లో మంచి ఫాలోయింగ్ పెంచుకుంది.  సోషల్ మీడియాలో ఈ బ్యూటీ క్రేజ్ చూస్తే మతిపోక తప్పదు. 
 

26

అయితే కొద్దిరోజులుగా జాన్వీకపూర్ టాలీవుడ్ కు ఎంట్రీ ఇవ్వబోతుందంటూ నెట్టింట తెగ వార్తలు పుట్టుకొచ్చాయి.  మరోవైపు సౌత్ స్టార్లపై జాన్వీ కపూర్ కూడా పలు టీవీ షోలల్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేయడంలోనూ టాలీవుడ్ కు త్వరలోనే ఎంట్రీ ఇవ్వబోతుందనే సంకేతం కనిపించింది. 
 

36

ఇప్పటికే సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) సరసన నటించబోతుందని ప్రచారం జరిగింది. కానీ అందులో నిజం లేదని తేలిపోయింది. ఇక రీసెంట్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) సరసన నటించే అవకాశం దక్కించుకుందనే న్యూస్ కూడా నెట్టింట దుమారం రేపింది.

46

అయితే, ఎన్టీఆర్ 30 విషయంలో జాన్వీ కపూర్ స్పందిస్తూ.. ‘అలాందేమీ లేదని.. నిజంగా ఎన్టీఆర్ తో నటించే అవకాశం వస్తే బాగుండు’ అని ఆసక్తికరంగా స్పందించింది. విజయ్ తో, ఎన్టీఆర్ సినిమాలో జాన్వీ పక్కా కాలేదని అర్థమవుతోంది. మరీ జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడనేది మరింత ఆసక్తిగా మారింది.

56

ఈ క్రమంలో తాజాగా ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ అయ్యింది. నిన్ననే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), దర్శకుడు బుచ్చిబాబుతో ‘ఆర్సీ16’ చిత్రాన్ని ప్రకటించిన విషయం  తెలిసిందే. దీంతో హీరోయిన్ గా జాన్వీ కపూర్ ను ఎంపిక చేసుకుంటే ఎలా ఉంటుందని చర్చిస్తున్నారంట. దీనిపై మున్ముందు ఇంకా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
 

66

చెర్రీ సరసన జాన్వీ నటిస్తే ఆమె కేరీర్ కూడా మరింత దూసుకుపోతుందని, జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ కూడా గ్రాండ్ గా ఉంటుందని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో నిజమెంతనేది మరికొద్దిరోజుల్లో తెలిసిపోతోంది. ప్రస్తుతం జాన్వీ కపూర్ తన హిందీ ఫిల్మ్ ‘మిస్టర్ అండ్ మిస్ మహి’ చిత్ర షూటింగ్ లో బిజీగా  ఉంది. 
 

About the Author

SG
Sreeharsha Gopagani
జాన్వీ కపూర్

Latest Videos
Recommended Stories
Recommended image1
సంజూ శాంసన్ vs కీర్తి సురేష్ .. వీరిలో నెంబర్ 1 ఎవరో తెలుసా..?
Recommended image2
Maheshbabu కోసం కదిలి వచ్చిన పవన్ కళ్యాణ్‌, వెంకటేష్‌, నాగార్జున.. కట్‌ చేస్తే సినిమా ఫ్లాప్‌
Recommended image3
1000 Crore Heroes: వెయ్యి కోట్లకుపైగా కలెక్షన్లని రాబట్టిన హీరోలు వీరే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved