- Home
- Entertainment
- Top 10 Heroes: పడిపోయిన పవన్ కళ్యాణ్.. సత్తా చాటిన అల్లు అర్జున్, మహేష్.. ఇండియాలో నెంబర్ వన్ ఇతనే
Top 10 Heroes: పడిపోయిన పవన్ కళ్యాణ్.. సత్తా చాటిన అల్లు అర్జున్, మహేష్.. ఇండియాలో నెంబర్ వన్ ఇతనే
ఓర్మాక్స్ మీడియా ప్రతి నెల ఇండియా మోస్ట్ పాపులర్ హీరోల జాబితాని విడుదల చేస్తుంది. డిసెంబర్ నెల లిస్ట్ వచ్చింది. ఇందులో అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ తమ స్థానాలను కోల్పోయారు.

ఇండియా మోస్ట్ పాపులర్ టాప్ 10 స్టార్స్
ఓర్మాక్స్ మీడియా ప్రతి నెల ఇండియాలోనే మోస్ట్ పాపులర్ హీరోల జాబితాని విడుదల చేస్తుంది. ఇండియా వైడ్‌గా పాపులారిటీ, ఇమేజ్, సినిమాల సందడి, వారి గురించి చర్చలు జరగడం, ఫాలోయింగ్ వంటి అనేక అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ లిస్ట్ ని విడుదల చేస్తుంది. టాప్ 10 హీరోల జాబితాలో టాలీవుడ్ హీరోలు హవా చూపిస్తున్నారు. ఆ తర్వాత బాలీవుడ్ హీరోలు, కోలీవుడ్ హీరోలుంటారు. డిసెంబర్ నెలలో ఎవరు టాప్‌లో ఉన్నారు. ఎవరు చివర్లో ఉన్నారనేది చూస్తే, పవన్ కళ్యాణ్ అసలు లిస్ట్ లోనే లేరు.
ప్రభాస్ దే నెంబర్ 1 స్థానం
ఇండియాలోనే మోస్ట్ పాపులర్ మేల్ ఫిల్మ్ స్టార్ జాబితాలో మొదటి స్థానం ప్రభాస్‌కే దక్కుతుంది. ఆయన గత కొంత కాలంగా నెంబర్ 1గా రాణిస్తున్నారు. ఆయన్ని టచ్ చేసేవారు లేరని చెప్పొచ్చు. వరుసగా పాన్ ఇండియా మూవీస్ చేస్తుండటం, ఆయనకు సంబంధించిన ఇండియా వైడ్‌గా చర్చ జరగడం, అభిమానుల ఫాలోయింగ్, సినిమాల అప్ డేట్‌ని బట్టి ఆయనకు మొదటి స్థానం ఇచ్చారు. ప్రభాస్ ఇటీవల `ది రాజా సాబ్` మూవీతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. కానీ ఇది ఆడలేదు.
విజయ్ రెండో స్థానంలో, షారూఖ్ మూడో స్థానం
ఓర్మాక్స్ మీడియా ప్రకటించిన జాబితాలో రెండో స్థానంలో దళపతి విజయ్ ఉన్నారు. ఆయన కూడా గత కొన్ని నెలలుగా రెండో స్థానంలో నిలుస్తున్నారు. తన హవా చూపిస్తున్నారు. విజయ్ నటించిన `జన నాయకుడు` మూవీ సంక్రాంతికి విడుదల కావాల్సింది. కానీ విడుదల ఆపాలని కొందరు కోర్ట్ కి వెళ్లడంతో సినిమా ఆగిపోయింది. సెన్సార్ మెయిన్ సమస్యగా మారింది. ఇక మూడో స్థానంలో షారూఖ్ ఖాన్ నిలిచారు. విజయ్, షారూఖ్‌లు తమ స్థానంలో కంటిన్యూ అవుతున్నారు.
నాల్గో స్థానంలో అల్లు అర్జున్
ఓర్మాక్స్ మీడియా ప్రకటించిన లిస్ట్ లో నాల్గో స్థానంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉన్నారు. `పుష్ప 2`తో ఇండియన్ బాక్సాఫీసుని షేక్ చేసిన ఆయన ఇప్పుడు తమిళ దర్శకుడు అట్లీతో `ఏఏ22` చిత్రంలో నటిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్‌గా దీన్ని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఈమూవీకి సంబంధించిన కూడా తరచూ చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో అల్లు అర్జున్ సైతం నాల్గో స్థానంలో ఉంటున్నారు. ఇటీవల లోకేష్ కనగరాజ్‌తో కొత్త మూవీని ప్రకటించిన విషయం తెలిసిందే.
ఐదో స్థానంలో మహేష్ బాబు, ఆరో స్థానంలో అజిత్
మహేష్ బాబు ఐదో స్థానంలో సెటిల్ అయ్యారు. గతంలో ఆయన తక్కువ స్థానాల్లో ఉండేవారు. నవంబర్ నుంచి ఐదో స్థానంలో ఉంటున్నారు. మహేష్ బాబు ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో `వారణాసి` చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా కాన్సెప్ట్ గ్లింప్స్ ని నవంబర్‌లో విడుదల చేశారు. దీంతో దేశ వ్యాప్తంగా చర్చ జరిగింది. తరచూ ఈ మూవీకి సంబంధించిన చర్చ జరుగుతూనే ఉంది. అది మహేష్ క్రేజ్‌ని పెంచుతుంది. ఆరో స్థానంలో కోలీవుడ్ స్టార్ అజిత్ ఉన్నారు.
ఏడో స్థానంలో రామ్ చరణ్
రామ్ చరణ్ ఏడో స్థానంలో ఉన్నారు. గత నెలలో కూడా ఆయన స్థానం ఇదే. ఇప్పుడు కూడా తన స్థానం పదిలపర్చుకున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ `పెద్ది` సినిమా ప్రమోషన్స్ తో సందడి చేస్తున్నారు. `పెద్ది` మూవీ నుంచి ఇప్పటికే `చికిరి` సాంగ్ విడుదల కాగా, అది బాగా ట్రెండ్ అయ్యింది. మార్చిలో ఈ మూవీ విడుదల కానుంది.
ఎనిమిదో స్థానంలో ఎన్టీఆర్
ఎనిమిదో స్థానంలో ఎన్టీఆర్ నిలిచారు. తారక్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్‌తో `డ్రాగన్` చిత్రంలో నటిస్తున్నారు. ఆయన సినిమాకి సంబంధించిన డిస్కషన్ గతేడాది బాగానే జరిగింది. `డ్రాగన్` ఆగిపోయిందనే ప్రచారం జరిగింది. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణతో బిజీగా ఉన్నారు తారక్.
టాప్ 10లో స్థానం కోల్పోయిన పవన్
ఇక తొమ్మిదో స్థానంలో బాలీవుఢ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఉన్నారు. పదో స్థానంలో అక్షయ్ కుమార్ నిలిచారు. అయితే గత నెలలో పవన్ కళ్యాణ్ టాప్ 10లో ఉన్నారు. కానీ ఇప్పుడు ఆయన లిస్ట్ లోనే లేరు. దీంతో ఆ స్థానంలోకి అక్షయ్ కుమార్ వచ్చారు.

