నాగార్జున జుట్టు ఒరిజినలా లేక విగ్గా... పర్సనల్ మేకప్ మెన్ బయటపెట్టిన రహస్యం ఇదే!
కింగ్ నాగార్జున అందానికి చిరునామా. సిక్స్టీ ప్లస్ లో కూడా చక్కని రూపం మైంటైన్ చేస్తున్నారు. కాగా నాగార్జునను చూడగానే ఆకట్టుకునే విషయం ఆయన జుట్టు. నిండుగా కనిపించే ఆయన జుట్టు ఒరిజినలా లేక విగ్గా అనే సందేహం ఉంది.

Nagarjuna Akkineni
నాగార్జున టాలీవుడ్ మన్మధుడు. ఒకప్పటి అమ్మాయిల కలల రాకుమారుడు. ఈ జనరేషన్ అమ్మాయిలు కూడా నాగార్జునను చూస్తే ఐ లవ్ యూ చెప్పేస్తారు. బిగ్ బాస్ వేదికగా పలువురు అందమైన భామలు నాగార్జున మీద తమ క్రష్ చాటుకున్నారు.
నాగార్జున క్రమశిక్షణతో కూడిన లైఫ్ స్టైల్ కలిగి ఉన్నారు. తాజా ఆహారం తింటూ, వ్యాయామం చేస్తూ, కంటినిండా నిద్రపోతూ వయసు పెరగకుండా జాగ్రత్తపడుతున్నారు. జెనెటిక్ గా నాన్న ద్వారా వచ్చిన అందంతో పాటు, నా లైఫ్ స్టైల్... ఫిట్నెస్ సీక్రెట్ అని నాగార్జున కొన్ని సందర్భాల్లో చెప్పాడు.
నాగార్జునలో మెచ్చుకోవాల్సిన గొప్ప విషయం ఆయన హెయిర్ స్టైల్. 60 ఏళ్ల వయసులో కూడా ఒత్తైన జుట్టును నాగార్జున కలిగి ఉన్నారు. ఆయన తర్వాత జనరేషన్ స్టార్స్ లో చాలా మంది విగ్గుతో మేనేజ్ చేస్తున్నారు. మరి నాగార్జున జుట్టు ఒరిజినలా? లేక విగ్గు వాడుతున్నాడా? అనే సందేహాలు ఉన్నాయి.
దీనికి నాగార్జున వద్ద పనిచేసిన మేకప్ ఆర్టిస్ట్ సమాధానం చెప్పాడు. చంద్ర అనే వ్యక్తి చాలా కాలం నాగార్జునకు పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్ గా ఉన్నాడట. చంద్రను ఆయన సొంత ఫ్యామిలీ వలె ట్రీట్ చేసేవాడట. చంద్ర ఓ ఇంటర్వ్యూలో... నాగార్జున విగ్ వాడరని క్లారిటీ ఇచ్చాడు. ఆయనది నిజమైన జుట్టు అని వెల్లడించారు.
నాగార్జున కేవలం అన్నమయ్య మూవీలో విగ్ ఉపయోగించాడట. అన్నమయ్యలో నాగార్జున డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ లో కనిపిస్తాడు. ఈ కారణంగా విగ్ అవసరమైందట. ఏదైనా మిడిల్ ఏజ్ రోల్ చేయాల్సి వచ్చినప్పుడు ఎక్స్టెన్షన్ చేసేవాడట. ఇప్పటికి కూడా నాగార్జునది ఒరిజినల్ జుట్టే అని ఆయన వెల్లడించారు.
అయితే చంద్ర ఇప్పుడు నాగార్జున వద్ద లేదట. ఒకసారి నాగార్జునకు చెప్పకుండా చంద్ర వాళ్ళ ఊరు వెళ్ళాడట. ఆ విషయంలో నాగార్జున చంద్ర మీద కోప్పాడాడట. ఆ సంఘటన తర్వాత దూరం పెరిగిందని చంద్ర చెప్పుకొచ్చాడు.ఈ మేరకు ఓ న్యూస్ వైరల్ అవుతుంది.