MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Illu Illalu Pillalu Today Episode Feb 12: రైస్ మిల్లు ఓనర్‌గా వల్లి, నర్మద సాగర్‌ను ఛీ కొట్టిన రామరాజు దంపతులు

Illu Illalu Pillalu Today Episode Feb 12: రైస్ మిల్లు ఓనర్‌గా వల్లి, నర్మద సాగర్‌ను ఛీ కొట్టిన రామరాజు దంపతులు

Illu Illalu Pillalu Today Episode Feb 12: ఇల్లు ఇల్లాలు పిల్లలు నేటి ఎపిసోడ్లో రామరాజు ఇంట్లో అనుకోని సంఘటనలు బయటపడతాయి. రైస్ మిల్లును తెలివిగా దక్కించుకుంటుంది వల్లి బ్యాచ్. ఇక సాగర్ గవర్నమెంట్ ఉద్యోగం గురించి రామరాజుకు తెలిసిపోతుంది. 

3 Min read
Author : Haritha Chappa
Published : Feb 12 2026, 10:33 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
వల్లికి స్ట్రాంగ్ వార్నింగ్
Image Credit : Jio hotstar

వల్లికి స్ట్రాంగ్ వార్నింగ్

ఇల్లు ఇల్లాలు పిల్లలు నేటి ఎపిసోడ్ లో శ్రీవల్లి గుడి చుట్టూ పొర్లుదండాలు పెట్టడం వల్ల బాగా ఆకలేస్తుందని ఏదైనా తినాలని అనుకుంటుంది. వంటగదిలోకి వెళ్లి దోశెలు వేసుకునేందుకు వెళుతుంది. శ్రీవల్లి దోశలు వేసుకుంటూ ఉంటే ఇడ్లీ బాబాయి, భాగ్యం కూడ వస్తారు. నర్మద, ప్రేమ అక్కడికి వస్తారు. ఏం చేస్తున్నారని అడిగితే శ్రీవల్లి దోసెలు వేసుకొని తింటున్నామని చెబుతుంది. అప్పుడు ప్రేమ ‘మీరు ఎంత తిన్నా ఏది తిన్నా నర్మదక్క మీ నిజాన్ని బయటపెట్టే వరకే. ఆ తర్వాత మూట ముళ్ళే సర్దుకుని వెళ్లాల్సిందే’ అని అంటుంది. అప్పుడు ‘మేము ఎందుకు బయటకు వెళ్తాము.. విశ్వక్ అమూల్యకు తాళి కట్టలేదంట కదా’ అని ఒక్కసారిగా షాక్ ఇస్తారు శ్రీవల్లి బ్యాచ్. దీంతో నర్మద, ప్రేమ ఆశ్చర్యపోతారు. 

ప్రేమ గాభరా పడుతూ ‘ఏంటి మాట్లాడుతున్నావ్? అమూల్య మెడలో విశ్వ తాళి కట్టకపోతే మరి ఎవరు కట్టారు? అమూల్యనే వేసుకుందా? నీకు ఎవరు చెప్పారు’ అని పదేపదే అడుగుతుంది. ఆ తర్వాత ‘అసలు అమూల్య పెళ్లి ఎలా జరిగింది అన్నది అసలు మేటర్ కాదు. అమూల్యకు విశ్వక్ ను ప్రేమించమని చెప్పింది నువ్వే అయినప్పుడు.. నువ్వు ఎలా తప్పించుకుంటావు’ అని శ్రీవల్లికి నర్మద స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది. దీంతో వల్లి భయపడుతుంది. అక్కడి నుంచి తోటి కోడళ్ళు పక్కకి వెళ్లి పోతారు. విశ్వక్ అమూల్య పెళ్లి సంగతి వల్లికి తెలియడంతో ప్రేమ టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు నర్మద ధైర్యం చెప్పి అంతవరకు వస్తే చూసుకుందాంలే అని అంటుంది.

24
రైస్ మిల్లు చూడనని చెప్పేసిన సాగర్
Image Credit : Jio hotstar

రైస్ మిల్లు చూడనని చెప్పేసిన సాగర్

రామరాజు వేదవతి ఒక నిర్ణయం తీసుకొని తమ పిల్లలందరినీ పిలుస్తారు. రామరాజు మాట్లాడుతూ సాగర్ తో ‘నేను చాలా కుంగిపోయాను. అమూల్య బాధ నుంచి బయటపడలేకపోతున్నాను. అందుకే ఇక రైస్ మిల్లు నేను చూసుకోలేను. ఇకపైన రైస్ మిల్లు నువ్వే చూసుకోవాలి’ అని తాళాలు అందిస్తాడు. కానీ సాగర్ తాళాలు తీసుకోకుండా ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు అందరూ తీసుకోమని చెబితే కూడా సాగర్ తీసుకోడు. తండ్రితో అసలు విషయం చెప్పేందుకు సిద్ధమవుతాడు. ‘సారీ నాన్న నేను రైస్ మిల్ లో చూసుకోలేను. నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది’ అని చెబుతాడు.

రామరాజు మాట్లాడుతూ ‘ఎప్పుడు పరీక్ష రాశావు. పరీక్ష రాసినప్పుడు కనీసం చెప్పాలి కదా. నీకు గవర్నమెంట్ జాబ్ వద్దని ఎప్పుడో చెప్పాను కదా’ అని అంటాడు. దానికి సాగర్ మాత్రం నాకు గవర్నమెంట్ జాబ్ కావాలి నాన్న అని చెబుతాడు. అప్పుడు రామరాజు మీ మామయ్య గుడిలో అర్చనలు చేయించి అందరికీ స్వీట్లు పంచుతూ ఉంటే నాకు ఏమీ అర్థం కాలేదు.. ఇప్పుడు అసలు విషయం అర్థం అవుతుంది, నీ భార్య నీ మామ కలిసి చాలా తెలివిగా ప్రవర్తించారు అని అంటాడు. దాంతో నర్మద మధ్యలో కల్పించుకొని నాకు కూడా ఈ విషయం నిన్నే తెలిసింది మావయ్య అని చెప్పబోతుంది. అప్పుడు వేదవతి కోపంగా ఆపమ్మా నువ్వే వాడితో పరీక్ష రాయించి తెలియదంటే నమ్మడానికి ఏమైనా పిచ్చోళ్ళమా’ అని అంటుంది.

Related Articles

Related image1
Illu Illalu Pillalu Today Episode Feb 10: విశ్వక్‌ పై పగ తీర్చుకుంటున్న అమూల్య, వల్లి పొర్లు దండాలు
Related image2
Illu Illalu Pillalu Today Episode Feb 11: అమూల్యను పెళ్లిచేసుకోలేదని వల్లికి చెప్పేసిన విశ్వక్, నర్మద ప్రేమలకు షాకిచ్చిన భాగ్యం
34
సాగర్ ను కొట్టిన వేదవతి
Image Credit : Jio hotstar

సాగర్ ను కొట్టిన వేదవతి

అప్పుడు సాగర్ నిజంగానే నర్మదకు ఏమీ తెలియదు అని అంటాడు. దాంతో వేదవతి సాగర్ ను లాగిపెట్టి ఒకటి కొడుతుంది. సొంత మిల్లును దర్జాగా చూసుకోమంటే మీకు మూటలు మోయడంలా అనిపిస్తుందా? మనం తినే ప్రతి మెతుకు ఆ రైస్ మిల్ వల్లే వచ్చింది. మీ నాన్న కూడా నీలాగే మూటలు మోయడం అనుకుంటే ఈరోజు మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉండే వాళ్ళమో తెలుసా? అని బుద్ధి చెబుతుంది. రామరాజు కల్పించుకొని ‘వదిలేయ్ బుజ్జమ్మ.. వాడికి ఇల్లరికం వెళ్లాలని ఉందనుకుంటా’ అని అంటాడు. ఆ తర్వాత తిరుపతి తో రైస్ మిల్లు అమ్మేస్తాను ఎవరైనా కొంటారేమో చూడు అని చెబుతాడు. కానీ అందరూ అమ్మవద్దని రామరాజుకు చెబుతారు. రామరాజు మాట్లాడుతూ ‘వీడికి రైస్ మిల్లును చూసుకోవడం నామోషీలా అనిపిస్తోంది. నేను పోయిన తర్వాత ఎలాగో అమ్మేస్తారు కదా’ అని అంటాడు. అప్పుడు ప్రేమ ధీరజ్ తో మాట్లాడుతూ నువ్వు తీసుకుంటానని చెప్పు అని అంటుంది.

44
వల్లి చేతికి రైస్ మిల్లు తాళాలు
Image Credit : Jio hotstar

వల్లి చేతికి రైస్ మిల్లు తాళాలు

ఇంతలో చందు ముందుకు వచ్చి నేను రైస్ మిల్లు చూసుకుంటాను నాన్నా, ఉద్యోగం మానేస్తా అని చెబుతాడు. అప్పుడు రామరాజు ‘వద్దులేరా నీ భార్య కూడా నువ్వు మూటలు మోస్తావని అనుకుంటుంది’ అంటాడు. ఇంతలో వల్లి వచ్చి ‘అయ్యో అలా ఎందుకు అనుకుంటా మావయ్యా.. కావాలంటే నేను కూడా అక్కడ మూటలు మోస్తాను. మా ఆయనకు బాధ్యతలు ఇచ్చేయండి’ అంటుంది. రామరాజు వేదవతితో ‘చూసావా బుజ్జమ్మ బాగా బాధ్యత తెలిసిన కోడళ్లు అని పొగుడుతావు కదా.. వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకున్నారు’ అంటాడు. ‘ఎవరు ఏంటో నాకు ఇప్పుడు అర్థమైంది’ అని వేదవతి నర్మదను చూస్తూ అంటుంది.

వల్లి వేదవతి దగ్గరికి వెళ్లి కొంగుచాచి ‘అత్తయ్య గారు ఇకపైన నేను, నా భర్త రైస్ మిల్లు చూసుకుంటాం. తాళాలు ఇవ్వండి’ అని అడుగుతుంది. వేదవతి వల్లికే తాళాలు అందిస్తుంది. రైస్ మిల్లు తాళాలు అందుకున్న వల్లి, ఆమె తల్లిదండ్రులు చాలా ఆనందపడతారు. అందరూ వెళ్లిపోయాక వల్లి తన తల్లి భాగ్యానికి తాళాలు అందిస్తుంది. భాగ్యం ‘మనం ఏమి చేయకుండానే లక్షల లక్షలు వచ్చే రైస్ మిల్లు తాళాలు వచ్చేసాయి. ఈ దెబ్బతో మన తలరాతలు మారిపోతాయి. రామరాజు కుంగిపోయాడు.. కాబట్టి ఎప్పటికీ రైస్ మిల్ కు రాడు. నీ మొగుడు అయితే ఒక అమాయకుడు. కాబట్టి మీ నాన్నని క్యాషియర్ గా పెట్టి డబ్బు కొట్టేద్దాం. అలాగే రైస్ మిల్లు కూడా పూర్తిగా కొట్టేద్దాం’ అని భాగ్యం ఐడియా ఇస్తుంది. దీంతో ముగ్గురు సంతోషంగా డాన్సులు వేస్తూ ఆనందపడతారు. దీంతో ఎపిసోడ్ ముగిసిపోతుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వినోదం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Gunde Ninda Gudi Gantalu: ఫంక్షన్ లో మటన్ ముక్కల కోసం గొడవ, పోయిన బాలు పరువు..రోహిణీ మాజీ భర్త ఎంట్రీ
Recommended image2
Sequel Movies: బాక్సాఫీస్‌ను షేక్ చేసిన 7 ఇండియన్ సీక్వెల్స్.. 'ధురంధర్ 2' రికార్డులు బద్దలు కొడుతుందా?
Recommended image3
Karthika Deepam 2 Today Episode: పారుతో ఆడుకున్న కార్తీక్- స్వప్నను లాక్ చేసిన శ్రీధర్- జ్యో నటన
Related Stories
Recommended image1
Illu Illalu Pillalu Today Episode Feb 10: విశ్వక్‌ పై పగ తీర్చుకుంటున్న అమూల్య, వల్లి పొర్లు దండాలు
Recommended image2
Illu Illalu Pillalu Today Episode Feb 11: అమూల్యను పెళ్లిచేసుకోలేదని వల్లికి చెప్పేసిన విశ్వక్, నర్మద ప్రేమలకు షాకిచ్చిన భాగ్యం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved