MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • Illu Illalu Pillalu మార్చి 9 ఎపిసోడ్: నర్మద కాలు పట్టుకున్న వేదవతి, వల్లి కుళ్లు

Illu Illalu Pillalu మార్చి 9 ఎపిసోడ్: నర్మద కాలు పట్టుకున్న వేదవతి, వల్లి కుళ్లు

Illu Illalu Pillalu మార్చి 9 ఎపిసోడ్: ఇల్లు ఇల్లాలు పిల్లలు నేటి ఎపిసోడ్లో వేదవతిని ఎలాగోలాగా నర్మద, ప్రేమ కలసి కూల్ చేసేస్తారు. నర్మద తిరిగి అత్తగారితో కలిసిపోతుంది. ఇది చూసి వల్లికి కుళ్లిపోతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోండి. 

3 Min read
Author : Haritha Chappa
Published : Mar 09 2026, 09:54 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
కలిసిపోయిన నర్మద వేదవతి
Image Credit : Jio hotstar

కలిసిపోయిన నర్మద వేదవతి

ఇల్లు ఇల్లాలు పిల్లలు నేటి ఎపిసోడ్లో నర్మద... వేదవతితో మాట్లాడేందుకు ఎంతగానో ప్రయత్నిస్తుంది. కానీ వేదమతి మాత్రం పట్టించుకోకుండా అరుస్తూనే ఉంటుంది. వల్లిని పిలిచి ఆమె తలకి కొబ్బరినూనె పెడుతుంది. వల్లి ఆనందంతో పొంగిపోతూ ఉంటుంది. ఇక ప్రేమ, ధీరజ్ కలిసి ఎలాగైనా నర్మదను వేదవతితో కలపాలని నిర్ణయించుకుంటారు. ప్రేమ వేదవతి లాగా మారి నర్మదను కావాలనే తిడుతుంది. ‘నువ్వు నేనే అత్తగారు అనుకొని ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు’ అని అంటుంది. అప్పుడు నర్మద తన మనసులోని బాధను చెబుతుంది. వేదవతిని ఓ పక్క వల్లి మాత్రం రెచ్చగొడుతూ ఉంటుంది. నర్మద వేదవతి దగ్గర కూర్చుని మిమ్మల్ని మోసం చేయాలనే ఉద్దేశం నాకు లేదని చెబుతుంది. కానీ వేదవతి కోపంగా లేచి నర్మదను పక్కకి తోసేసి వెళ్ళిపోతూ ఉంటుంది. అదే సమయంలో ప్రేమ కావాలనే నర్మద కాలుకి.. తన కాలు అడ్డం పెట్టి కింద పడేలా చేస్తుంది.

నర్మద కింద పడిపోయాక ‘అయ్యో అత్తగారు తోసేసారు నర్మదని. అత్తగారు మంచివారు అనుకున్నాము కానీ ఇలా తోసేస్తారా’ అంటూ హంగామా చేస్తుంది. దాంతో వేదవతి ఆగిపోయి నేను చేశానా అని బాధపడుతుంది. నర్మద ‘మీ అబ్బాయి చనిపోతాను అంటే ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో బంగారం తాకట్టు పెట్టి వనజ గారికి డబ్బులు ఇచ్చాను. అలాగే మీ అబ్బాయి ఇంట్లోంచి వెళ్లిపోతూ ఉంటే భార్యగా తన వెనుక నడిచాను. మీరు మావయ్య గారి కోసం మీ ఇంటిలోవాళ్లని వదిలేసి రాలేదా? మీరే అర్థం చేసుకోకపోతే ఎలా? మీరైతే నా స్థితిలో ఉంటే ఏం చేస్తారు?’ అని అడుగుతుంది. అప్పుడు వేదవతి కూల్ గా మారి నర్మదని దగ్గరికి తీసుకుంటుంది. కాలు తీసుకుని కొబ్బరి నూనెతో మర్ధనా చేస్తుంది. ఇంకెప్పుడూ తన దగ్గర ఏ విషయాలు దాచవద్దని చెబుతుంది. నర్మద ఇంకెప్పుడూ దాయనని చెప్పి వేదవతిని కౌగిలించుకుంటుంది. ఇదంతా చూసిన వల్లికి కడుపులో మంట మొదలైపోతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఇడ్లీ బాబాయి వెంట పడ్డ ఏజెంట్
Image Credit : Jio hotstar

ఇడ్లీ బాబాయి వెంట పడ్డ ఏజెంట్

ఇక ఇక్కడి నుంచి ఎపిసోడ్ ఇడ్లీ బాబాయి దగ్గరికి మారుతుంది. ఇడ్లీ బాబాయి తెల్లటి పంచె కుర్తాతో రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతుంటాడు. ఏజెంట్ అతడిని చూసి గుర్తుపట్టి మీరు ఐదు లక్షలు ఇస్తానన్నారు కదా ఉద్యోగం కోసం నాలుగు లక్షలు ఇవ్వండి, ఉద్యోగం ఇప్పిస్తాను అంటాడు. కానీ ఇడ్లీ బాబాయ్ ఏజెంట్ ఎవరో తెలియనట్టు నటిస్తాడు. అయినా ఇడ్లీ బాబాయిని ఫాలో అవుతూ ఇంటి వరకు వచ్చేస్తాడు ఏజెంట్. ఇంట్లోంచి భాగ్యం బయటకు వచ్చి ఏజెంట్ ను చీపురుతో కొట్టి అక్కడి నుంచి తరిమేస్తుంది. ఈ లోపు వల్లి.. భాగ్యానికి ఫోన్ చేసి ఇంట్లో జరిగిందంతా చెబుతుంది. భాగ్యం మనమే ఈ గొడవ వెనక ఉన్నామని తెలిస్తే నర్మద నరాలు లాగేస్తుంది.. కాబట్టి జాగ్రత్తగా ఉండు అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది.

33
ప్రేమ ధీరజ్ రొమాంటిక్ సీన్
Image Credit : Jio hotstar

ప్రేమ ధీరజ్ రొమాంటిక్ సీన్

ఇక ఇక్కడ నుంచి సీన్ ధీరజ్ దగ్గరికి మారిపోతుంది. ఐ లవ్ యు ప్రేమ అని గోడ మీద రాస్తాడు. అలాగే ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ ఉంటాడు. సరిగ్గా సమయానికి ప్రేమ వస్తుంది. గోడమీద ఉన్నది ప్రేమ చూసుకోదు. ప్రేమ ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావు అని అడుగుతుంది. దానికి ధీరజ్ నేను ఎవరితో ఫోన్ మాట్లాడితే నీకెందుకు అని సమాధానం చెబుతాడు. ప్రేమ ‘నీకు సంబంధించిన ప్రతి చిన్న విషయం నాకు తెలియాలి. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో, నువ్వు ఏం చేస్తున్నావో నాకు తెలియాల్సిందే’ అని అంటుంది. అయినా ధీరజ్ కావాలనే ప్రేమను రెచ్చగొట్టేందుకు చిన్నచిన్న గొడవలు పెట్టుకుంటాడు. కార్ డౌన్ పేమెంట్ కోసం మీ కామాక్షి అక్కను డబ్బులు అడుగుదామనుకున్నావు కదా.. వాళ్ళకి ఫోన్ చేసావా? అని అంటుంది ప్రేమ. దానికి ధీరజ్ మా అక్కని డబ్బులు అడిగితే వెంటనే ఫోన్ కట్ చేసేస్తుంది. డబ్బులు కావాలంటే మా బావతోనే మాట్లాడాలి అని చెబుతాడు ధీరజ్. అప్పుడు ప్రేమ ఆ ఐశ్వర్యతో మాట్లాడుతున్నావా అంటూ గతంలో కలిసిన ఒక అమ్మాయి గురించి అడుగుతుంది. అప్పుడు ధీరజ్ కావాలనే ప్రేమను ఉడికించేలా మాట్లాడుతాడు. కరెక్ట్ గానే కనిపెట్టావు అంటూ ప్రేమను ఇంకా ఏడిపిస్తాడు. నీకు అసలు ఎందుకు ఫోన్ చేసింది అని.. ప్రేమ కోపంగా ధీరజ్ ఫోన్ లాక్కొని ఎవరితో మాట్లాడాడో చూస్తుంది. ఇద్దరి మధ్య కాసేపు రొమాంటిక్ సీన్ జరుగుతుంది. ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగిసిపోతుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వినోదం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Dhanush Wishes PM Modi: ధనుష్ ఒక్క ట్వీట్‌తో రేగిన పొలిటికల్ రచ్చ..విజయ్ అభిమానుల ట్రోలింగ్
Recommended image2
Kaaka: 'కాకా' భార్యగా సీనియర్ హీరోయిన్.. 25 ఏళ్లకు తీరబోతున్న ఆమె చిరకాల కోరిక ?
Recommended image3
Anasuya: అనసూయ ఏం చేసినా వైరల్ అయిపోద్ది.. షార్ట్ హెయిర్ తో గ్లామరస్ లుక్ చూశారా
Related Stories
Recommended image1
Illu Illalu Pillalu: రైస్ మిల్లుకు ఇక రామరాజు పూర్తిగా దూరం, అధికారం వల్లి తండ్రి చేతుల్లోకి...
Recommended image2
Illu Illalu Pillalu మార్చి 6 ఎపిసోడ్: నర్మదకు ఆఫీసులో అవమానం, రైస్ మిల్లుకు వెళ్లేందుకు రామరాజు ప్లాన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved