- Home
- Entertainment
- Jr NTR: భార్యకి గిఫ్ట్ గా 6.5 ఎకరాల ఫామ్ హౌస్.. ఆ పేరు పెట్టిన ఎన్టీఆర్, నందమూరి ఫ్యాన్స్ సూపర్ హ్యాపీ
Jr NTR: భార్యకి గిఫ్ట్ గా 6.5 ఎకరాల ఫామ్ హౌస్.. ఆ పేరు పెట్టిన ఎన్టీఆర్, నందమూరి ఫ్యాన్స్ సూపర్ హ్యాపీ
యంగ్ ఎన్టీఆర్ ఎంత బిజీగా ఉన్నా తన ఫ్యామిలీకి సమయం కేటాయిస్తారు. భార్య, పిల్లలు అంటే తారక్ కి ప్రాణం. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మి ప్రణతి పెద్దగా మీడియాకి కనిపించరు.

యంగ్ ఎన్టీఆర్ ఎంత బిజీగా ఉన్నా తన ఫ్యామిలీకి సమయం కేటాయిస్తారు. భార్య, పిల్లలు అంటే తారక్ కి ప్రాణం. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మి ప్రణతి పెద్దగా మీడియాకి కనిపించరు. కానీ ఎన్టీఆర్ బిజీగా ఉంటే పిల్లల బాధ్యత చూసుకునేది లక్ష్మీ ప్రణతే. తన భార్య అంటే ఎన్టీఆర్ కి ఎంత ప్రేమో చెప్పడానికి ఇటీవల ఓ సంఘటన జరిగింది.
గత ఏడాది ఎన్టీఆర్ రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలానికి చెందిన గోపాలపురం గ్రామ పరిధిలో ఆరున్నర ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు. ఆ సమయంలో రిజిస్ట్రేషన్ పనుల కోసం ఎన్టీఆర్ శంకర్ పల్లి ఎమ్మార్వో ఆఫీస్ లో మెరిసిన సంగతి తెలిసిందే. ఆ వ్యవసాయ భూమిలో ఎన్టీఆర్ ఫామ్ హౌస్ ని నిర్మించారట. ఆ ఫామ్ హౌస్ ని తారక్ తన సతీమణి లక్ష్మీ ప్రణతికి బర్త్ డే గిఫ్ట్ గా ఇచ్చారు.
<p>जूनियर एनटीआर ने फिल्मों के साथ अफेयर के लिए चर्चा में रहे हैं। रिपोर्ट्स की मानें तो भूमिका चावला के साथ इनका अफेयर रहा था। वह एक फिल्म के लिए 18 से 20 करोड़ फीस लेते हैं। उनको टॉलीवुड का सलमान खान भी कहा जाता है। कहा जाता है कि वे जिस फिल्म में भी काम करते हैं वो फिल्में सुपरहिट हो जाती है।</p>
తాజా సమాచారం మేరకు ఎన్టీఆర్ ఆ ఫామ్ హౌస్ కి 'బృందావనం' అని పేరు పెట్టినట్లు తెలుస్తోంది. కంప్లీట్ గ్రీన్ గ్రాస్, చెట్లతో ఎంతో అందంగా ఆ ఫామ్ హౌస్ ఉంటుందట. దీనితో బృందావనం అనే పేరు ఫామ్ హౌస్ కి పర్ఫెక్ట్ గా సరిపోతుందని తారక్ భావించాడు.
బృందావనం పేరు వినగానే ఫ్యాన్స్ కి ఎన్టీఆర్ సూపర్ హిట్ మూవీ గుర్తుకు వస్తుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది.
కుటుంబ సభ్యులతో, బంధువులతో, క్లోజ్ ఫ్రెండ్స్ తో సరదాగా గడిపేందుకు, పార్టీలు గట్రా చేసుకునేందుకు తారక్ ఈ ఫామ్ హౌస్ ని ఉపయోగిస్తున్నారట. హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో చాలా మంది టాలీవుడ్ సెలెబ్రిటీలకు ఫామ్ హౌస్ లు ఉన్న సంగతి తెలిసిందే.
ఇక ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ లాంటి భారీ విజయం తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. కొరటాల మూవీ తర్వాత తారక్ పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో నటించాల్సి ఉంది.