- Home
- Entertainment
- Illu Illalu Pillalu Today Episode Nov 26: వామ్మో.. వల్లీ ఉత్తమ కోడలట, షాక్ లో నర్మద ప్రేమ
Illu Illalu Pillalu Today Episode Nov 26: వామ్మో.. వల్లీ ఉత్తమ కోడలట, షాక్ లో నర్మద ప్రేమ
Illu Illalu Pillalu Today Episode Nov 26: వల్లీ రామరాజుని రెచ్చగొట్టి మరింతగా నర్మద, ప్రేమలను చెడ్డ చేసేందుకు ప్రయత్నిస్తుంది. మంచిగా మాట్లాడుతూనే రామరాజును బాధ పెడుతుంది. వేదవతి మాత్రం ఉత్తమ కోడలు వల్లీ అని అనేస్తుంది. ఇక ఈ రోజుఏం జరిగిందో చదవండి.

నాకు ఏ విలువ లేదంటూ రామరాజు ఆవేదన
ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ లో వేదవతి రామరాజుని భోజనానికి రమ్మని పిలుస్తుంది. రామరాజు తినేందుకు ఇష్టపడడు. కోడళ్ళు, కొడుకులు అందరూ అక్కడికి వస్తారు. ‘ఎలా తినగలను. నా ఇంట్లో ఏం సంతోషం ఉందని తినగలను. నేనంటే నా కొడుకులకి ఏం విలువ ఉందని సంతోషంగా కడుపునిండా తినగలను. నాన్నంటే అంత గౌరవం, ప్రేమ ఉండబట్టేనా నాకు చెప్పకుండా ఎగ్జామ్స్ రాసి గవర్నమెంట్ ఉద్యోగం చేయాలనుకున్నాడు. వీడేమో తన భార్యని పోలీస్ చేయాలనుకున్నాడు. ఒక జీవితాన్నిచ్చిన ఈ నాన్నంటే వారికి ఏమాత్రం గౌరవం లేదు’ అని బాధ పడతాడు రామరాజు.
వల్లీ ఇదే అదనుగా రెచ్చిపోయింది. మరింత గొడవ పెట్టేందుకు రామరాజుకి మరింత బాధ కలిగించేలా మాట్లాడింది. ఇంటికి వచ్చాక మిమ్మల్ని ఇలా ఎప్పుడూ చూడలేదండి అంటూ ఏడుపు మొదలు పెట్టేస్తుంది. దేవుడు లాంటి మీరు ఇలా బాధపడుతూ ఉంటే చూడలేకపోతున్నానండి అంటూ నటించేస్తుంది. ‘ప్రేమ చేసింది తప్పేనండి, సాగర్ మరిది గారు ఉద్యోగం కోసం ఎగ్జామ్ రాయడం, నర్మద మీకు చెప్పకపోవడం కూడా తప్పేనండి’ అంటూ మరింతగా రామరాజుకు కోపం వచ్చేలా చేస్తుంది.
వల్లీ మామూలుది కాదు
‘ఆరోజు ప్రేమ ట్యూషన్లు చెప్పడానికి వెళ్లిందని నడిరోడ్డు మీద మీ చొక్కా చింపేశారు. ఆడపిల్ల సంపాదన తినడానికి సిగ్గు లేదా అని మిమ్మల్ని దారుణంగా అవమానించారు. మిమ్మల్ని అవమానిస్తారని తెలిసి కూడా ప్రేమ పోలీస్ ఉద్యోగం చేయాలనుకోవడం తప్పే. కానీ వాళ్ళు ఎవరు మామయ్యగారు? మీ కోడళ్ళు. తల్లి కోడి పిల్లలను రెక్కల కింద దాచుకున్న భద్రంగా కాపాడుకుంటారు కానీ కోపం తెచ్చుకుంటారా మావయ్య గారు’ అంటూ తెగ నటించేస్తుంది. ఇవన్నీ విని నర్మదా, ప్రేమ, ధీరజ్, సాగర్ లకు చాలా కోపం వస్తుంది.
మధ్యలో వల్లి ‘అందరు కొడుకులు నా భర్త లాగా తండ్రి మాట కోసం బతకరు కదండీ’ అని మరి కొంచెం ఎక్కించేస్తుంది. వల్లిని వచ్చి పెద్దోడు ఆపుతున్న కూడా ఆగకుండా రెచ్చిపోయి మాట్లాడుతుంది. సాగర్, ధీరజ్ లకు తండ్రి కన్నా భార్యలే ఎక్కువై ఉండొచ్చు అంటూ మరింతగా రెచ్చగొడుతుంది వల్లి. ఆగకుండా అలా రామరాజును బాధపెట్టేలాగే మాట్లాడుతూ ఉంటుంది.
ఉత్తమ కోడలు వల్లీనట
వల్లి ఇక్కడితో ఆగకుండా ‘మీరు చేసిన తప్పులకు మావయ్య గారికి క్షమాపణ చెప్పండి’ అంటూ నర్మద, ప్రేమలను చేతులను పట్టుకొని లాక్కొస్తుంది. వాళ్ళిద్దరూ కూడా సారీ మావయ్య అని చెబుతారు. వల్లి రామరాజు కాళ్ళు పట్టుకొని మరీ క్షమించమని బతిమిలాడుతుంది. వెంటనే రామరాజు సరేలే అని అనేసి వెళ్ళిపోతారు. దీంతో వల్లి ఆనందంగా గంతులు వేస్తుంది. వేదవతి నా మంచి కోడలు అంటూ వల్లీని తెగ మెచ్చుకుంటుంది. ఇక వల్లి ఆనందానికి అవధులు ఉండవు. ఇక ఇక్కడ నుంచి సీన్ నర్మద దగ్గరికి మారుతుంది. నర్మద ఉదయం లేచి పూజకి సిద్ధమవుతూ ఉంటుంది. సాగర్ దిగాలుగా కూర్చుని ఉంటాడు. నర్మద ఎన్ని చెప్పినా అలానే కూర్చుంటాడు. నువ్వు మీ నాన్నని ఎదిరించి మాట్లాడుతూ ఉంటే నేను షాక్ తిన్నాను అని అంటుంది నర్మద.
సాగర్ దాని గురించి మాట్లాడుతూ ‘నాకోసం వచ్చిన అమ్మాయిని సంతోషంగా ఉంచడం నా బాధ్యత. నా భార్యను పుట్టింటికి దగ్గర చేయడానికి నేను జాబ్ చేయడం ఒక్కటే మార్గం. నాన్న ఈ విషయం అర్థం చేసుకోకుండా నేను ద్రోహం, నేరం చేసినట్టు మాట్లాడితే బాధ, కోపం రాకుండా ఎలా ఉంటుంది’ అని అంటాడు. సాగర్ ఇంకెప్పుడు మీ నాన్నతో గొడవ పడొద్దు అని నర్మద సర్ది చెబుతుంది. పూజకు రమ్మని చెబుతుంది. కానీ సాగర్ పూజకు వస్తే నాన్నా.. నేను ఒకరి ముఖం ఒకరం చూసుకోవాలి, కాబట్టి నేను రాలేనని చెబుతాడు. పూజకు సాగర్ ని ఎలాగోలా ఒప్పించేస్తుంది నర్మద.
ప్రేమ నగలు వేసుకుని వల్లీ డ్యాన్సులు
ఇక అక్కడి నుంచి సీన్ రెండు కుటుంబాలను కలిపేందుకు చేసే ప్రయత్నాల దగ్గరికి వెళుతుంది. రామరాజుతో వేదవతి మాట్లాడుతూ ఈ రెండు కుటుంబాలు ఎందుకు కలవవండి? ఏదో ఒకరోజు కలవకుండా ఎలా ఉంటారు అని అంటుంది. దానికి రామరాజు పగటి కలలు కనడం మానేయండి అని చెప్పి వెళ్లిపోతాడు. ఇక వల్లి అందంగా రెడీ అయిపోతుంది. నగలన్నీ వేసుకొని వడ్డాణం పెట్టుకొని మురిసిపోతూ ఉంటుంది. ఆ నగలను చూసి నడిచి వస్తున్న నగల కొట్టులా ఉన్నాను అంటూ ఆనంద పడిపోతూ ఉంటుంది. అలాగే రామరాజు దగ్గర ప్రేమను, నర్మదను ఇరికించినందుకు ఆనందంతో డాన్సులు వేస్తూ ఉంటుంది.
అదే సమయానికి తిరుపతి ఎంట్రీ ఇస్తారు. దీంతో నగలు దాచేందుకు చీరతో కప్పేసుకుంటుంది వల్లి. వల్లి వేసుకున్న నగలు ప్రేమవి. గతంలో ప్రేమ నగలను మార్చేసి బంగారం తీసేసుకుంటుంది.ఈ విషయం ఎవరికీ తెలియదు. తిరుపతి నగలను పోల్చేస్తాడేమోనని భయంతో అలా ఉండిపోతుంది. ఇక్కడితో ఎపిసోడ్ ముగిసిపోతుంది.

