మత్తు చూపులు.. కొంటె పోజులు.. లెహంగా వోణీలో దీప్తి సునైనా అదిరిపోయే లుక్..
బిగ్ బాస్ తెలుగు ఫేమ్ దీప్తి సునైనా (Deepthi Sunaina) ట్రెడిషనల్ లుక్ లో ఆకట్టుకుంటోంది. అందాల విందులో ఏమాత్రం తగ్గనంటోంది. లేటెస్ట్ పిక్స్ తో నెటిజన్లను అట్రాక్ట్ చేస్తోంది.

యూట్యూబ్ సెన్సేషన్ దీప్తి సునైనా డాన్సర్ గా, షార్ట్ ఫిల్మ్స్ యాక్ట్రెస్ గా యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంది. గతంలో జాబ్ చేసిన ఈ బ్యూటీ తెలుగు ఇండిస్ట్రీలో టాప్ హీరోయిన్ గా ఎదగాలనే కలలు కంటోంది. తన డ్రీమ్ ను నెరవేర్చుకునే దిశగా అడుగులేస్తోంది.
యూట్యూబ్, డబ్ స్మాష్ వీడియోస్ ద్వారా కాస్తా క్రేజ్ సంపాదించిన ఈ బ్యూటీ.. అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్ తెలుగు’ (Bigg Boss Telugu) సీజన్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ షో నుంచి బయటికి వచ్చిన తర్వాత దీప్తికి మరింత క్రేజ్ పెరిగింది.
అప్పటి వరకు దీప్తికి ఉన్నక్రేజ్ కు బిగ్ బాస్ సీజన్ 2 టైటిల్ విన్నర్ గా నిలుస్తుందని ప్రేక్షకులు భావించారు. కానీ దక్కించుకోలేకపోయింది. కానీ ఈ పాపులర్ రియాలిటీ షోతో మాత్రం టెలివిజన్ ప్రేక్షకులకు చాలా దగ్గరైంది. ఈ దెబ్బతో అటుు పలు టీవీ షోలకు గెస్ట్ గానూ హాజరై ఆడియెన్స్ ను అలరించింది.
ప్రస్తుతం ఈ బ్యూటీ వెండితెరపై మెరిసేందుకు ప్రయత్నిస్తోంది. ఇటు యూట్యూబ్ లోనే తెలుగు మ్యూజిక్ వీడియోల్లో నటిస్తూ తన పాపులారిటీని పెంచుకుంటోంది. పాపులారిటీ విషయానికొస్తే దీప్తి ముఖ్యంగా ఇంటర్నెట్ ఫ్యాన్స్ ను టార్గెట్ చేస్తూ.. తన వెపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది.
ఈ సందర్భంగా క్రేజీ ఫొటోషూట్లు చేస్తోంది. గ్లామర్ షోలోనూ ఏమాత్రం తగ్గడం లేదు. లేత అందాలను విందు చేస్తూ నెటిజన్లను అట్రాక్ట్ చేస్తోంది. ఆకట్టుకునే అవుట్ ఫిట్స్ లో అదిరిపోయేలా ఫొటోషూట్లు చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ పోస్ట్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
రెడ్ లెహంగా, వోణీలో దీప్తి సునైనా చూడసక్కగా కనిపిస్తోంది. సుందరరూపంతో, ప్రకాశవంతమైన తేజస్సుతో తన ఫాలోవర్స్, అభిమానులకు ఆకట్టుకుంటోంది. మత్తు చూపులు, కొంటె ఫొటోజులతో కుర్రకారును ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. నడుము అందాలను అన్నీ యాంగిల్లో చూపిస్తూ హార్ట్ బీట్ పెంచుతోంది. దీప్తి పోస్ట్ చేసిన పిక్స్ తో ఆమె అభిమానులు ఖుషీ అవుతున్నారు.