- Home
- Entertainment
- Top 10 Day 1 Box Office: తొలి రోజే ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన టాప్ 10 సినిమాలు.. తెలుగు హీరోలు ఎందరంటే?
Top 10 Day 1 Box Office: తొలి రోజే ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన టాప్ 10 సినిమాలు.. తెలుగు హీరోలు ఎందరంటే?
Top 10 Day 1 Box Office: ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర తొలి రోజే రికార్డు స్థాయి కలెక్షన్స్ రాబట్టిన టాప్ 10 సినిమాల లిస్ట్. ఈ లిస్ట్‌లో పుష్ప 2 ఫస్ట్ ప్లేస్‌లో ఉంటే, ఆ తర్వాత RRR, బాహుబలి 2 ఉన్నాయి.

అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన టాప్ 10 సినిమాలు
ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర రిలీజైన ఫస్ట్ డేనే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన టాప్ 10 సినిమాల లిస్ట్‌లో అల్లు అర్జున్ 'పుష్ప 2: ది రూల్' మొదటి స్థానంలో ఉంది. ఈ లిస్ట్‌లో ప్రభాస్ నటించిన నాలుగు సినిమాలు ఉండటం విశేషం. యష్, ఎన్టీఆర్ చిత్రాలు రెండున్నాయి. మరి మిగతా సినిమాలు ఏంటో చూద్దాం. ఇందులో తెలుగు హీరోలదే హవా ఉండటం విశేషం.
పుష్ప 2
అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2: ది రూల్' ఈ లిస్ట్‌లో ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. 2024లో రిలీజైన ఈ సినిమా తొలి రోజే దేశవ్యాప్తంగా 32,140 షోల ద్వారా ₹164.25 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. ఇండియాలో ఈ మూవీ టోటల్ గ్రాస్ ₹209.01 కోట్లు. ఓవర్సీస్‌లో ఫస్ట్ డే ₹66 కోట్ల గ్రాస్ రాబట్టిన ఈ సినిమా, వరల్డ్‌వైడ్‌గా మొత్తం ₹275.01 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది.
ఆర్‌ఆర్‌ఆర్
రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'RRR' సినిమా రెండో స్థానంలో ఉంది. 2022లో వచ్చిన ఈ సినిమా తొలి రోజే ఇండియాలో అన్ని భాషల్లో కలిపి ₹133 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది. ఫస్ట్ డే వరల్డ్‌వైడ్ గ్రాస్ ₹223 కోట్లు కాగా, ఇందులో ఓవర్సీస్ కలెక్షన్స్ ₹67 కోట్లు, ఇండియా గ్రాస్ ₹156 కోట్లు ఉన్నాయి.
బాహుబలి 2
ప్రభాస్ నటించిన 'బాహుబలి 2: ది కన్‌క్లూజన్' మూడో స్థానంలో నిలిచింది. 2017లో రిలీజైన ఈ సినిమా తొలి రోజు ఇండియాలో ₹121 కోట్ల నెట్, ₹153 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఓవర్సీస్‌లో ₹65 కోట్ల గ్రాస్ సాధించిన ఈ చిత్రం, వరల్డ్‌వైడ్‌గా మొత్తం ₹217 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది.
ధురంధర్ 2
నాల్గో స్థానంలో ఉన్న రణ్‌వీర్ సింగ్ 'ధురంధర్ 2: ది రివెంజ్' ఈ లిస్ట్‌లో ఉన్న ఏకైక బాలీవుడ్ సినిమా. 2026లో రిలీజైన ఈ చిత్రం తొలి రోజే ₹102.55 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. ఇండియాలో దీని గ్రాస్ ₹174.60 కోట్లు. ఓవర్సీస్‌లో ఫస్ట్ డే ₹52 కోట్ల గ్రాస్ సాధించిన ఈ సినిమా, వరల్డ్‌వైడ్‌గా మొత్తం ₹226.60 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది.
కేజీఎఫ్ 2
టాప్ 10 లిస్ట్‌లో యశ్ నటించిన 'KGF చాప్టర్ 2' ఐదో స్థానాన్ని దక్కించుకుంది. 2022లో వచ్చిన ఈ సినిమా తొలి రోజే ఇండియాలో ₹116 కోట్ల నెట్, ₹134.50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఫస్ట్ డే వరల్డ్‌వైడ్‌గా ఈ మూవీ ₹159 కోట్ల గ్రాస్ రాబట్టింది.
టాక్సిక్
ఆరో స్థానంలో యశ్ నటించిన 'టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్' సినిమా ఉంది. తొలి రోజే దేశవ్యాప్తంగా 24,579 షోల ద్వారా ఈ సినిమా ₹101.10 కోట్ల నెట్, ₹120.75 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఓవర్సీస్‌లో ఫస్ట్ డే ₹20 కోట్ల గ్రాస్ సాధించి, వరల్డ్‌వైడ్‌గా మొత్తం ₹140.75 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది.
కల్కి 2898 ఏడీ
ప్రభాస్ నటించిన 'కల్కి 2898 AD' సినిమా ఏడో స్థానంలో ఉంది. 2024లో రిలీజైన ఈ చిత్రం తొలి రోజు ఇండియాలో ₹95.30 కోట్ల నెట్, ₹114.02 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఓవర్సీస్‌లో ఫస్ట్ డే ₹63.70 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా, వరల్డ్‌వైడ్‌గా మొత్తం ₹177.72 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ నమోదు చేసింది.
సలార్
ఎనిమిదో స్థానంలో కూడా ప్రభాస్ నటించిన 'సలార్: పార్ట్ 1 – సీజ్‌ఫైర్' సినిమానే నిలిచింది. 2023లో వచ్చిన ఈ చిత్రం తొలి రోజు ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ₹90.70 కోట్ల నెట్, ₹107.12 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఓవర్సీస్‌లో ₹51 కోట్ల గ్రాస్ రాబట్టిన ఈ సినిమా, వరల్డ్‌వైడ్‌గా మొత్తం ₹158.12 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది.
ఆదిపురుష్
తొమ్మిదో స్థానంలో ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్' సినిమా ఉంది. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ప్లాప్ అయినా, రిలీజైన ఫస్ట్ డే మాత్రం మంచి ఓపెనింగ్స్ తెచ్చుకుంది. 2023లో వచ్చిన ఈ చిత్రం ఇండియాలో ₹86.75 కోట్ల నెట్, ₹103.08 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఓవర్సీస్‌లో ₹25 కోట్ల గ్రాస్ సాధించి, వరల్డ్‌వైడ్‌గా మొత్తం ₹128.08 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది.
దేవర
టాప్ 10 లిస్ట్‌లో పదో స్థానాన్ని జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'దేవర: పార్ట్ 1' దక్కించుకుంది. 2024లో రిలీజైన ఈ సినిమా తొలి రోజు ఇండియాలో ₹82.50 కోట్ల నెట్, ₹98.02 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోయినా, ఫస్ట్ డే వరల్డ్‌వైడ్‌గా ₹142.02 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ నమోదు చేసింది. ఇందులో ఎన్టీఆర్ వి రెండు సినిమాలుండటం విశేషం. ఇటీవల వచ్చిన రజనీకాంత్ `జైలర్ 2` మూవీ రూ.125కోట్ల గ్రాస్‌తో 14వ స్థానంలో ఉంది.





