- Home
- Entertainment
- Illu llalu Pillalu Today Episode: వేదవతిని మోసం చేసేందుకు భాగ్యం భారీ ప్లాన్, వల్లిని బెదిరించిన విశ్వ
Illu llalu Pillalu Today Episode: వేదవతిని మోసం చేసేందుకు భాగ్యం భారీ ప్లాన్, వల్లిని బెదిరించిన విశ్వ
Illu llalu Pillalu Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ లో ప్రేమ వల్లికి వార్నింగ్ ఇవ్వడంతో మొదలవుతుంది. ఈ ఎపిసోడ్లో వేదవతిని మోసం చేసి పాతిక లక్షలు కొట్టేయాలని భాగ్యం ప్లాన్ వేస్తుంది.

వల్లీ ఓవరాక్షన్
ప్రేమ.. కత్తితో వల్లి రూమ్ లోకి వెళ్ళగానే తనను చంపడానికే కత్తి తెచ్చింది అనుకొని వల్లి విపరీతంగా వణికి పోతుంది. వల్లీ ఓవరాక్షన్ చూసి ప్రేమకు డౌట్ వస్తుంది. వల్లీ ఏదో చేసింది, దాన్ని కనిపెట్టేయాలని ప్రేమ మనసులో అనుకుంటుంది. అదే విషయం బయటకు కూడా అంటుంది. నువ్వేదో తప్పు చేశావని నిన్ను చూస్తే అర్థం అయిపోతుంది ఏంటి సంగతి అని అడుగుతుంది. వల్లీ మాత్రం తన లాంటి మంచి వాళ్ళు ఈ లోకంలోనే ఉండరని అంటుంది.
మా నాన్న హిట్లర్
అక్కడినుంచి సీన్ ధీరజ్ దగ్గరికి మారుతుంది. కారులో ఒక వ్యక్తిని ఎక్కించుకుంటాడు. ఆ వ్యక్తి కారులో కూర్చొని అక్కడున్న డైరీని తీసి చదువుతాడు. అందులో హైదరాబాద్ అకాడమీలో చేర్పించాలి, పోలీస్ ట్రైనింగ్ ఇప్పించాలి వంటివన్నీ చదువుతాడు ఆయన వెంటనే ధీరజ్ తో మాటలు కలుపుతాడు. నీకు బాగా బరువు బాధ్యతలు ఉన్నట్లున్నాయని అడుగుతాడు. దానికి గ్రహాలన్నీ తనను ముంచేశాయని పెళ్లి కూడా అయిపోయిందని చెబుతాడు ధీరజ్. అప్పుడు ఆ వ్యక్తి అయితే మీ నాన్న నిన్ను పట్టించుకోడా? క్యాబ్ నడిపిన డబ్బులతోనే జీవించాలా? అని అడుగుతాడు. దానికి ధీరజ్ తన తండ్రి బొమ్మరిల్లు ఫాదర్ అని టూమచ్ గా చూసుకుంటారని.. కాకపోతే జాబ్ నుంచి జీవితం వరకు ఆయన చెప్పినట్లే చేయాలని చెబుతాడు. పిల్లల మీద అతనికి విపరీతమైన ప్రేమ ఉండడం వల్ల అలా చేయాల్సి వస్తుందని అంటాడు. దానికి ఆ వ్యక్తి అయితే మీ నాన్నతో ఒకసారి మాట్లాడాలి అని అడుగుతాడు. దానికి థీరజ్ ‘వద్దండి మా నాన్న హిట్లర్ నాన్నతో మాట్లాడితే మీరు మారిపోతారు’ అని అంటాడు.
నగలమ్మి మీ డబ్బులు ఇచ్చేస్తా
ఇక అక్కడ నుంచి సీన్... శ్రీవల్లి దగ్గరికి మారుతుంది. శ్రీవల్లికి విశ్వ ఫోన్ చేస్తాడు. అసలే భయంతో వణికిపోతున్న వల్లి విశ్వ ఫోన్ చేయగానే ఇంకా కంగారు పడిపోతుంది. విశ్వా తో మాట్లాడుతూ ‘నర్మదను కేసులో ఇరికించడంలో నా హస్తం ఉందని వీళ్ళకి తెలిసిపోతుందోనని భయమేస్తోంది. ఈ లోపు నువ్వు నా ప్రాణం తీస్తున్నావు. నేను నీకు ఏ సాయం చెయ్యను. రాయబారాలు చేయడం ఇక నా వల్ల కాదు’ అని తెగేసి చెబుతుంది. అప్పుడు విశ్వ వెంటనే ‘అయితే నా డబ్బులు నాకు ఇచ్చేయి. నేను ఇచ్చిన పది లక్షలు ఇవ్వాల్సిందే’ అని బెదిరిస్తాడు. దానికి వల్లి మాట్లాడుతూ ‘ప్రేమ కత్తి పట్టుకుని వచ్చేస్తుంది, నువ్వేమో డబ్బు ఇవ్వమని అడుగుతావు.. అసలు నేను మీకు ఎలా కనిపిస్తున్నాను. మీరంతా భయపెడితే నేను భయపడి పోవాలా? నా నగలు అన్నీ తాకట్టు పెట్టయినా నీకు పది లక్షలు ఇచ్చేస్తా’ అని గట్టిగానే సమాధానం ఇస్తుంది. దానికి విశ్వ మాట్లాడుతూ ‘నువ్వు నాకు భయపడవా? నేను ఇచ్చిన డబ్బులు తిరిగి ఇచ్చేస్తావా? సరే మీ ఇంట్లో నువ్వే నాకు అమూల్యకి రాయబారం చేశావని చెప్పేస్తా’ అని బెదిరిస్తాడు. దీంతో శ్రీవల్లి ఇంకా భయపడిపోతుంది. విశ్వ బ్లాక్ మెయిల్ చేయడం వల్ల శ్రీవల్లి తగ్గి ఉండాల్సి వస్తుంది.
పాతిక లక్షలు కొట్టేసేందుకు ప్లాన్
మరోవైపు శ్రీవల్లి తల్లిదండ్రులు భాగ్యం, ఇడ్లీ బాబాయ్ రామరాజు ఇంటికి మళ్లీ వచ్చేస్తారు. రామరాజు కూడా ఇంటికి రావడంతో అతడి నుంచి డబ్బులు ఎలా కొట్టేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు. భాగ్యం, ఇడ్లీ బాబాయి కలిసి రామరాజుని పాతిక లక్షలు అడగాలని ప్లాన్ వేస్తారు. శ్రీవల్లి తన తల్లిదండ్రులను చూసి ఏంటి అప్పుడే ఇంటికి వచ్చేశారు అని అడుగుతుంది. అప్పుడు అప్పులోళ్లు ఇబ్బంది పెడుతున్నారని, మీ మామయ్యని పాతిక లక్షలు అడగాలనుకుంటున్నామని భాగ్యం చెబుతుంది. వీరు మాట్లాడుకుంటున్న మాటలే నర్మదా వినేస్తుంది. ఈలోపు శ్రీవల్లి తన తల్లితో మామయ్య వైపు నుంచి కాదు అత్తయ్య గారి వైపు నుంచి నరుకొద్దాం పదండి.. ఆవిడైతే సులువుగా ఇచ్చేస్తుందని సలహా ఇస్తుంది.
వేదవతిని డబ్బులడిగిన భాగ్యం
శ్రీవల్లి చెప్పినట్టే వేదవతి దగ్గరికి భాగ్యం, ఇడ్లీ బాబాయిలు ఇద్దరూ దొంగ ఏడుపులు నటిస్తూ వస్తారు. వెంటనే వేదవతి ఏమైందని అడుగుతుంది. వేదవతి పక్కనే ఉన్న నర్మదా మీ ప్లాన్ ఏంటో చెప్పండి అని తెలివిగా అడుగుతుంది. భాగ్యం మాట్లాడుతు తాము పచ్చళ్ల వ్యాపారం చేయాలనుకుంటున్నామని పాతిక లక్షలు అప్పు ఉంటే ఇవ్వమని అడుగుతుంది. పాతిక లక్షల పేరు వినగానే వేదవతి షాక్ అవుతుంది. ఈ లోపు ప్రేమ కూడా అక్కడికి వచ్చేస్తుంది. పచ్చళ్ల బిజినెస్ పెట్టడానికి అంత డబ్బు ఎందుకు అని అడుగుతుంది. దానికి భాగ్యం మాట్లాడుతూ తాము భాగ్యం పికెల్స్ పేరుతో పచ్చళ్ళ బిజినెస్ మొదలు పెడదామనుకుంటున్నామని, ఆ మాత్రం ఖర్చు అవుతుంది కదా అని చెబుతుంది. దాంతో ఇవాల్టి ఎపిసోడ్ ఇక్కడితో పూర్తవుతుంది