MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • గంగమ్మ జాతరలో పుష్పరాజ్ బలిచ్చేది అతడినేనా ?.. టీజర్ సంతృప్తికరంగా ఉందా..

గంగమ్మ జాతరలో పుష్పరాజ్ బలిచ్చేది అతడినేనా ?.. టీజర్ సంతృప్తికరంగా ఉందా..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాస్ జాతర మొదలైంది. నేడు అల్లు అర్జున్ తన 42వ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. బన్నీ బర్త్ డే సందర్భంగా ఆ జోష్ ని మరింత పెంచేలా పుష్ప 2 చిత్ర యూనిట్ టీజర్ రిలీజ్ చేసింది.

2 Min read
Author : Tirumala Dornala
| Updated : Apr 08 2024, 03:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాస్ జాతర మొదలైంది. నేడు అల్లు అర్జున్ తన 42వ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. బన్నీ బర్త్ డే సందర్భంగా ఆ జోష్ ని మరింత పెంచేలా పుష్ప 2 చిత్ర యూనిట్ టీజర్ రిలీజ్ చేసింది. ఈ టీజర్ పై బన్నీ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పుష్ప మొదటి భాగం పాన్ ఇండియా స్థాయిలో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

దీనితో పుష్ప 2 పై కనివిని ఎరుగని అంచనాలు ఉన్నాయి. దీనితో బన్నీ బర్త్ డే రోజున టీజర్ అంటూ చాలా రోజుల నుంచే హంగామా నడిచింది. టీజర్ అయితే బాగానే ఉంది కానీ.. కేవలం నిమిషం నిడివితో ఎలాంటి డైలాగ్ లేకుండా సుకుమార్ కాస్త డిజప్పాయింట్ చేశాడు. 

38

గంగమ్మ జాతరలో అల్లు అర్జున్ లేడీ గెటప్ లో కనిపిస్తాడని ఆల్రెడీ పోస్టర్ రిలీజ్ చేసారు. ఇప్పుడు అదే లుక్ తో చిన్న ఫైట్ సీన్ ని కట్ చేసి టీజర్ గా వదిలారు బన్నీ  గెటప్, మాస్ యాటిట్యూడ్ అదిరిపోయింది కానీ.. కంప్లీట్ గా కిక్కివ్వలేదు. ఒక్క పవర్ ఫుల్ డైలాగ్ ఉన్నా బావుండేది అనేది ఫ్యాన్స్ వాదన. 

48

మూవీ రిలీజ్ కి ఇంకా నాలుగు నెలల టైం ఉండడంతో ఈ మాత్రం స్టఫ్ ఇవ్వడమే ఎక్కువ అని చిత్ర యూనిట్ భావించారో ఏమో మరి. అయితే టీజర్ ద్వారా మరోసారి తిరుపతి గంగమ్మ జాతర హాట్ టాపిక్ గా మారింది. సినిమా రేంజ్ కి తగ్గట్లుగా సుకుమార్ జాతర సీక్వెన్స్ లో భారీ గా అదిరిపోయే విజువల్స్ తో తెరకెక్కించినట్లు ఉన్నారు. 

 

58

గంగమ్మ జాతరలో ఫైట్ సీన్ అంటే సినిమాకే హైలైట్ అయ్యే విధంగా ఉండాలి. ఈ సీన్ లో పుష్పరాజ్ ఎవరిని బలి తీసుకోబోతున్నాడు అనే ఉత్కంఠ నెలకొంది. ఇందులో ప్రధానంగా విలన్ల గురించి చెప్పుకోవాలంటే జాలి రెడ్డి, ఎస్పీ భన్వర్ సింగ్ షికావత్ గా ఫహద్ ఫజిల్, అనసూయ, మంగళం శ్రీను గా సునీల్ ఉన్నారు. 

68

తిరుపతిలో గంగమ్మ జాతరలో కొంత భాగం కథ విషయానికి వస్తే.. తిరుపతి పొలిమేరల్లో 7 మంది గ్రామదేవతలు ఉన్నారు. వారిలో చినగంగమ్మ తల్లి ఒకరు. ఆమె పెళ్లి కాని యువతి. అప్పట్లో తిరుపతి పాలెగాడు చినగంగమ్మని చూసి మోహించి బలవంతం చేయబోతాడట. దీనితో ఆమె ఉగ్రరూపం దాల్చి అతడిని వేటాడుతుంది. 

78

పాలెగాడు భయపడి దాక్కుంటాడు. ఈ క్రమంలో పాలెగాడిని అంతం చేయడానికి చినగంగమ్మ తల్లి వివిధ మరువేషాల్లో వెతుకుతుంది. ఒకరోజు దొర వేషంలో పాలెగాడిని పిలుస్తుంది. తన కోసం దొర వచ్చాడని పాలెగాడు బయటకి వస్తాడు. వెంటనే ఆమె ఉగ్రరూపం దాల్చి అతడిని సంహరిస్తుంది. దుష్టుడైన పాలెగాడిని సంహరించినందుకు ఆమెకి ప్రజలు జాతర చేయడం ఆనవాయితి. 

88

జాతరలో కొందరు పురుషులు కూడా ఆడవారి వేషం కట్టడం ఇక్కడ సాంప్రదాయం. పుష్ప 2లో పాలెగాడికి దగ్గర పోలికలు ఉండే పాత్ర జాలి రెడ్డిది. జాలిరెడ్డికి అమ్మాయిల పిచ్చి ఎక్కువ అని మొదటి భాగంలో చూపించారు. మొదటి భాగంలో జరిగిన గొడవగా వల్ల అవకాశం దొరికితే పుష్ప రాజ్ అంతు చూడాలని జాలిరెడ్డి కాచుకు కూర్చున్నాడు. అల్లు అర్జున్ అమ్మవారి వేషంలో సంహరించేది జాలి రెడ్డి నేనా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
అల్లు అర్జున్

Latest Videos
Recommended Stories
Recommended image1
ఓటీటీలో ట్రెండింగ్ సైకో థ్రిల్లర్.. దేశాన్ని వణికించిన సీరియల్ కిల్లర్ కథ..
Recommended image2
Irumudi Record: 105 ఏళ్ల రికార్డ్ బ్రేక్, బాహుబలి, RRR, పుష్ప వల్ల కూడా కాలేదు.. చరిత్ర సృష్టించిన రవితేజ సినిమా
Recommended image3
Srikanth: స్టార్ హీరో ఆఫర్లన్నీ కొట్టేసిన శ్రీకాంత్.. మాస్ హీరో కామ్‌గా ఉండటానికి కారణమేంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved