MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • త్రిష పేరుతో ఏకంగా విలేజ్‌.. స్టార్‌ హీరోయిన్‌ రియాక్షన్‌ ఇదే, టూ క్రేజీ

త్రిష పేరుతో ఏకంగా విలేజ్‌.. స్టార్‌ హీరోయిన్‌ రియాక్షన్‌ ఇదే, టూ క్రేజీ

హీరోయిన్లకి టెంపుల్స్ కట్టిన సంఘటనలు మనం చూశాం. కానీ ఏకంగా హీరోయిన్‌ పేరుతో ఊరే ఉండటం చూశారా? త్రిషకే ఆ అదృష్టం దక్కింది. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Jun 01 2025, 10:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
అత్యధిక పారితోషికం అందుకునే హీరోయిన్‌ త్రిష
Image Credit : Instagram

అత్యధిక పారితోషికం అందుకునే హీరోయిన్‌ త్రిష

కోలీవుడ్‌, టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తుంది త్రిష. ఆమెకు 42 ఏళ్ళు అయినప్పటికీ ఇంకా పెళ్లి చేసుకోకుండా ఉంది. ఈ వయస్సులో కూడా యంగ్‌గా కనిపిస్తూ ఆకట్టుకుంటుంది. కుర్ర హీరోయిన్లకి అందంలో పోటీ ఇస్తుంది. 

అదే సమయంలో తన తోటి హీరోయిన్లలో ఎవరికీ సాధ్యం కాని విధంగా ఇప్పటికీ వరుసగా భారీ ఆఫర్లని అందుకుంటూ దూసుకుపోతుంది. అంతేకాదు అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్‌గానూ నిలిచింది. ఆమె ఒక్కో మూవీకి  రూ.12కోట్ల పారితోషికం అందుకుంటుందని సమాచారం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
 కమల్‌, చిరు, మోహన్‌ లాల్‌, సూర్యలతో త్రిష
Image Credit : Instagram

కమల్‌, చిరు, మోహన్‌ లాల్‌, సూర్యలతో త్రిష

త్రిష ఇటీవల అజిత్‌ `గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ` సినిమాలో మెరిసింది. మంచి హిట్‌ని అందుకుంది. త్వరలో `థగ్‌ లైఫ్‌` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది.  కమల్‌ హాసన్‌ హీరోగా మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ మూవీ జూన్ 5న విడుదల కాబోతుంది.  

అలాగే ఆర్.జె.బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త చిత్రంలో హీరో సూర్యకి జోడీ కట్టింది త్రిష. అంతేకాకుండా తెలుగులో చిరంజీవితో కలిసి 'విశ్వంభర' చిత్రంలోనూ నటిస్తుంది.  మలయాళంలో మోహన్‌లాల్‌తో కలిసి ఓ మూవీ చేస్తుంది. ఇలా తెలుగు, తమిళం, మలయాళంలో భారీ చిత్రాలతో బిజీగా ఉంది త్రిష. 

34
 త్రిష పేరుతో ఏకంగా విలేజ్‌
Image Credit : Instagram

త్రిష పేరుతో ఏకంగా విలేజ్‌

ఇదిలా ఉండగా,  హీరోయిన్‌ త్రిష పేరుతో ఒక విలేజ్‌ ఉంది. ఈ విషయాన్ని ఆమె అభిమానులు కనిపెట్టారు.  ఒక అభిమాని ఆ ఊరి పేరు ఉన్న బోర్డు ముందు నిల్చొని వీడియో తీసి ఇన్‌స్టాలో పోస్ట్ చేయగా, దాన్ని త్రిష కూడా తన ఇన్‌స్టా పేజీలో షేర్ చేసి ఆశ్చర్యం వ్యక్తంచేసింది. ఆ ఊరి పేరు 'Vijayak Trisha'. ఆ ఊరు లడఖ్‌లోని నూబ్రా లోయ నుండి ప్రపంచంలోనే ఎత్తైన బేస్ క్యాంప్ అని పిలువబడే సియాచిన్ బేస్ క్యాంప్‌కు వెళ్లే దారిలో ఉందట.

44
 త్రిష అభిమానుల కోరిక
Image Credit : Instagram

త్రిష అభిమానుల కోరిక

హీరోయిన్ల పేరు మీద ఆలయాలు కట్టడం చూశాం. కానీ మొదటిసారిగా ఒక నటి పేరు మీద ఒక ఊరే ఉండటం ఆశ్చర్యపరుస్తుంది. ఇది చూసి ఫ్యాన్స్ కూడా సర్‌ప్రైజ్‌ అవుతున్నారు.  కొందరైతే  త్రిష ఆ ఊరికి వెళ్లాలని కోరుతున్నారు.  త్రిష ఆ రీల్స్ వీడియోను లైక్ చేయడంతో ఇప్పుడది వైరల్ అవుతోంది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
త్రిష
తమిళ సినిమా
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Nidhhi Agerwal: తెలుగు అబ్బాయిలంటేనే ఇష్టం, పెళ్లి కూడా చేసుకుంటా, నిధి అగర్వాల్ కామెంట్స్ వైరల్
Recommended image2
Ranabaali Sensor Review: ఒక్క కట్ కూడా లేదు.. విజయ్ దేవరకొండ సినిమాపై షాకింగ్ కామెంట్స్, రణబాలి సెన్సార్ రివ్యూ
Recommended image3
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పాడిన 10 పాటలు.. సింగర్‌గా అదరగొట్టిన పవర్ స్టార్!
Related Stories
Recommended image1
ఎన్టీఆర్‌ భయపడ్డాడు, అదే కథతో సినిమా తీసి ఇండస్ట్రీ హిట్‌ కొట్టిన సూపర్‌స్టార్‌ కృష్ణ, డేర్‌ అంటే ఇది
Recommended image2
సినిమాలకు దూరం కావడంపై ఓపెన్‌ అయిన ఇలియానా.. రీ ఎంట్రీపై, `రైడ్‌ 2`లో నటించకపోవడంపై క్లారిటీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved