MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • Illu Illalu Pillalu Today Episode Feb 19: నర్మదకు దొరికిపోయిన సాగర్, డబ్బులు కొట్టేసేందుకు వల్లి ప్లాన్

Illu Illalu Pillalu Today Episode Feb 19: నర్మదకు దొరికిపోయిన సాగర్, డబ్బులు కొట్టేసేందుకు వల్లి ప్లాన్

Illu Illalu Pillalu Today Episode Feb 19: ఇల్లు ఇల్లాలు పిల్లలు నేటి ఎపిసోడ్లో నర్మద సాగర్ సంగతి తేల్చేస్తుంది. బ్యాంకులో 20 లక్షల లేవన్న సంగతి సాగర్ ముందే బయటపెడుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోండి. 

4 Min read
Author : Haritha Chappa
Published : Feb 19 2026, 09:37 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
మాట తీసుకున్న వేదవతి
Image Credit : Jio hotstar

మాట తీసుకున్న వేదవతి

ఇల్లు ఇల్లాలు పిల్లలు నేటి ఎపిసోడ్లో వేదవతి కొడుకులను పిలిచి చాలా బాధపడుతూ ఉంటుంది. ‘మీరు ఏదైనా చేసినా, మీలో మీరు గొడవలు పడినా మీ నాన్న ప్రాణం పోయినంతగా విలవిలలాడిపోతారు. సాగర్ మీ నాన్నకి ఒక్క మాట కూడా చెప్పకుండా ఉద్యోగం చూసుకునేసరికి ఎక్కడ వాడి జీవితం వాడు చూసుకుంటాడోనని.. మీరు కూడా మీ ఇష్టప్రకారం నిర్ణయాలు తీసుకుంటారనీ.. ఎక్కడ ఈ గుమ్మం దాటి వెళ్లిపోతారేమోనని మీ నాన్న చాలా భయపడుతున్నారు. అందుకే మీ నాన్నకు నచ్చిన విధంగా మీ నాన్నను బాధ పెట్టేలా మీరు ముగ్గురు ప్రవర్తించమని, ఎలాంటి పొరపాట్లుగానీ, తప్పులు కానీ చేయమనీ.. ఇంట్లో ఏం జరిగినా కూడా మీలో మీరు గొడవలు పడి దూరం అవ్వము అని, అన్నిటికన్నా ముఖ్యంగా విడిపోమని నాకు మాట ఇవ్వండి’ అని అడుగుతుంది వేదవతి. అందరూ కలిసి తల్లి చేతిలో చెయ్య వేసి ఒట్టు వేస్తారు. దాంతో వేదవతి చాలా సంతోషిస్తుంది

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
డబ్బు పిచ్చితో వల్లి
Image Credit : Jio hotstar

డబ్బు పిచ్చితో వల్లి

ఇక్కడ నుంచి సీన్ పెద్దోడు గదికి మారుతుంది. రైస్ మిల్లు లెక్కలు చూస్తూ డబ్బులు లెక్క పెడుతూ ఉంటాడు చందు. అక్కడికి శ్రీవల్లి వచ్చి డబ్బును చూసి చాలా సంతోష పడిపోతుంది. ఒకేసారి ఇన్ని డబ్బులు ఎక్కడివి? అని అడుగుతుంది శ్రీవల్లి. దాంతో చందు రైస్ మిల్లు కలెక్షన్ అని చెబుతాడు. ఎంత అని అడిగితే 85,000 అని చెబుతాడు చందు. ఒక్క రోజుకే 85 వేలా అని ఆనందంతో పొంగిపోతుంది వల్లి. పెళ్లిళ్లు సీజన్లో ఇంకా ఎక్కువ వస్తాయని చెబుతాడు చందు. దీంతో శ్రీవల్లి సంతోష పట్టలేక పోతుంది. చందు ఖర్చులు పోను రోజుకు 30,000 మిగులుతాయని చెబుతాడు. దీంతో వల్లి లెక్కలు వేయడం మొదలు పెడుతుంది. ఐదేళ్లలో తాను కోటీశ్వరురాల్ని అయిపోతానని కల కంటుంది. 

కలలో ఒంటి నిండా బంగారంతో తయారైనట్టు కనిపిస్తుంది. ఆ కలలో నర్మద, ప్రేమను ఏడిపించినట్టు కూడా కలగని సంతోషపడుతుంది. ఈలోపు చందు తండ్రికి లెక్కలు చెప్పేందుకు వెళుతూ ఉంటే వల్లి ఆపుతుంది. ‘మావయ్య గారికి ఆరోగ్యం బాగోలేకే నీకు రైస్ మిల్లు అప్పచెప్పారు కదా, ఆయనకి లెక్కలు చెప్పడం ఎందుకు? డబ్బులు మావయ్య గారికి ఇవ్వకుండా మీ దగ్గరే ఉంచుకోండి’ అని సలహా ఇస్తుంది వల్లి. మావయ్య గారు అడిగినప్పుడు లెక్కలు చెబుదురులెండి అని అంటుంది. చందు భార్య మాట విని డబ్బులు తన దగ్గరే ఉంచుకుంటాడు.

34
దొంగతనం చేసిన ఇడ్లీబాబాయ్
Image Credit : Jio hotstar

దొంగతనం చేసిన ఇడ్లీబాబాయ్

ఇక్కడి నుంచి సీన్ ఇడ్లీ బాబాయి, భాగ్యం దగ్గరికి మారుతుంది. ఇడ్లీ బాబాయ్ చేతికి పువ్వులు కట్టుకొని వస్తాడు. భాగ్యాన్ని పట్టుకొని గిరగిరా తిప్పేస్తాడు. కాసేపు ఇడ్లీ బాబాయ్ పై ఒక పాట వేస్తారు. భాగ్యం, ఇడ్లీ బాబాయ్ కలిసి డాన్స్ వేస్తారు. తర్వాత ఇడ్లీ బాబాయ్ తాను 2000 సంపాదించానని ఆ డబ్బుని తీసుకొచ్చి భాగ్యానికి ఇస్తాడు. రైస్ మిల్లు క్యాష్ కౌంటర్ నుంచి రూ.2000 కొట్టేసినట్టు చెబుతాడు. దానికి భాగ్యం కోపంగా ‘అల్లుడుగారు నువ్వు ఇలా 2000, 1000 కొట్టేయడం చూస్తే మనల్ని మిల్లుకు రావొద్దని చెబుతారు. కోట్లు చేసే రైస్ మిల్లు చేజారిపోతుంది. టైం చూసి రైస్ మిల్లును మనం సొంతం చేసుకుందాము. అప్పటివరకు ఇలాంటి చిల్లర దొంగతనాలు చేయొద్దు’ అని చెబుతోంది. దాంతో ఇడ్లీ బాబాయ్ సరేనని చెబుతాడు.

44
నర్మదకు తెలిసిపోయిన నిజం
Image Credit : Jio hotstar

నర్మదకు తెలిసిపోయిన నిజం

ఇక్కడ నుంచి సీన్ సాగర్ దగ్గరికి మారుతుంది. సాగర్ చాలా కంగారు పడుతూ కనిపిస్తాడు. 20 లక్షలు వాడేసిన సంగతి బయటపడితే ఎలాగా? 20 లక్షలు ఎలా తెచ్చి ఇవ్వాలి అని సాగర్ ఆలోచిస్తూ ఉంటాడు. అక్కడికి నర్మద.. సాగర్ కోసం అన్నం ప్లేట్ తో వస్తుంది. అన్నం తినమని చెబుతుంది. కానీ సాగర్ విసిగించవద్దని ఆకలిగా లేదని చెబుతాడు. అయినా కూడా నర్మద అన్నం కలిపి గోరుముద్దలు భర్తకు తినిపిస్తుంది. ఆ సమయంలోనే నర్మద మాట్లాడుతూ ‘నీకు జాబ్ వచ్చిందంటే మా ఆఫీసులో కొలీగ్స్‌తో పాటు ఎవరూ నమ్మడం లేదు. కానీ నేను మాత్రం కష్టపడి చదివి పరీక్ష రాసి జాబ్ సాధించావని ఎంత గర్వంగా చెబుతున్నానో తెలుసా’ అని అంటుంది. ఆ తర్వాత నర్మద అనుమానంతో ఇంతకీ ఏ రోజు నువ్వు పరీక్ష రాశావు అని అడుగుతుంది. దానికి సాగర్ తడబడుతూ లాస్ట్ మంత్ 16 రాసానని చెబుతాడు. అప్పుడు నర్మద ఆరోజు మనిద్దరం కలిసి గుడికి వెళ్ళినట్టు ఉన్నాం కదా అంటుంది. అప్పుడు సాగర్ మాట మారుస్తూ మర్చిపోయాను 17వ తేదీన రాశాను అని చెబుతాడు.

ఎగ్జామినేషన్ సెంటర్ గురించి కూడా ఆరాలు తీస్తుంది నర్మద. 17వ తేదీన పరీక్షలు జరిగింది వేరే డిపార్ట్మెంట్ కి సంబంధించినవి కదా... మా ఆఫీస్ లో మా కొలీగ్ వాళ్ళ తమ్ముడు అదేరోజు విజయవాడలో వేరే డిపార్ట్మెంట్ ఉద్యోగం కోసం ఎగ్జామ్ రాసాడులే అని అంటుంది. నర్మదకు సాగర్ పై పూర్తిగా డౌట్ వస్తుంది. నువ్వు ఒక పరీక్ష రాస్తే మరొక డిపార్ట్మెంట్లో ఉద్యోగం ఎలా వచ్చింది? అనగానే సాగర్ కంగారుతో దగ్గుతూ ఉంటాడు. సాగర్ మాట్లాడుతూ ఎగ్జామ్ రాసిన డేటు మర్చిపోయాను అంటాడు. అప్పుడు నర్మదా ‘ఎగ్జామ్ రాసిన డేటు మర్చిపోయినా పర్వాలేదు, కానీ వనజ గారికి రేపు బ్యాంక్ నుంచి 20 లక్షలు తెచ్చి ఇవ్వాలి. ఆ విషయం మర్చిపోకు’ అని సీరియస్ గా చెబుతుంది. అసలు డబ్బులు ఎకౌంట్లోనే ఉన్నాయా అని అడుగుతుంది. దానికి సాగర్ ఉన్నాయని చెబుతాడు. 

వెంటనే నర్మదా తన ఫ్రెండు రమ్యకు ఫోన్ చేసి ‘సాగర్ బ్యాంకుకు వచ్చి 20 లక్షలు తీసుకున్నాడని చెప్పావు. కానీ సాగర్ అకౌంట్లోనే ఉన్నాయని చెబుతున్నాడు’ అని అడుగుతుంది. దానికి ఫోన్లో ఉన్న అమ్మాయి రెండు రోజుల క్రితం బ్యాంకుకు వచ్చి 20 లక్షలు తీసుకువెళ్లాడు అని చెప్పేస్తుంది. కావాలంటే రేపు బ్యాంకు ఓపెన్ చేయగానే డీటెయిల్స్ పంపిస్తాను చూడు అంటుంది. ఇదంతా లౌడ్ స్పీకర్లో సాగర్ కూడా వింటాడు. నర్మద ముందు అడ్డంగా దొరికిపోతాడు సాగర్. నర్మద చాలా సీరియస్ గా సాగర్ వైపు చూస్తూ ఉండగా ఎపిసోడ్ ముగిసిపోతుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వినోదం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
P N Ramachandra Rao: సీనియర్ దర్శకుడికి అరుదైన పురస్కారం.. గవర్నర్‌ చేతుల మీదుగా ప్రదానం
Recommended image2
Samantha: 7 నెలల ప్రెగ్నెన్సీ తో సమంత.. అభిమానుల కోసం ఇంత రిస్క్ చేస్తోందా?
Recommended image3
Top 10 Heroes: పడిపోయిన రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ ప్లేస్‌ గల్లంతు.. ప్రభాస్‌, బన్నీ, మహేష్‌ స్థానాలివే
Related Stories
Recommended image1
Illu Illalu Pillalu Today Episode Feb 18: అడ్డంగా దొరికిపోయిన సాగర్, ఇంటికొచ్చి రచ్చ చేసిన వనజ
Recommended image2
Illu Illalu Pillalu Today Episode Feb 17: సాగర్‌ జాబ్ గురించి భాగ్యానికి దొరికిన పెద్ద క్లూ, విశ్వకు బుద్ధి చెప్పిన అమూల్య
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved