MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • టాలీవుడ్ లోకి కొత్త నిర్మాణ సంస్థ ఎంట్రీ, తొలి చిత్రంగా సైకలాజికల్ థ్రిల్లర్

టాలీవుడ్ లోకి కొత్త నిర్మాణ సంస్థ ఎంట్రీ, తొలి చిత్రంగా సైకలాజికల్ థ్రిల్లర్

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎప్పటికప్పుడు కొత్త తరం నటులు, నిర్మాతలు, దర్శకులు వస్తూనే ఉంటారు. తాజాగా ఇన్నోలెన్స్ ప్రొడక్షన్స్ అనే కొత్త నిర్మాణ సంస్థ ప్రారంభమైంది. ఈ సంస్థ నుంచి రాబోయే తొలి చిత్రం గురించి ఇక్కడ తెలుసుకోండి. 

2 Min read
Author : Tirumala Dornala
| Updated : Aug 01 2025, 12:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఇన్నోలెన్స్ ప్రొడక్షన్స్ లాంచ్
Image Credit : Asianet News

ఇన్నోలెన్స్ ప్రొడక్షన్స్ లాంచ్

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలోకి మరో కొత్త నిర్మాణ సంస్థ ఎంట్రీ ఇచ్చింది. ఇన్నోలెన్స్ ప్రొడక్షన్స్ అనే పేరుతో ఈ నిర్మాణ సంస్థని ప్రారంభించారు. బోల్డ్ గా ఉండే కథలు ఎంచుకుంటూ, నూతన నటీనటుల్ని, టెక్నీషియన్లని ప్రోత్సాహించడమే లక్ష్యంగా ఈ నిర్మాణ సంస్థ ప్రారంభమైంది. ఇదే సందర్భంలో, నిర్మాణ సంస్థని ప్రారంభించిన రోజే తొలి చిత్రాన్ని కూడా లాంచ్ చేశారు. ప్రొడక్షన్ నం.1 ప్రారంభించి లీడ్ పెయిర్ ని కూడా అనౌన్స్ చేశారు.

DID YOU
KNOW
?
పీడకలల నేపథ్యంలో సైకలాజికల్ థ్రిల్లర్
కలలు, మానసిక సమస్యల నేపథ్యంలో గతంలో చాలా చిత్రాలు వచ్చాయి. ఇన్నోలెన్స్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించే తొలి చిత్రం పీడకలల నేపథ్యంలో సైకలాజికల్ థ్రిల్లర్ గా ఉండబోతోంది. 
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
నటీనటులు, నిర్మాతలు
Image Credit : Asianet News

నటీనటులు, నిర్మాతలు

ఈ చిత్రంలో సూర్య వశిష్ఠ, హర్షిత బండ్లమూరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. చిత్రాన్ని వెణుగోపాల్ నాయుడు పువ్వాడ, అక్కినేని కీర్తి, రాకేష్ రెడ్డి పట్టూరి ఇన్నోలెన్స్ ప్రొడక్షన్స్ సంస్థని స్థాపించి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాంకేతిక బృందంలో వినీత్ పబ్బతి సినిమాటోగ్రాఫర్‌గా, ప్రశాంత్ ఆర్ విహారి సంగీత దర్శకుడిగా, సురేశ్ బానిసెట్టి గీత రచయితగా ఉన్నారు.ఈ చిత్రానికి దర్శకుడు జయ్ ఆదిత్య రెడ్డి.

35
వెంటాడే పీడకలల నేపథ్యంలో కథ
Image Credit : Asianet News

వెంటాడే పీడకలల నేపథ్యంలో కథ

ఈ చిత్రానికి కథ, దర్శకత్వం అందిస్తున్న జయ్ ఆదిత్య రెడ్డి ఎం, కథానాయకుడు దేవ్ పాత్రను పరిచయం చేస్తూ కథను అల్లారు. దేవ్ (సూర్య వశిష్ఠ) అనే యువకుడిని వెంటాడే పీడకలలు అతడి జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. హీరోకి పీడకలలు పదే పదే ఎందుకు వస్తున్నాయి ? అతను నిజంగా ఏదో పెద్ద తప్పు చేసిన వాడా? లేక అతని మనస్సే అతన్ని మోసం చేస్తుందా? అనే మిస్టరీ చుట్టూ కథ సాగుతుంది.

45
దర్శకుడి వ్యాఖ్యలు
Image Credit : Instagram/Harshitha Bandlamuri

దర్శకుడి వ్యాఖ్యలు

వెణుగోపాల్ నాయుడు పువ్వాడ (ఫౌండర్, ఇన్నోలెన్స్ ప్రొడక్షన్స్) ఈ సందర్భంగా మాట్లాడుతూ, “మనిషి మనసుని తాకే కథలు చెప్పాలన్న ఉద్దేశంతో ఈ సంస్థ మొదలైంది. 'ప్రొడక్షన్ నం.1' సినిమాతో ఆ దిశగా మొదటి అడుగు వేస్తున్నాం. దర్శకుడు జయ్ ఆదిత్య రెడ్డి మాట్లాడుతూ, “ఇది ఓ థ్రిల్లర్ మాత్రమే కాదు… మన మనస్సు లోతుల్లోకి చేసే ప్రయాణం. మన తప్పులు, మన జ్ఞాపకాలు ఎలా మన లైఫ్ ని మారుస్తాయో చూపించాలన్నది నా ఉద్దేశం,” అన్నారు.

55
త్వరలోనే ఫస్ట్ లుక్
Image Credit : Instagram/Harshitha Bandlamuri

త్వరలోనే ఫస్ట్ లుక్

హీరో సూర్య వశిష్ఠ మాట్లాడుతూ, “దేవ్ పాత్ర కోసం నేను పూర్తిగా మానసికంగా ఒదిగిపోవాల్సి ఉంటుంది. చాలా ఇంటెన్స్, భావోద్వేగంతో కూడుకున్న పాత్ర ఇది,” అని అన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ టీజర్ ను హైదరాబాద్‌లో జరగనున్న ప్రత్యేక ఈవెంట్‌లో విడుదల చేయనున్నారు. ఈ ఈవెంట్‌కు టాలీవుడ్ ప్రముఖులు హాజరుకానున్నారు. తేదీలు త్వరలో ప్రకటించనున్నారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Mysaa Teaser Review: రష్మిక మైసా టీజర్, పాన్ ఇండియా స్టార్లు కూడా సాటిరారు.. ఆ విజువల్స్ ఏంటి భయ్యా
Recommended image2
Nani: ఇలాంటి సినిమాలెందుకు చేస్తున్నావ్‌.. నానికి అమ్మ వార్నింగ్‌.. జడల వివాదంపై ఎట్టకేలకు వివరణ
Recommended image3
Suriya Jyotika Mumbai House: భార్య కోసం షాకింగ్ డెసిషన్.. సూర్య రూ.200 కోట్ల ఇల్లు ఎందుకు వదిలేశాడో తెలుసా ?
Related Stories
Recommended image1
16 ఏళ్ళు పూర్తి చేసుకున్న మగధీర, ఆ స్టార్ క్రికెటర్ కి ఆల్ టైం ఫేవరేట్ మూవీ ఇదే
Recommended image2
త్వరలో బిగ్ బాస్ హౌస్ లోకి కల్పిక ? ఆమెకి మెంటల్ డిజార్డర్ ఉందంటూ బాంబు పేల్చిన తండ్రి.. పోలీసులకు ఫిర్యాదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved