MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఇగోలు, డబ్బే సమస్య, అంతా అయిపోయినట్లే.... అన్నదమ్ముల విబేధాలపై ఎట్టకేలకు ఓపెన్ అయిన మంచు మనోజ్!

ఇగోలు, డబ్బే సమస్య, అంతా అయిపోయినట్లే.... అన్నదమ్ముల విబేధాలపై ఎట్టకేలకు ఓపెన్ అయిన మంచు మనోజ్!

మంచు బ్రదర్స్ మధ్య విబేధాలు కొనసాగుతున్నాయని కామెంట్స్ వినిపిస్తున్న నేపథ్యంలో మంచు మనోజ్ తాజాగా చేసిన కామెంట్స్ చర్చకు దారి తీశాయి. అన్నదమ్ముల మధ్య విబేధాలకు కారణం ఇవే అంటూ మనోజ్ ఓపెన్ అయ్యారు.  

2 Min read
Author : Sambi Reddy
| Updated : Nov 25 2023, 05:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Manchu Vishnu

Manchu Vishnu

విలక్షణ నటుడు మోహన్ బాబు నట వారసులుగా పరిశ్రమకు పరిచయం అయ్యారు మంచు విష్ణు, మంచు మనోజ్. ఇద్దరూ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. విష్ణు జయాపజయాలతో సంబంధం లేకుండా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. మనోజ్ మాత్రం కొంచెం బ్రేక్ ఇచ్చి మరలా రీ ఎంట్రీ ఇచ్చాడు. వాట్ ది ఫిష్ టైటిల్ తో ఓ చిత్రం చేస్తున్నారు.

26

అయితే కొన్నాళ్లుగా మంచు బ్రదర్స్ ఎడమొహం పెడమొహం గా ఉంటున్నారు. మనోజ్ హైదరాబాద్ లో లేరని కుటుంబానికి దూరంగా మరో చోట జీవిస్తున్నారని వార్తలు వచ్చాయి. 2023 మార్చి నెలలో మనోజ్ భూమా మౌనికను రెండో వివాహం చేసుకున్నారు. ఈ పెళ్ళికి విష్ణు హాజరు కాలేదు. అక్క మంచు లక్ష్మి అన్నీ తానై ఈ వేడుక పూర్తి చేసింది. 
 

36

మనోజ్-విష్ణు విబేధాలను ధృవీకరిస్తూ ఓ వీడియో వైరల్ అయ్యింది. మనోజ్ స్వయంగా ఫేస్ బుక్ స్టేటస్ లో విష్ణుతనతో గొడవపడుతున్న వీడియో పోస్ట్ చేశాడు. ఇది క్షణాల్లో వైరల్ అయ్యింది. వెంటనే మనోజ్ డిలీట్ చేశాడు. ఇది రియాలిటీ షోలో భాగం, అంటూ కవర్ చేసే ప్రయత్నం చేశాడు విష్ణు. జనాలు మాత్రం నమ్మలేదు.

46

ప్రస్తుతం ఎవరి దారిన వాళ్ళు ఉంటున్నారు. ఆస్తుల పంపకాలు కూడా పూర్తి అయ్యాయట. ఇటీవల మోహన్ బాబు రిజిస్టర్ ఆఫీస్ వద్ద కనిపించాడు. ఆయన్ని మీడియా పలకరించడానికి చూసింది. కానీ మోహన్ బాబు అగ్గిమీద గుగ్గిలం అయ్యాడు. కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మంచు బ్రదర్స్ మధ్య గొడవలకు కారణాలు ఏంటనే సందేహాలు ఉన్నాయి. 
 

56
Manchu Manoj

Manchu Manoj

తాజాగా మనోజ్ చేసిన కామెంట్స్ ఒకింత హింట్ ఇస్తున్నాయి. సంపూర్ణేష్ బాబు హీరోగా నటించిన సోదరా చిత్ర సాంగ్ లాంచింగ్ ఈవెంట్లో మనోజ్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సోదర బంధం ఎంతో ముఖ్యమైనది. అన్నదమ్ముల మధ్య ఎప్పుడైతే ఇగోలు వస్తాయో అప్పుడు అంతా అయిపోయినట్లే. ఇగో, డబ్బు సమస్యలు రాకూడదు. 
 

66

సమస్య ఎక్కడ వస్తుందంటే... వాళ్లిద్దరూ కలిసి కూర్చొని మాట్లాడుకోవాలి. ఇద్దరిలో ఎవరో ఒకరు తగ్గాలి. అప్పుడు అన్నదమ్ముల మధ్య అనుబంధాలు గట్టిగా ఉంటాయని మనోజ్ అన్నారు. మంచు విష్ణుతో తనకు ఇగో, డబ్బు కారణంగానే గొడవలు అయ్యాయని మనోజ్ పరోక్షంగా చెప్పాడనే మాట వినిపిస్తోంది. 

 

ప్రభాస్‌ `స్పిరిట్‌`లో రణ్‌బీర్‌ కపూర్‌.. క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చిన సందీప్‌రెడ్డి వంగా..

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
మంచు మనోజ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Raashi khanna: యంగ్‌ ఏజ్‌లో రాశీఖన్నా లవ్‌ బ్రేకప్‌.. డేటింగ్‌తో బాడీలో మిరాకిల్‌, ఏం జరిగిందంటే?
Recommended image2
ప్రభాస్ తన కెరీర్ లో చేయకుండా ఉండాల్సిన 6 చెత్త సినిమాలు.. అసలు ఎందుకు ఒప్పుకున్నాడో అర్థం కాదు
Recommended image3
Prabhas Assets: లక్ష ఎకరాలు, వేల కోట్లు.. అంబానీని మించిన ప్రభాస్‌ ఫ్యామిలీ ఆస్తులు, మతిపోయే రహస్యాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved