- Home
- Entertainment
- Illu Illalu Pillalu Today Episode Feb 18: అడ్డంగా దొరికిపోయిన సాగర్, ఇంటికొచ్చి రచ్చ చేసిన వనజ
Illu Illalu Pillalu Today Episode Feb 18: అడ్డంగా దొరికిపోయిన సాగర్, ఇంటికొచ్చి రచ్చ చేసిన వనజ
Illu Illalu Pillalu Today Episode Feb 18: ఇల్లు ఇల్లాలు పిల్లలు నేటి ఎపిసోడ్లో వనజ పెళ్లికి ఇచ్చిన డబ్బుల కోసం ఇంటికి వస్తుంది. అదే సమయానికి సాగర్ ఇంటికి వస్తాడు. దీంతో 20 లక్షల గురించి రచ్చ మొదలవుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోండి.

విశ్వకు చుక్కలు చూపించిన అమూల్య
ఇల్లు ఇల్లాలు పిల్లలు నేటి ఎపిసోడ్లో అమూల్య ఇచ్చిన టీ తాగిన విశ్వకు పొట్ట గుడగుడలాడుతుంది. ఇప్పుడే వస్తానంటూ అయిదారు సార్లు బాత్రూంకి వెళ్లి వస్తాడు. ఇక చివరిలో నీరసంగా మెట్ల మీద పడిపోయి అమూల్య ఏదో టీలో కలిపి ఇచ్చిందని చెబుతాడు. దానికి పెద్దమ్మ కొత్తగా పెళ్లయింది కదా, భార్యతో ఉండేందుకు ఇలాంటి అబద్ధాలు చెబుతున్నాడు అని అంటుంది. దాంతో సేనాపతి శత్రువు కూతుర్ని పెళ్లి చేసుకున్నాను, పగ ప్రతీకారం అని చెప్పి ఇప్పుడు ఇలా మారిపోయావా అని అంటాడు. బయటకు వెళ్లాల్సిన భద్రావతి, సేనాపతి విశ్వ గురించి వెయిట్ చేసి చేసి విసిగి పనిమీద బయటికి వెళ్లిపోతారు. విశ్వ మెట్లమీద నీరసంతో కూర్చుండిపోతాడు. ఇదంతా చూసి అమూల్య నవ్వుతుంది. అమూల్యను చూసి నీకు నమస్కారం తల్లి నన్ను వదిలేయ్ అని అంటాడు.
ఇక్కడ నుంచి సీన్ నర్మద దగ్గరికి మారుతుంది. నర్మద ఆఫీసు నుంచి వస్తుంటే సాగర్ అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడు. నర్మద స్నేహితులు కూడా నర్మదతో పాటు వస్తారు. సాగర్ నీట్‌గా తయారై ఉండడం చూసి ఎక్కడికైనా బయటికి వెళ్తున్నారా అని అడుగుతారు. అప్పుడు నర్మదా గవర్నమెంట్ జాబ్ వచ్చిందని చెబుతుంది. నర్మద స్నేహితులంతా సాగర్ కు కంగ్రాచ్యులేషన్స్ చెబుతారు. భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు.. చాలా లక్కీ అని అంటారు. తర్వాత ‘ఇంతకీ ఎగ్జామ్ ఎప్పుడు రాశావు? ఎగ్జామ్స్ సెంటర్ ఎక్కడ?’ అని అడుగుతారు. సాగర్ తడబడుతూ ఉంటాడు. ఇదంతా నర్మద గమనిస్తుంది. ‘మా తమ్ముడు గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రతి పోస్టు మిస్ అవ్వకుండా రాస్తున్నాడు. గత నెల ఏ ఎగ్జామ్ అవ్వలేదు కదా. మీకు ఎలా వచ్చింది’ అని నర్మద స్నేహితురాలు అడుగుతుంది. దీంతో సాగర్ భయం భయంగా ఏదో చెప్పేసి నర్మదని తీసుకొని అక్కడి నుంచి బయలుదేరుతాడు. సాగర్ కంగారుపడడాన్ని నర్మద గమనిస్తుంది. ‘తనలో తాను ఎందుకు ఇలా కంగారు పడుతున్నాడు, తడబడుతున్నాడు.. అర్థం కావడం లేదు’ అని ఆలోచిస్తుంది.
గొడవ చేసిన వనజ
ఇక్కడి నుంచి సీన్ ఇడ్లీ బాబాయి, భాగ్యం దగ్గరికి మారుతుంది. వీళ్లు చట్నీ రుబ్బుతూ ఉంటారు. ఈలోపు శ్రీవల్లి అరుచుకుంటూ వస్తుంది. ‘మీకు బుద్ధుందా అసలు? ఇందాక ఆ మనిషి సాగర్ దగ్గర డబ్బులు ఎందుకు తీసుకున్నాడో తెలుసుకోకుండా ఇక్కడ ఏం చేస్తున్నారు’ అంటుంది. దానికి భాగ్యం మీ నాన్నకి పచ్చడి తినాలన్నా కోరిక పుట్టిందట అందుకే రుబ్బుకుంటున్నామని చెబుతుంది. భాగ్యం ‘సాగర్ ఆ వ్యక్తికి డబ్బులు ఎందుకు ఇచ్చాడో తెలుసుకోవడానికి ఏదో ఒక దారి దొరుకుతుందిలే’ అని అంటుంది. అదే సమయానికి వనజ కారు వచ్చి ఇంటి ముందు ఆగుతుంది.
వనజ చాలా కోపంగా రామరాజు ఇంట్లోకి అడుగుపెడుతుంది. ఇంటి ముందుకు వచ్చి రామరాజుని గట్టిగా పిలుస్తుంది. వేదవతి, రామరాజు ఇంట్లో ఉన్న వారంతా బయటకు వచ్చి నిలుచుంటారు. ఇంట్లోకి రమ్మన్నా వనజ రాకుండా పరువు లేని వాళ్ళ ఇంట్లోకి నేను అడుగు పెట్టను అని చెబుతుంది. రామరాజుని నానా మాటలు అంటుంది. వేదవతి కూడా గట్టిగానే సమాధానం చెబుతుంది. ఈలోపు రామరాజు వచ్చి చెల్లమ్మా మీరు అసలు ఏ పని మీద వచ్చారు అని అడుగుతాడు. అప్పుడు వనజ మాట్లాడుతూ ‘మీ అమ్మాయికి బంగారం కొనమని ఆరోజు 20 లక్షలు ఇచ్చాను. మర్చిపోయారా ఏంటి? మరి ఇచ్చిన డబ్బుల్ని తిరిగి పంపాలన్న జ్ఞానం లేదా? ఎవడబ్బ సొమ్మని మీ దగ్గర అట్టిపెట్టుకున్నారు’ అని అంటుంది. దానికి రామరాజు మీకు 20 లక్షలు ఇవ్వమని మా సాగర్ కి చెప్పాను, వాడు ఇవ్వలేదా అని అడుగుతాడు. అప్పుడు వనజ ‘ఇస్తే ఇలా వచ్చి ఎందుకు అడుగుతాను? నాకు ఏమైనా బుద్ధి లేదా ఏంటి? ఇన్నాళ్లు మీరు హాస్పిటల్ లో ఉన్నారని సంస్కారంతో ఆగిపోయాను. కానీ ఇప్పుడు మీరు ఇంటికి వచ్చిన తర్వాత కూడా డబ్బులు పంపించకపోయేసరికి ఆ 20 లక్షలు అప్పనంగా కొట్టేసే ప్లాన్ లో ఉన్నారని అర్థమై మీ సంగతి తేలుద్దామని వచ్చాను’ అని అంటుంది. అదే సమయానికి నర్మద, సాగర్ కూడా అక్కడికి వస్తారు.
సాగర్ ను తిట్టిన రామరాజు
రామరాజు సాగర్ తో మాట్లాడుతూ ‘బ్యాంకు నుంచి డబ్బు డ్రా చేసి చెల్లెమ్మ వాళ్లకి ఇవ్వమన్నాను కదా.. ఇవ్వలేదా’ అని అడుగుతాడు. దానికి సాగర్ తడబడుతూ కొత్త ఉద్యోగంలో పడి మర్చిపోయాను అని చెబుతాడు. దాంతో రామరాజు సాగర్ ను బాగా తిడతాడు. నేను చెప్పినప్పుడే డబ్బు తీసుకెళ్లి ఇచ్చుంటే, ఇలా ఇంటికి వచ్చి అడిగే వారు కాదు కదా అంటాడు రామరాజు. ఇంకా అలాగే నిలబడ్డావ్ ఏంట్రా? బ్యాంకుకెళ్ళి డబ్బులు తీసుకొచ్చి వాళ్లకి ఇవ్వు అని అంటాడు రామరాజు. నర్మద కూడా పద బ్యాంకుకు వెళ్దామని అంటుంది. కానీ సాగర్ కదలకుండా అలాగే ఉంటాడు.
మధ్యలో వల్లి కల్పించుకొని నర్మదతో ‘ఇదిగో చెల్లాయి సాగర్ బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకురాలేడు కదా, అది అసాధ్యం కదా.. ఎందుకంటే సాయంత్రం అయిపోయింది. బ్యాంకు క్లోజ్ చేసేస్తారు కదా’ అని అంటుంది. రామరాజు.. సాగర్ తో నువ్వు చేసిన బుద్ది తక్కువ పని వల్ల, పనికిమాలిన పని వల్ల నేను మరొకసారి పరువు పోగొట్టుకుని తలవంచుకొని నిలబడాల్సి వస్తోంది కదరా అని తిడతాడు. తర్వాత రామరాజు పెద్దోడికి ఫోన్ చేసి రైస్ మిల్లు ఎంత డబ్బు ఉందో చూసి తీసుకురమ్మని చెబుతాడు. ఈలోపు వనజ ‘ఆగండి.. నేను ఎంత మర్యాదగా మీకు డబ్బులు ఇచ్చానో.. మీరు అంతే మర్యాదగా మా ఇంటికి తీసుకువచ్చి డబ్బులు ఇవ్వండి’ అని చెబుతుంది. రామరాజు రేపే పంపిస్తానని చెబుతాడు. అక్కడినుంచి వనజ వెళ్ళిపోతుంది.
వేదవతి కన్నీరు
సాగర్‌ను గట్టిగా కసిరి తిడతాడు రామరాజు. సాగర్ కంగారు పడటం నర్మద గమనిస్తూనే ఉంటుంది. వేదవతి ఒంటరిగా కూర్చుని బాధపడుతూ ఉంటుంది. అదే సమయానికి ప్రేమ, ధీరజ్ ఇంట్లోకి వస్తారు. వేదవతి దగ్గరికి వెళ్లి ఎందుకు అలా ఉన్నావ్? అని అడుగుతారు. అదే సమయానికి చందు కూడా ఇంటికి వస్తాడు. పెద్దోడు కూడా వచ్చి తల్లి పక్కన కూర్చుంటాడు. వేదవతి కన్నీళ్లు పెట్టుకుంటూ సాగర్ ని పిలుస్తుంది. ముగ్గురు కొడుకులతో మాట్లాడుతూ ‘నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. కుటుంబం అంటే మనుషులు కలిసి ఉండటం కాదు.. ప్రాణం పోయినా సరే వాళ్ళ జ్ఞాపకాలు చెరిగిపోకుండా ఉండడం. అలా చెరిగిపోకుండా ఉండాలంటే ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే కలిసే ఉండాలి తప్ప బంధాలు అనుబంధాలు తెగిపోకూడదు’ అని అంటుంది.
దానికి ధీరజ్ ఇప్పుడు ఎందుకు అలా చెబుతున్నావని అడుగుతాడు. దానికి వేదవతి ‘భయం వేస్తుందిరా.. ఈ మధ్య మన ఇంట్లో జరుగుతున్నది చూస్తుంటే చాలా భయమేస్తోంది. అమూల్య ఎలా చేయడం మీ నాన్న తట్టుకోలేకపోతున్నారు. ఇందాక ఆ వనజ ఇంటికి వచ్చి డబ్బులు కోసం చేసిన అవమానానికి ఇంకా బాధపడుతున్నారు’ అని అంటుంది. వెంటనే పెద్దోడు, సాగర్‌ని ఆ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయమని నాన్నగారు చెప్పారు కదా.. నువ్వు ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతాడు. అందరూ సాగర్ ను రేపు బ్యాంకు నుంచి డబ్బులు తీసుకువచ్చి ఇచ్చేయమని చెబుతారు. సాగర్ కంగారు పడుతూ ఉంటాడు. ఇక్కడితో ఎపిసోడ్ ముగిసిపోతుంది.

