Krishnam Raju : రెబల్ స్టార్ కృష్ణంరాజు గురించి ఈ ఆసక్తికరమైన విషయాలు మీకు తెలుసా?
దివంగత కృష్ణంరాజు Krishnam Raju టాలీవుడ్ చెరగని ముద్ర వేసుకున్నారు. వ్యక్తిగతంగానూ మనసున్న మారాజు అనిపించుకున్నారు. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.
రెబల్ స్టార్, దివంగత కృష్ణం రాజు జయంతి (Krishnam Raju) నేడు. ఈ సందర్భంగా ఆయన సొంతూరు మొగల్తూరులో ఈరోజు జయంతి వేడుకలు గ్రాండ్ గా జరుగుతున్నాయి. పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇవాళ పేదలకు ఉచితవైద్యం చేయించారు.
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనదైన ముద్రవేసుకున్న కృష్ణంరాజు 2022 సెప్టెంబర్ 1న మరణించారు. ఇక ఇవ్వాళ ఆయన జయంతి కావడం విశేషం. ఈ సందర్భంగా అభిమానులు ఆయనకు నివాళి అర్పిస్తున్నారు.
ఈ క్రమంలో కృష్ణంరాజుకు సంబంధించిన కొన్ని విషయాలు ఆసక్తికరంగా మారాయి. వాటి గురించి తెలుసుకుందాం. కృషం రాజు 1940 జనవరి 20న పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించారు. ఆయన పూర్తిపేరు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు. స్క్రీన్ నేమ్ కృష్ణంరాజు అని తెలిసిందే.
కృష్ణంరాజు సినిమాల్లోకి రాకుందుకు ఆంధ్రరత్న పత్రికలో ఫొటోగ్రాఫర్ గా పనిచేశారంట. 1966లో ‘చిలకా గోరింక’ సినిమాతో హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. 200 సినిమాల్లో హీరోగా, విలన్ గా నటించి మెప్పించారు.
మొదట సీతాదేవిని పెళ్లి చేసుకున్నారు. ఆమె ప్రమాదంలో మరణించడంతో 1996 సెప్టెంబర్ 20న శ్యామలాదేవితో రెండో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు కుతూర్లు ఉన్నారు. ఇక మొదటి భార్యతో ఉన్నప్పుడు ఓ పాపను దత్తతకు కూడా తీసుకున్నారు. సాయి ప్రసీద, సాయి ప్రకీర్తి, సాయి ప్రదీప్తి, దత్త కూతురు పేరు ప్రశాంతి. ఇలా నలుగురు పిల్లలకు తండ్రి అయ్యారు.
కృష్ణంరాజు తన అన్న స్థాపించిన గోపీకృష్ణ మూవీస్ బ్యానర్ లో చాలా సినిమాలు నిర్మించారు. ప్రస్తుతం ఆ బాధ్యతలను ప్రసీద చూస్తున్నారు. ఇక కృష్ణంరాజుకు కబడ్డీ, యోగా అంటే చాలా ఇష్టం. అలాగే పుస్తకాలు కూడా చదవడానికి ఇష్టపడుతుంటారు.ఇక ఎంపీగా కూడా ప్రజా సేవాచేశారు.