- Home
- Entertainment
- ఈ స్కూల్ గర్ల్స్ లో ఓ క్యూట్ హీరోయిన్ ఉంది ఎవరో గుర్తు పట్టారా? తెలిశాక షాక్ అవుతారు!
ఈ స్కూల్ గర్ల్స్ లో ఓ క్యూట్ హీరోయిన్ ఉంది ఎవరో గుర్తు పట్టారా? తెలిశాక షాక్ అవుతారు!
క్యూట్ హీరోయిన్ గా సౌత్ ఏలిన స్టార్ లేడీ ఈ ఫొటోలో ఉన్నారు. ఆమె తన స్కూల్ డేస్ నాటి ఫోటో షేర్ చేశారు. స్కూల్ యూనిఫార్మ్ లో తన ఫ్రెండ్స్ తో కలిసి నవ్వులు చిందించింది. సదరు హీరోయిన్ ఇంస్టాగ్రామ్ లో ఆ ఫోటో షేర్ చేయగా వైరల్ గా మారింది.

Meera Jasmine
ఇక స్కూల్ డేస్ లో ఆ హీరోయిన్ ని గుర్తించడం చాలా కష్టమైంది. పరిశీలనగా చూసి అదేగా నువ్వు అంటూ.. ఫొటోలో ఆమె నిల్చున్న ప్లేస్ మార్క్ చేస్తున్నారు. తన చిన్నప్పటి ఫోటో పంచుకోవడం ద్వారా ఫ్యాన్స్ కి సరికొత్త అనుభూతి పంచింది. అవును మీ ఊహ నిజమే క్రింద వరసలో రైట్ నుండి రెండో అమ్మాయి మీరా జాస్మిన్.
Meera Jasmine
. 2001లో విడుదలైన మలయాళ చిత్రం సూత్రధారణ్ చిత్రంతో మీరా జాస్మిన్ వెండితెరకు పరిచయం అయ్యారు. 2002లో విడుదలైన రెండవ చిత్రం రన్ ఆమెకు మంచి ఫేమ్ తెచ్చిపెట్టింది. మాధవన్ హీరోగా విడుదలైన రన్ సూపర్ హిట్ కాగా మీరా క్యూట్ నెస్ కి యూత్ పడిపోయారు.
Meera Jasmine
ఇక తెలుగులో ఆమె మొదటి చిత్రం అమ్మాయి బాగుంది. శివాజీ హీరోగా నటించిన ఈ మూవీలో మీరా డ్యూయల్ రోల్ చేయడం విశేషం. అనంతరం పవన్ కళ్యాణ్ కి జంటగా గుడుంబా శంకర్ చిత్రంలో ఆఫర్ దక్కించుకున్నారు. గుడుంబా శంకర్ చిత్రం ప్లాప్ టాక్ తెచ్చుకుంది. అలాగే బాలయ్యతో మహారథి చిత్రం చేయగా అది కూడా అనుకున్నంత విజయం సాధించలేదు.
మహారథి తర్వాత ఆమెకు చిన్న చిన్న చిత్రాల్లో ఆఫర్స్ దక్కాయి. తెలుగులో మీరా జాస్మిన్ నటించిన హిట్ మూవీ భద్ర. దర్శకుడు బోయపాటి తెరకెక్కించిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. తెలుగులో మీరాకు ఈ రేంజ్ హిట్ మరలా తగల్లేదు. మెల్లగా ఆమె ఫేడ్ అవుట్ అయ్యారు.
Meera Jasmine
2013 తర్వాత ఆమె కెరీర్ మరింత క్షీణించింది. 2022లో ఆమె నటించిన మకల్ అనే మలయాళ మూవీ విడుదలైంది. జయరామ్ హీరోగా తెరకెక్కిన చిత్రమది. ప్రస్తుతం ఆమె సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు. సీనియర్ హీరోల సరసన లేదంటే అక్క, వదిన పాత్రలు చేయడానికి సిద్ధమయ్యారు.
మరోవైపు సోషల్ మీడియా వేదికగా హాట్ హాట్ ఫోటో షూట్స్ చేస్తున్నారు. వెండితెరపై మీరా ఏనాడూ స్కిన్ షో చేయలేదు. అలాంటిది ఇంస్టాగ్రామ్ లో హాట్ హాట్ గా కనిపిస్తూ షాక్ ఇస్తున్నారు. ఇక మీరా జాస్మిన్ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.