- Home
- Entertainment
- Illu illalu pillalu Today Episode: నర్మదను లంచం కేసులో కాపాడిన ప్రేమ, జైలుకు సేనాపతి
Illu illalu pillalu Today Episode: నర్మదను లంచం కేసులో కాపాడిన ప్రేమ, జైలుకు సేనాపతి
Illu illalu pillalu Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ లో వేదవతి కుటుంబం ఎంతో ఆనందంగా కనిపిస్తుంది. నర్మద లంచం కేసులో బయటపడడంతో కుటుంబమంతా పండగ చేసుకుంటుంది. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ మొదలవుతుంది.

వేదవతి ఆనందం
నర్మదా లంచం కేసు నుంచి బయటపడడంతో వేదవతి కుటుంబం ఎంతో ఆనందిస్తుంది. వేదవతి తన కోడలి గురించి ఎంతో గొప్పగా చెబుతుంది. ‘నా కోడలు ఎలాంటి లంచం తీసుకోలేదని నిరూపించింది.. నాకు తెలుసు నా కోడలు ఎలాంటి తప్పు చేయదని’ అని అంటుంది. నర్మద తనపై పడిన మచ్చను తొలగించుకుని కడిగిన ముత్యంలా ఇంటికి తిరిగి వస్తుందని ఆనందంతో ఉబ్బితబ్బిబయిపోతుంది. కుటుంబమంతా ఆనందంతో గంతులు వేస్తూ ఉంటే మధ్యలో శ్రీవల్లి, ఇడ్లీ బాబాయ్, భాగ్యం మాత్రం మాడిపోయిన ముఖాలతో ఉంటారు. మధ్యలో ప్రేమ మాట్లాడుతూ ‘తనమీద కుట్ర జరిగిందని నర్మదక్క నిరూపించుకుని ఉంటుంది.. వేలెత్తి చూపినవారందరికీ చెప్పుతో కొట్టినట్టు సమాధానం ఇచ్చింది’ అని అంటుంది.
సేనాపతి, భద్రావతి కంగారు
ఆ తరువాత సీన్ భద్రావతి, సేనాపతి ఇంటికి మారిపోతుంది. వారిద్దరూ టీవీలో నర్మదా లంచం కేసులో నిర్దోషిగా బయటపడిందన్న వార్త విని షాక్ అవుతారు. ‘దీన్ని లంచం కేసులో పకడ్బందీగా ఇరికించేసాం. డబ్బు తీసుకుంటున్నట్టు స్పాట్లోనే పక్కా ఆధారాలు ఉన్నాయి. కేసు నుంచి బయటపడే అవకాశం లేదు’ అని అంటుంది భద్రావతి. సేనాపతి కూడా కంగారు పడిపోతూ.. నర్మదకి ఈ కేసు నుంచి బయటపడే అవకాశం ఎలా దక్కింది అంటాడు. ఈ లోపు వేదవతి ఇంట్లో అందరూ ఎవరి పనుల మీద వారు బయటకు వెళ్లిపోతారు. శ్రీవల్లి దగ్గరికి ఇడ్లీ బాబాయ్, భాగ్యం వచ్చి మాట్లాడతారు. భాగ్యం మాట్లాడుతూ ఆ నర్మదా లంచం కేసులో పూర్తిగా ఊబిలో కూరుకు పోయింది కదా.. మరి ఎలా బయటపడింది అని అడుగుతుంది. ‘నాకేం తెలుసు నేనసలే షాక్ లో ఉంటే నువ్వు పిన్నీసుతో పొడుస్తావ్’ అంటూ కుళ్ళిపోతూ ఉంటుంది వల్లీ. ఇడ్లీ బాబాయ్ నర్మద గురించి ‘చిరుత పులి చితక్కొట్టేస్తుందని ముందే చెప్పానా’ అంటాడు. దానికి శ్రీవల్లికి ఇంకా కోపం వస్తుంది. భాగ్యం ఇడ్లీ బాబాయ్ కి నాలుగు దెబ్బలు వేస్తుంది.
ఇక నర్మదా కేసు గురించి న్యూస్ లో చూస్తూ ఉంటారు సేనాపతి, భద్రావతి. అందులో యాంకర్.. నర్మదా లంచం కేసులో కుట్ర జరిగిందని, ఆ కుట్ర వెనుక ప్రధాన పాత్రధారులను గుర్తించారని, వారిని త్వరలో అరెస్టు చేస్తారని చెబుతుంది. అది విన్న తర్వాత భద్రావతి, సేనాపతి భయంతో వణికిపోతారు. వెంటనే సేనాపతి ‘కుట్ర చేసింది మనమేనని పోలీసులకి తెలిసిపోయినట్టుంది, లంచం తీసుకున్నట్టు నర్మదను ఇరికించాలనుకున్నాం కానీ ఇది మన మెడకు చుట్టుకునేలా ఉంది అక్కా’ అంటూ భయపడిపోతూ ఉంటాడు.
పోలీసుల ఎంట్రీ
ఈ లోపు పోలీసు కారు వచ్చి ఆగుతుంది. పోలీసులు సేనాపతి, భద్రావతి ఇంట్లోకి వెళతారు. అప్పుడే రామరాజు ఇంటికి వస్తూ ఉంటాడు. వేదవతి కుటుంబం కూడా వచ్చి పోలీసులు వచ్చిన సంగతిని చూస్తూ ఉంటారు. రామరాజు వచ్చి ఏం జరిగిందని అడుగుతాడు. వేదవతి జరిగిందంతా రామరాజుకు చెబుతుంది.ఈలోపు సేనాపతి పోలీసుల దగ్గరికి వస్తాడు. వెంటనే పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం పదండి అని చెబుతారు. భద్రావతి కోపంగా ‘ఎక్కడకొచ్చి ఏం మాట్లాడుతున్నారు, ఎవరిని అరెస్ట్ చేస్తామంటున్నారు, నా తమ్ముడిని అరెస్టు చేసేంద ధైర్యం వచ్చిందా?’ అని అరుస్తుంది. పోలీసులు ‘నేరం చేశాడు కాబట్టి అరెస్టు చేస్తున్నాము’ అని చెబుతారు. సేనాపతి రాకపోతే చెయ్యి పట్టుకొని బయటికి లాక్కొస్తారు. ఈ విషయాన్ని రామరాజు కుటుంబం చూస్తూ ఉంటుంది.
సేనాపతికి నర్మద క్లాస్
ఈ లోపు అక్కడికి నర్మదా ఎంట్రీ ఇస్తుంది. సేనాపతితో నర్మదా మాట్లాడుతూ ‘సింహం ఆదమరుపులో ఉన్న సమయంలో ఒక తోడేలు ఆ సింహాన్ని వేటాడాలనుకుందట. కానీ పాపం ఆ తోడేలుకు తెలియని విషయం ఏమిటంటే సింహం ఆదమరుపులోనే ఉంది... అసమర్థతతో కాదు’ అంటుంది. ‘గవర్నమెంట్ స్థలాలను ఆక్రమించి కన్స్ట్రక్షన్ చేసిన మీకే అన్ని తెలివితేటలుంటే.. కష్టపడి చదివి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి, గవర్నమెంట్ జాబ్ కొట్టిన నాకు ఎన్ని తెలివితేటలు ఉండాలి.. కుట్ర చేసి నన్ను లంచం కేసులో ఇరికించి నా జాబ్ పోగొట్టాలని చూస్తే ఊరుకుంటానని ఎలా అనుకున్నారు? మీ కుట్రను మీకే తిప్పికొడతానని మీరు ఊహించకపోతే ఎలా సర్’ అంటూ గట్టిగా మాట్లాడుతుంది నర్మదా.
‘ఏంటి మూడో కంటికి తెలియకుండా ఎవరికి డౌట్ రాకుండా చాలా తెలివిగా ప్లాన్ చేసాం కదా.. జైలుకు వెళ్లడం తప్పా బయటపడే పరిస్థితి లేదు కదా మరి ఎలా బయటపడింది నన్నెలా అరెస్టు చేయించింది అని షాక్ అవుతున్నారా? ఎంత తెలివిగా నేరం చేసినవాడైన ఎక్కడో దగ్గర చిన్న క్లూ వదిలిపోతాడు. మీరు కూడా అలాగే దొరికిపోయారు’ అంటూ సేనాపతి, భద్రావతులకి షాకింగ్ న్యూస్ చెబుతుంది. నన్ను లంచం కేసులో ఇరికించడం కోసం మీరు మీ అకౌంట్ నుంచి అతనికి డబ్బులు పంపించారు. కానీ మీ బ్యాంకు డీటెయిల్స్ నాకు ఆయుధం అయ్యాయి. మీ అరెస్టుకు కారణం అయ్యాయి అని అసలు విషయం చెప్పేస్తుంది నర్మదా.
ప్రేమ చేసిన సాయం
ఈలోపు సేనాపతి.. తన అకౌంట్ నుంచే ఆ వ్యక్తికి డబ్బులు పంపించినట్టు నర్మదకు ఎలా తెలిసింది అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ సమయంలోనే నర్మదా ప్రేమను సాయం అడిగిన సంగతి గుర్తు చేసుకుంటుంది. ప్రేమ సీక్రెట్ గా పుట్టింట్లోకి వెళ్లి తన నాన్న ఫోను చెక్ చేస్తుంది. ఆ బ్యాంకు డీటెయిల్స్ ను స్క్రీన్ షాట్ తీసి నర్మదకు పంపిస్తుంది. ఆ విషయాన్ని నర్మదా గుర్తు చేసుకుంటుంది. ప్రేమ సాయంతోనే నర్మదా ఈ కేసు నుంచి బయటపడిందని అర్థం అవుతుంది. సేనాపతికి విషయం తెలిసి తండ్రికి చాలా గొప్ప సాయం చేశావు అంటూ కోపంగా పోలీసు జీప్ ఎక్కి వెళ్లిపోతాడు.
ఈలోపు రామరాజు.. సేనాపతి తో మాట్లాడుతూ ‘తప్పు అని తెలిశాక సరిదిద్దుకోకపోవడం ఇంకా తప్పు. మీరు బిల్డింగ్ కట్టినచోట గవర్నమెంట్ స్థలం ఉందని తెలిసి కూడా ఆ తప్పును సమర్ధించుకునేందుకు ప్రయత్నించారు. నా కోడల్ని లంచం కేసులో ఇరికించి కుటుంబాన్ని కూలదోయాలనుకున్నారు. మీరు ఇంత దిగజారి ప్రవర్తించడానికి సిగ్గు అనిపించడం లేదా, ఇప్పటివరకు మీరు నన్ను ఏమన్నా ఎంతలా అవమానించిన నా భార్యకు బంధువులని క్షమించి వదిలేసాను. కానీ నా కోడలు అలా కాదు.. హాని చేయాలని, మోసం చేయాలని చూస్తే తాటతీస్తుంది అని అంటాడు. తర్వాత పోలీసులు సేనాపతిని తీసుకొని వెళ్ళిపోతారు.
శ్రీవల్లికి భయం
నర్మదా శ్రీవల్లి భాగ్యం ఇడ్లీ బాబాయిలకు కూడా వార్నింగ్ ఇస్తుంది. భాగ్యం గురించి మాట్లాడుతూ ‘నువ్వు ఏమన్నావ్ పిన్ని... ఆడపిల్లవి ఇంట్లో అంట్లు తోముకోక, వంటలు చేసుకోక జాబ్ ఎందుకు అని అన్నావు, ఎందుకో ఇప్పుడు అర్థమైందా’ అని అంటుంది. తరువాత వల్లి తో మాట్లాడుతూ ‘నీ మీద నాకు చాలా డౌట్ ఉంది.. ఒక విషయంలో నువ్వు ఏదో చేస్తున్నావ్. నీ మీద ఎప్పుడూ ఒక కన్నేసి ఉంచుతాను.. నీ పని కూడా చెబుతాను’ అంటూ వార్నింగ్ ఇచ్చిపోతుంది. ఇక శ్రీవల్లి రాత్రంతా గోల గోల చేస్తుంది. నర్మద ఇచ్చిన వార్నింగ్ గుర్తు చేసుకుని తెగ భయడుతూ,ఏడుస్తూ గోల గోల చేస్తూ ఉంటుంది. న గురించి పూర్తిగా నర్మదకు తెలిస్తే ఖచ్చితంగా ఊరుకోదని చిప్పకూడు తినిపస్తుందని భయపడుతూ ఉంటుంది. ఇక్కడతో ఎపిసోడ్ ముగిసిపోతుంది.