- Home
- Entertainment
- ఒక్క లిప్ లాక్ సీన్ తో స్టార్ హీరోయిన్ పర్సనల్ లైఫ్ నాశనం, 20 ఏళ్ళు పెద్దవాడైన హీరోతో ఎఫైర్ ?
ఒక్క లిప్ లాక్ సీన్ తో స్టార్ హీరోయిన్ పర్సనల్ లైఫ్ నాశనం, 20 ఏళ్ళు పెద్దవాడైన హీరోతో ఎఫైర్ ?
టాలీవుడ్ లో మెరుపులా వచ్చి వెళ్లిపోయిన హీరోయిన్లు చాలా మంది ఉన్నారు. హీరోయిన్ల వ్యక్తిగత జీవితానికి సంబంధించి అనేక రూమర్స్ వైరల్ అవుతుంటాయి.

Simran
టాలీవుడ్ లో మెరుపులా వచ్చి వెళ్లిపోయిన హీరోయిన్లు చాలా మంది ఉన్నారు. హీరోయిన్ల వ్యక్తిగత జీవితానికి సంబంధించి అనేక రూమర్స్ వైరల్ అవుతుంటాయి. అప్పట్లో సిమ్రాన్ గురించి కూడా చాలా రూమర్స్ వినిపించాయి. సిమ్రాన్ తెలుగులో నటించింది తక్కువ చిత్రాల్లో మాత్రమే. కొన్నేళ్లు మాత్రమే తెలుగులో సిమ్రాన్ హవా కొనసాగింది. కానీ ఆ కొన్నేళ్లలో సిమ్రాన్ చెరగని ముద్ర వేసింది. ఏకంగా 3 ఇండస్ట్రీ హిట్ చిత్రాలు తెలుగులో సిమ్రాన్ కి నమోదయ్యాయి.
Simran
సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు, కలిసుందాం రా లాంటి ఇండస్ట్రీ హిట్ చిత్రాల్లో సిమ్రాన్ నటించింది. తెలుగులో సిమ్రాన్ గురించి ఎలాంటి రూమర్స్ లేవు. కానీ తమిళ సినిమా కోలీవుడ్ లో సిమ్రాన్ పై అనేక రూమర్స్ ప్రచారంలో ఉన్నాయి. దళపతి విజయ్ తో సిమ్రాన్ కెరీర్ బిగినింగ్ లో ప్రేమ వ్యవహారం సాగించిందట. ఆ తర్వాత డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ప్రేమలో పడింది. ఆయన ఎవరో కాదు రాజు సుందరం. ప్రముఖ కొరియోగ్రాఫర్ రాజు సుందరం, సిమ్రాన్ మధ్య అప్పట్లో ఘాడమైన లవ్ ఎఫైర్ సాగిందట. సీక్రెట్ గా వీళ్లిద్దరికీ ఎంగేజ్మెంట్ జరిగినట్లు కూడా రూమర్స్ వచ్చాయి.
Actress Simran
అంతా బాగానే ఉందనుకుంటున్న సమయంలో సిమ్రాన్.. కమల్ హాసన్ తో కలసి బ్రహ్మచారి అనే చిత్రంలో నటించింది. ఈ చిత్రంలో నటించే సమయానికి సిమ్రాన్, రాజు సుందరం ప్రేమలో ఉన్నారట. ఎంగేజ్మెంట్ జరిగినట్లు కూడా వార్తలు ఉన్నాయి. రాజు సుందరంకి చెప్పకుండా సిమ్రాన్ ఈ మూవీలో కమల్ హాసన్ తో లిప్ లాక్ సన్నివేశంలో నటించిందట. దానివల్ల రాజు సుందరం, సిమ్రాన్ మధ్య తీవ్రమైన మనస్పర్థలు ఏర్పడ్డాయి అని వార్తలు వచ్చాయి.
Simran
చివరికి ఇద్దరి మధ్య బ్రేకప్ జరిగినట్లు తెలుస్తోంది. కమల్ హాసన్.. తన రెండవ భార్య సారిక నుంచి విడిపోయాక.. సిమ్రాన్ అతడి ప్రేమలో పడినట్లు కూడా ప్రచారం ఉంది. వయసులో కమల్ తనకంటే 20 ఏళ్ళు పెద్దవాడైనప్పటికీ అతడికి పెళ్లి చేసుకోవాలని సిమ్రాన్ ఒక దశలో భావించిందట.
Simran
కానీ అంతలోనే కమల్ గౌతమి ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత సిమ్రాన్ కెరీర్ ఒక్కసారిగా పడిపోయింది. పర్సనల్ లైఫ్ లో కూడా సిమ్రాన్ ఇబ్బందులు ఎదుర్కొంది. చివరికి సిమ్రాన్ తన స్నేహితుడు దీపక్ ని వివాహం చేసుకుని కెరీర్ లో సెటిల్ అయింది.