- Home
- Entertainment
- Bigg Boss Telugu 6: ఇనయా వెనుక ఆయన ఉన్నాడు ఫైనల్ కి గ్యారెంటీ... ఆవేశంలో సీక్రెట్ లీక్ చేసిన అషురెడ్డి
Bigg Boss Telugu 6: ఇనయా వెనుక ఆయన ఉన్నాడు ఫైనల్ కి గ్యారెంటీ... ఆవేశంలో సీక్రెట్ లీక్ చేసిన అషురెడ్డి
కంటెస్టెంట్ ఇనయా వెనుక ఒక శక్తి ఉందని, ఆమె ఫైనల్ కి వెళ్లడం ఖాయం అంటూ బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ అషురెడ్డి ఆవేశంలో బయటపెట్టింది. మరో మాజీ కంటెస్టెంట్ జెస్సీ తో వాగ్వాదం చేస్తూ ఈ విషయం లీక్ చేశారు.

Bigg Boss Telugu 6
బిగ్ బాస్ సీజన్ 6 లో బోల్డ్ కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకుంది ఇనయా సుల్తానా. గత ఐదు సీజన్స్ లో ఎవరు కూడా తనకు ఫలానా అబ్బాయి అంటే క్రష్ అని చెప్పలేదు. ఇష్టపడిన వాళ్లతో రొమాన్స్ చేశారు కానీ ఓపెన్ కామెంట్స్ చేయలేదు. ఇనయా మాత్రం నాకు సూర్య అంటే ఇష్టమని నేరుగా బిగ్ బాస్ తో చెప్పింది. అతనికి బాగా దగ్గరైన ఇనయా రొమాన్స్ చేస్తున్నారు.
Bigg Boss Telugu 6
ఇంట్లో ఒక ఎఫైర్ పెట్టుకుంటే సేఫ్.. ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉండదని ఆమె భావిస్తున్నారు. ఇక ఇనయాలో ఓ రేంజ్ కాన్ఫిడెన్స్ ఉంది. ఎన్నిసార్లు నామినేట్ చేసినా హౌస్లో ఉంటా, టైటిల్ గెలిచిపోతా అంటూ ఒకటి రెండు సందర్భాల్లో శబధం చేసింది. ఆమె ధైర్యానికి కారణం తన వెనుక ఒక వ్యక్తి ఉండటమే అని తెలుస్తుంది. ఆయన్ని చూసుకునే ఇనయా అలా రెచ్చిపోతుందంటూ ఒక వాదన తెరపైకి వచ్చింది.
Bigg Boss Telugu 6
తాజాగా బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ అషురెడ్డి దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఆమె బిగ్ బాస్ 5 కంటెస్టెంట్ జెస్సీతో వాదనకు దిగింది. ఆ వాదనలో ఇనయా వెనుక ఓ పెద్ద వ్యక్తి ఉన్నాడని చెప్పింది. అషురెడ్డి,జెస్సీ ఒక రెస్టారెంట్ కి వెళ్లారు. అక్కడ వారిద్దరికీ ఇనయా-రాజశేఖర్ విషయంలో వాదన పడింది. ఇనయా బెస్ట్ ప్లేయర్ అషురెడ్డి అనగా కాదు రాజ్ బెస్ట్ ప్లేయర్ అన్నారు.
Bigg Boss Telugu 6
ఈ గొడవలో అషురెడ్డి ఇనయా వెనుక ఒక వ్యక్తి ఉన్నాడని చెప్పింది. ఆయన ఒక పోస్ట్, ఒక ట్వీట్ చేస్తే చాలు లక్షల ఓట్లు వస్తాయి. ఇనయా ఫైనల్ కి వెళ్లడం ఖాయం. గతంలో కూడా ఆయన సప్పోర్ట్ చేసినవాళ్లు ఫైనల్ కి వెళ్లారు తెలుసుగా అంటూ గొప్ప విశ్వాసంతో మాట్లాడింది. ఆ వ్యక్తి ఎవరనేది అషురెడ్డి పేరు చెప్పలేదు.
Bigg Boss Telugu 6
పేరు చెప్పకపోయినా అందరికీ తెలుసు ఆయన ఎవరో కాదు రామ్ గోపాల్ వర్మ. ఇప్పటికే రామ్ గోపాల్ వర్మ ఇనయాకి మద్దతు తెలుపుతున్నారు. ఆమె నామినేషన్స్ లో ఉంటే ఓటు వేయాలంటూ సోషల్ మీడియా పోస్ట్స్ పెడుతున్నారు. గతంలో వర్మ అరియనాను సప్పోర్ట్ చేశారు. బిగ్ బాస్ సీజన్ 4లో అరియనా టాప్ 4లో నిలిచింది. వర్మ సపోర్ట్ ఉన్న ఇనయా ఫైనల్ కి వెళుతుందని పరోక్షంగా చెప్పింది.