MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Karthika Deepam: విలన్ గా మారిన ఇంధ్రుడు.. శౌర్యని కార్తీక్, దీపలను కలవనివ్వకూడదని నిర్ణయం?

Karthika Deepam: విలన్ గా మారిన ఇంధ్రుడు.. శౌర్యని కార్తీక్, దీపలను కలవనివ్వకూడదని నిర్ణయం?

Karthika deepam:బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్,కుటుంబ కథా నేపథ్యంతో కొనసాగుతూ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు అక్టోబర్ 27వ తేదీన ఏం జరుగుతుందో తెలుసుకుందాం.  

4 Min read
Author : Navya G
Published : Oct 27 2022, 10:17 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే.. ఇంద్రుడు తన ఆటో ఎదురుగా నించొని, ఇంట్లోని జ్వాలమ్మకు రేపు ఫంక్షన్ చేయాలంటే నా దగ్గర డబ్బులు లేవు డబ్బులు కావాలంటే నేను దొంగతనం చేయాలి. కానీ జ్వాలమ్మ నా చేత ఒట్టేయించుకుంది. ఈ ఒక్కసారి కి చేద్దాము అని అనుకొని ఎవరి చేబులోనో చేయి పెడుతూ ఉండగా దీప వచ్చి చూసి ఆపుతుంది. తిట్టే లోగ అతన్ని చూసి నువ్వా అని అంటుంది. ఇంద్రుడు కూడా మీరా అని అంటారు. ఇంతలో కార్తీక్ అక్కడికి వచ్చి వీడు నీకు తెలుసా వంటలక్క అని అడుగుతాడు. 

29

అవును డాక్టర్ బాబు మనం ఫాలో అయింది ఇతనినే అని అంటుంది. వంటలక్క, డాక్టర్ బాబా! ఈ పేర్లు ఎక్కడో విన్నట్టున్నదే అని ఇంద్రుడు మనసులో ఆడుకుంటాడు. అప్పుడు దీప, మనం నిన్న ఈ ఆటో వెనుకాతలే ఫాలో అయ్యాము అని అంటాడు. దానికి ఇంద్రుడు, మీరు పోలీసులా అమ్మా నేను ఏమైనా మీ దగ్గర తెలియకుండా దొంగతనం చేశానా నన్ను క్షమించండి అమ్మ. నేను ఎప్పుడు దొంగతనం చేయను ఇంక అని అంటాడు. సర్లే లేవయ్యా ఆరోజు నువ్వు నాతో ఒకరి చేత మాట్లాడించావు కదా తను నీ పాపా అని అనగా అవునమ్మా తను పెద్దమనిషి అయ్యింది.
 

39

దానికోసమే రేపు ఫంక్షన్ చేయడానికి డబ్బులు లేక ఇలా చేయాల్సి వచ్చింది అని అంటాడు. దానికి దీప  పెద్దమనిషి అయిందా అని ఆనందపడుతూ ఇలాంటి సమయంలో తనతో లేనే అను బాధపడుతుంది. అదే సమయంలో ఇంద్రుడు, వీళ్ళు పాప గురించి అడుగుతున్నారేంటి అని మనసులో అనుకోని శౌర్య చెప్పిన మాటలు గుర్తుతెచ్చుకుంటూ, వీళ్ళు జ్వాలమ్మ వాళ్ళ అమ్మానాన్నలా! నిజంగానే బతికే ఉన్నారా అందుకే జ్వాలమ్మని ఈ ఆటోలో చూసి తీసుకెళ్లిపోతారా నా దగ్గర నుంచి అని మనసులో అనుకుంటాడు.  ఆ తర్వాత సీన్లో మోనిత కార్తీక్ నిజంగానే ప్రియమణిని కలిసాడా.

49

 కలిసిన వెంటనే కార్తీక్ గతం మర్చిపోయాడు అని ప్రియమణి కి తెలిసి ఉండేది కాదా. అంతా చెప్పేది కదా మరి దీప ప్రస్తావన రాలేదేంటి కార్తీక్ కి గతం గుర్తొచ్చి రానట్టు నటిస్తున్నాడా అలా ఎందుకు చేస్తాడు అని అనుకుంటుంది. ఇంతలో వాణి మోనిత దగ్గరికి వస్తుంది. నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు నిన్ను ఎవరైనా చూస్తే మన గుట్టు బయట పడిపోతుంది అని అనగా, ఎవరూ లేరులెండి కార్తీక్  దీప కలిసి బయటకు వెళ్లారు అని అంటుంది. వీళ్ళు మళ్ళీ మొదలుపెట్టారు అని మోనిత అనుకుంటుంది. భయపడొద్దు మేడం ఈరోజు ఉదయం సరైన సమయానికి కార్తీక్ సార్ వచ్చారు కాబట్టి వాళ్ళు బతికిపోయారు.

59

 లేకపోతే ఈపాటికి ఇద్దరు సచ్చి నిన్ను కార్తీక్ సార్ ని కలిసి ఉండడం చూసి పైనుంచి ఏడ్చేవారు అని అనగా మరి దుర్గ గాడు ఉంటాడు కదా ఆడు చూస్తాడు అని మోనిత అంటుంది. దుర్గ ఇంక పూర్తిగా నా చేతుల్లో ఉన్నాడు ఈరోజో రేపో పని అయిపోతుంది అని చెప్పి వెళ్ళిపోతుంది వాణి.  అప్పుడు కార్తీక్ దీపలు ఇంద్రుడికి బట్టలు నగలుకొని ఇస్తారు. ఇంకెప్పుడు దొంగతనం చెయ్యొద్దు అని అంటారు. మాటల్లోనే ఉండిపోయాము పాప దగ్గరికి వెళ్దాము ఆటో తీయి అని దీప అనగా ఇంద్రుడు భయపడుతూ, వద్దమ్మా రేపు ఫంక్షన్ కదా రేపే రండి ఎవరిని ఈరోజు పిలవడం లేదు.

69

 ఇల్లంతా ఏదోలా ఉన్నది అని అంటాడు. మేము పాపని చూసి వెళ్ళిపోతాము లేవయ్యా అని దీప అంటుంది. దయచేసి అర్ధం చేసుకోండి బంధువులు ఎవర్నీ నాలుగు రోజులు పిలవలేదు రేపే వస్తారు. ఇప్పుడు వాళ్ళని పిలవకుండా మీరు ఇంట్లోకొస్తే మళ్ళీ బాగోదు కదా రేపు రండి కావాలంటే అని అంటాడు. దానికి కార్తిక్ అనుమాన పడుతూ ఫంక్షన్ అయితే నాలుగు రోజులు బంధువులు ఇంట్లోనే ఉంటారు కదా అని అనుకుంటాడు. అప్పుడు ఇంద్రుడిని ఫోన్ తియ్యమని చెప్పి అందులో తన పాప ఫోటో చూపించమని చెప్తాడు. 

79

ఇప్పుడు జ్వాలమ్మ ఫోటో చూపిస్తే వీళ్ళు నా దగ్గర నుంచి నా జ్వాలమ్మ నీ తీసుకెళ్ళిపోతారు అని మనసులో అనుకున్న ఇంద్రుడు, ఇది కొత్త ఫోన్ అమ్మ ఫోటోలేవీ ఉండవు ఏమైనా ఉన్నాయేమో చూస్తాను అంటూ ఫోన్లో ఉన్న శౌర్య ఫోటోలు అన్ని డిలీట్ చేసేస్తాడు. పోనీలే వంటలక్క రేపు వస్తాడు అంటున్నాడు కదా ఇన్ని రోజులు వేచి ఉన్నాము ఒకరోజు ఉండలేం ఏంటి అని అంటాడు కార్తీక్. దానికి దీప, రేపు ఉదయం ఇదే చోటుకు రా ఇంద్రుడు మమల్ని తీసుకెళ్ళు నువ్వే మర్చిపోవద్దు అని చెప్పి డబ్బులు, నగలు ఇచ్చేసి వెళ్ళిపోతారు దీపా కార్తీక్ లు. 
 

89

ఆ తర్వాత సీన్లో శౌర్య చేప మీద కూర్చుంటూ ఏడుస్తూ చంద్రమ్మతో,  ఇలాంటి మంచి సమయంలో మా అమ్మ నా పక్కన లేదు నన్ను చూసి ఎంత ఆనందపడేదో దేవుడు ఎందుకిలా చేశాడు అని బాధపడుతూ ఉంటుంది. అప్పుడు పక్కనే ఉన్న చంద్రమ్మ, ఇలాంటి సమయంలో నువ్వు బాధపడకూడదు అమ్మ ఆనందంగా ఉండాలి ఇవి మంచి క్షణాలు నిజంగా మీ అమ్మ ఉంటే నీ దగ్గరికి తప్పకుండా వస్తాది అయినా రేపు నీ స్నానం ఫంక్షన్ చేయడానికి మేము ఏర్పాట్లు చేస్తున్నాము, ఫంక్షన్ పెడతాము. నువ్వేమీ బాధపడొద్దు అని అంటుంది.

99

 ఇప్పుడు నాకు కావాల్సినవి ఆనందాలు కాదు మా అమ్మ. కేవలం మా అమ్మ  ఉంటే చాలు అని బాధపడుతుంది. అప్పుడు చంద్రమ్మ మనసులో, వీళ్ళ అమ్మ నాన్నలు ఎక్కడున్నారు త్వరగా తిన దగ్గరికి వచ్చేలా చూడు దేవుడా అని అనుకుంటుంది చంద్రమ్మ. ఆ తర్వాత సీన్లో ఇంద్రుడు తన ఆటో దిగి,  నిజంగానే వాళ్ళ జ్వాలమ్మ వాళ్ళ అమ్మానాన్నలా!  నా దగ్గర నుంచి తీసుకొని వెళ్ళిపోతారా అని భయపడుతూ ఉంటాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Priyanka Chopra: స్వర్ణ దేవాలయంలో సేవ.. పాత్రలు కడిగిన గ్లోబల్ బ్యూటీ..
Recommended image2
అప్పులున్నవారికి ధైర్యాన్నిచ్చే సినిమా, కార్మేని సెల్వం కాన్సెప్ట్ ఏంటంటే?
Recommended image3
రామ్ చరణ్ బాలీవుడ్ రీ ఎంట్రీ.. హీరోగా కాదు.. సెకండ్ ఇన్నింగ్స్ లో మెగా పవర్ స్టార్ మాస్టర్ ప్లాన్ ఏంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved