MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Custody : నాగచైతన్య ‘కస్టడీ’.. స్టోరీ ఆ సినిమా నుంచి కొట్టేశారా?

Custody : నాగచైతన్య ‘కస్టడీ’.. స్టోరీ ఆ సినిమా నుంచి కొట్టేశారా?

మూడు రోజుల్లో నాగచైతన్య ‘కస్టడీ’ ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్  సినిమాపై ఆసక్తిని పెంచింది. కాగా, కథకు సంబంధించి క్రేజీ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : May 10 2023, 09:07 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

సినిమా బ్లాక్ బాస్టర్ గా నిలవాలంటే స్టోరీ ప్రధానమే విషయం తెలిసిందే. కథ బాగుంటే చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన చిత్రాలు ఆడియెన్స్ ను మెప్పించడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అయితే, రోటీన్ కు భిన్నంగా సినిమాలను రూపొందించేందుకు దర్శకనిర్మాతలు మొగ్గుచూపుతున్నారు. ఇందుకోసం కొత్తకథలను ఎంపిక చేసుకునేందుకు తమవంతు ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో హాలీవుడ్ చిత్రాల నుంచి కూడా ప్రేరణ పొందిన ఘటనలు కూడా ఉన్నాయి.
 

36

కాగా, అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) నటించిన Custody కథ గురించి కూడా ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది. 2012 ఫిబ్రవరి 17లో ప్రముఖ దర్శకుడు డేనియల్ ఎస్పినోసా డైరెక్షన్ లో వచ్చిన Safe House నుంచి కథను తీసుకున్నట్టు పలువురు అభిప్రాయపడుతున్నారు.
 

46

‘కస్టడీ’ నుంచి ఇప్పటికే వచ్చిన ట్రైలర్, ‘సేఫ్ హౌజ్’ ట్రైలర్ కూడా చాలా దగ్గరగా కనిపిస్తుంటుంది. కథ పరంగా చూస్తే స్టోరీ లైన్ ఒకేలా కనిపిస్తోంది. ఎన్నో హత్యలకు కారణమైన వ్యక్తిని జైలు నుంచి తప్పించడమే ఈ సినిమా కథగా తెలుస్తోంది. ఇదే స్టోరీ లైన్ తో ‘కస్టడీ’ కూడా ప్రేక్షకుల ముందుకు రానుందని అంటున్నారు. వెంకట్ ప్రభు మరిన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ను జోడీ చేయడంతో సినిమా ఆసక్తికరంగా మారింది.
 

56

ఇప్పటి వరకు విడుదలైన చిత్ర ప్రమోషనల్ మెటీరియల్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ముఖ్యంగా కథపై ఆస్తని పెంచడం, నాగ్య చైతన్య కూడా తొలిసారిగా పోలీసు పాత్రలో నటిస్తుండటం.. పెర్ఫామెన్స్ కూడా మెప్పించేలా కనిపిస్తుండటంతో సినిమాపై హైప్ పెరిగింది. 
 

66

‘బంగార్రాజు’ తర్వాత  నాగచైతన్య - కృతి శెట్టి  జంటగా నటిస్తున్నారు. వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై నిర్మాత చిత్తూరి శ్రీనివాస్ నిర్మించారు. మే12న చిత్రం ఐదు భాషలతో పాటు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు కానుంది. మాస్ట్రో ఇళయరాజా, కొడుకు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. 
 

About the Author

SG
Sreeharsha Gopagani
హాలీవుడ్
నాగ చైతన్య
Latest Videos
Recommended Stories
Recommended image1
Kajal Aggarwal: మహేష్ బాబు వస్తాడనుకుంటే కాజల్ అగర్వాల్ కలలోకి వచ్చి భయపెట్టిన డైరెక్టర్ ఎవరో తెలుసా?
Recommended image2
10th Class Heroine: అమ్మ రెండో పెళ్లి, 120 కేజీల బరువుపై నటి ఆవేదన.. ప్రభాస్ కోసం రోజూ ప్రార్థిస్తున్నా
Recommended image3
Korean Kanakaraju Review: కొరియన్‌ కనకరాజు మూవీ ఫస్ట్ రివ్యూ.. వరుణ్‌ తేజ్‌కి ఈ సారి హిట్‌ పక్కా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved