- Home
- Entertainment
- Illu Illalu Pillalu Today Episode: ప్రేమను పుట్టింటికి ఈడ్చుకెళ్లిన ధీరజ్, వల్లి పై కత్తి ఎత్తిన ప్రేమ, అసలేం జరుగుతోంది?
Illu Illalu Pillalu Today Episode: ప్రేమను పుట్టింటికి ఈడ్చుకెళ్లిన ధీరజ్, వల్లి పై కత్తి ఎత్తిన ప్రేమ, అసలేం జరుగుతోంది?
Illu Illalu Pillalu Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ లో నర్మద.. ప్రేమకు థాంక్స్ చెబుతూ కనిపిస్తోంది. వీరి మాటలు వేదవతి వింటూ ఉంటుంది. కానీ ధీరజ్ కు మాత్రం ప్రేమపై అనుమానం, కోపం రెండూ వస్తాయి.

ప్రేమ ఎంత గొప్పగా ఆలోచించింది
ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ మొదలవ్వగానే స్క్రీన్ పై నర్మదా, ప్రేమ ఇద్దరూ కనిపిస్తారు. నర్మద.. ప్రేమ దగ్గరకు వెళ్లి థాంక్స్ చెబుతుంది. తనకోసం కన్న తండ్రిని అరెస్టు చేయించావని, నీ రుణం తీర్చుకోలేనని అంటుంది. ‘నువ్వు గనక మీ నాన్న మొబైల్ నుంచి అకౌంట్ డీటెయిల్స్ తీయకపోతే.. నువ్వు నాకు హెల్ప్ చేయకపోయి ఉంటే నేను ఈ పాటికి జాబ్ పోగొట్టుకొని జైల్లో ఉండేదాన్ని’ అంటుంది నర్మద. నువ్వు చేసిన హెల్ప్ కి థాంక్స్ అనేది చాలా చిన్నపదమని అంటుంది. నేను నీకు జీవితాంతం రుణపడి ఉంటాను అంటుంది.
ప్రేమ మాట్లాడుతూ ‘ఇంత చిన్న విషయానికి థాంక్స్ ఎందుకు అక్కా.. మా నాన్న అరెస్టు అవ్వడం, అది కూడా నా కారణంగా అరెస్ట్ అవ్వడం కచ్చితంగా నాకు బాధ కలిగించే విషయం. కానీ మా నాన్న చేసిన కుట్రకు నువ్వు బలయ్యావు. ఒకవేళ నువ్వు అరెస్ట్ అయ్యి, జైలుకు వెళ్లి ఉంటే, లంచం తీసుకున్నావని నీపై నింద పడి ఉండేది. గవర్నమెంట్ జాబ్ కోసం నువ్వు పడిన కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరు అయ్యేది. అన్నిటికన్నా ముఖ్యంగా నువ్వు చెయ్యని తప్పుకు శిక్ష అనుభవించాల్సి వచ్చేది. అందులోనూ రామరాజు గారు కోడలు అవినీతి కేసులో అరెస్ట్ అయితే మావయ్య గారి గౌరవం, ఇంటి పరువు రోడ్డున పడేది. అప్పుడు నువ్వు మావయ్య గారి దృష్టిలో జీవితాంతం ఆయనను తలదించుకునేటట్టు చేసిన కోడలిగా మిగిలిపోతావ్. దీనివల్ల నీకు సాగర్ బావకి మధ్య అపార్థాలు వస్తాయి. మనందరి జీవితాలు ఇలా చిన్న భిన్నమవుతాయని తెలిసి కూడా సాయం చేయకపోతే ఎలా’ అంటుంది. వీరిద్దరి మాటలు వేదవతి వింటుంది. వేదవతి ప్రేమకు తన పోలికలే వచ్చాయని ఆనందిస్తుంది.
ప్రేమపై ధీరజ్ కోపం
ధీరజ్ మాత్రం కూర్చుని చాలా తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాడు. ప్రేమ పుట్టింటికి వెళ్లడం వెనక ఏదో కారణం ఉందని అనుకుంటాడు. ఆ విషయాన్ని పదే పదే గుర్తు చేసుకుంటాడు. ప్రేమ రాగానే గొడవకు దిగుతాడు. ‘నిన్ను చూస్తుంటే భయమేస్తోంది, నీ ఒంట్లో ఉన్నది నీ బాబు రక్తమే కదా అంటాడు. చూసావు కదా ఇందాక నీ బాబు ఎలా ప్రవర్తించాడో. కుట్ర చేసి మా వదిన జాబ్ పోగొట్టాలి అనుకోవడమే పెద్ద తప్పు. అయినా తప్పు చేశానని సిగ్గు లేకుండా ఎలా వార్నింగ్ ఇస్తున్నాడో ’ అంటాడు. దానికి ప్రేమ ఆ విషయం వదిలేయమని అంటుంది. అయినా కూడా ధీరజ్ వదలకుండా అదే విషయంపై గొడవ పడుతూ ఉంటాడు. ప్రేమ మరొక్కసారి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. దాంతో ధీరజ్ మొన్నట్లాగా మీ పుట్టింటికి వెళ్తావా అంటూ చెయ్యి పట్టుకొని లాక్కొని వాళ్ళు పుట్టింటికి గేటు దగ్గరికి తోసేస్తాడు. కానీ ఆ గీత దాటి ప్రేమ వెళ్ళదు. ధీరజ్ మొన్న వెళ్లావు కదా ఇప్పుడు ఎందుకు వెళ్ళావని అడుగుతాడు. మొన్న పుట్టింటికి వెళ్లి నువ్వు ఏం చేసావో చెప్పమని అడుగుతాడు. అయినా సరే ప్రేమ వెళ్ళదు. ఇద్దరు గేటు ముందే గొడవ పడుతూ ఉంటారు.
లాయర్ తో భద్రావతి
ఆ తర్వాత సీన్ భద్రావతి లాయర్ ని కలవడం దగ్గరికి మారిపోతుంది. భద్రావతితో పాటు విశ్వ కూడా లాయర్ దగ్గరికి వస్తాడు. భద్రావతి లాయర్ తో మాట్లాడుతూ ‘మీరు సెక్షన్లన్నీ తారుమారు చేస్తారో, ఏం చేస్తారో మాకు అనవసరం. రేపటికల్లా మా తమ్ముడు బయటికి రావాలి. అందుకు ఎవరిని భయపెట్టమన్నా, ఎవరిని బెదిరించమన్నా బెదిరిస్తాం. కానీ మాకు కావాల్సింది మా తమ్ముడు బయటికి రావడం’ అని అంటుంది. లాయర్ మాట్లాడుతూ ‘మీ తమ్ముడు అకౌంట్ నుంచి అతడికి డబ్బులు పంపించడం తప్ప.. మీ తమ్ముడు అతనితో మాట్లాడటం కానీ, నర్మదను లంచం కేసులో ఇరికించమని, కుట్ర చేసినట్టు కానీ చిన్న ఆధారం కూడా లేదు. ఒక వ్యక్తి మరొక వ్యక్తికి డబ్బులు ఇచ్చాడంటే అది అప్పుగా ఇవ్వచ్చు లేదా హెల్ప్ అవ్వచ్చు లేదంటే ఇంకేదైనా కారణం కావచ్చు. కేవలం డబ్బులు పంపించాడనే ఒకే ఒక కారణంతో మీ తమ్ముడిని జైలుకు పంపించడానికి ఆస్కారం లేదు. సో నేను కోర్టులో బలంగా వాదించి బయటికి తీసుకు వస్తాను’ అని చెబుతాడు. వెంటనే విశ్వ డబ్బులు కట్టను తీసి లాయర్ ముందు పెడతాడు.
అమూల్యను పెళ్లిచేసుకోమన్న భద్రావతి
భద్రావతి, విశ్వ బయటకొచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు. విశ్వతో భద్రావతి మాట్లాడుతూ ‘పాతికేళ్ల క్రితం రామరాజు మా చెల్లిని లేపుకెళ్లి పెళ్లి చేసుకుని, మన ఇంటి పరువు రోడ్డున పడేశాడు. మా నాన్న కూడా చచ్చిపోవడానికి కారణమయ్యాడు. వాడి చిన్న కొడుకు మీ చెల్లెల్ని తీసుకొని పెళ్లి చేసుకొని మనకు భరించలేని బాధను, గుండె కోతను మిగిల్చాడు. ఇప్పుడు వాడి రెండో కోడలి వల్ల మన ఆస్తులు సీజ్ అయ్యాయి. మీ నాన్న జైలు పాలయ్యాడు. మనం అవమాన పడి, బాధపడి పరువు పోగొట్టుకోవడం ఇదే చివరిసారి కావాలి. మనం పడిన బాధ రామరాజు కూడా పడాలి. ఆ బాధ భరించలేక వాడు గుండె ఆగి చావాలి. అది నీ చేతుల్లోనే ఉంది. వాడి చిన్న కూతురుని పెళ్లి చేసుకోవడం మీదే ఆధారపడి ఉంది. ఆలస్యం చేయడానికి అవకాశం లేదు. అమూల్యని ట్రాప్ చేసి పెళ్లి చేసుకో’ అని విశ్వను రెచ్చగొడుతుంది.
విశ్వ కూడా అమూల్య ఇప్పటికే నా ట్రాప్ లో ఉందని చెబుతాడు. తాను ప్రపోజ్ చేసినప్పుడు అమూల్య వాళ్ళ నాన్నకి చెప్పి గొడవ చేయకుండా ఉందంటే ఆమె నా గురించి ఆలోచించడం మొదలుపెట్టిందని అంటాడు. త్వరలోనే ఆమె చేత ఐ లవ్ యు చెప్పించుకుంటానని చెబుతాడు.
వల్లిపై కత్తి ఎత్తిన ప్రేమ
ఆ తర్వాత సీన్.. ప్రేమ దగ్గరికి మారుతుంది. ప్రేమ కత్తి తీసుకుని వల్లి దగ్గరికి వస్తుంది. వల్లి ‘ తలుచుకోగానే వచ్చేసావేంటక్కా’ అని భయంతో వణికిపోతూ ఉంటుంది. ప్రేమ మాట్లాడుతూ ‘నర్మదను అవినీతి కేసులో ఇరికించాలని చేసిన కుట్రలో నీ హ్యాండ్ కూడా ఉందని నాకు తెలిసిపోయింది’ అని అంటుంది. తనకు ఏమీ తెలియదని చెబుతుంది వల్లి. ‘నీ కాపురం కూలిపోకూడదని ఆలోచించి, మీ ఫ్యామిలీ నిజస్వరూపం, మీరు చేసిన మోసం తెలిసినా కూడా బయట పెట్టకుండా క్షమించి వదిలేసాను. కుక్కిన పేనుల్లా కిక్కురుమనకుండా పడుండకా.. కుట్రలు చేస్తావా’ అంటూ వల్లి పై కత్తి పెడుతుంది. అప్పుడు వల్లి తనకేం తెలియదని అంత మా అమ్మే చేసిందని అంటుంది. దానికి ప్రేమ ‘ మీ అమ్మ సూత్రధారి అయితే నువ్వు పాత్రధారివి. మొదట నీ అంతు తేలిస్తే ఆటోమేటిక్ గా మీ అమ్మకు బుద్ధి వస్తుంది’ అని చెబుతుంది. దీంతో వల్లి భయంతో అక్కడి నుంచి పారిపోతుంది. ఈ సీన్ చాలా ఫన్నీగా డైరెక్ట్ చేశారు. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగిసిపోతుంది.