- Home
- Entertainment
- Illu Illalu Pillalu Today Episode Dec 1: దొంగ వల్లిని నగలతో రెడ్ హ్యాండెడ్‌గా పట్టేసిన ప్రేమ, నర్మద
Illu Illalu Pillalu Today Episode Dec 1: దొంగ వల్లిని నగలతో రెడ్ హ్యాండెడ్‌గా పట్టేసిన ప్రేమ, నర్మద
Illu Illalu Pillalu Today Episode Dec 1: ఇల్లు ఇల్లాలు టుడే ఎపిసోడ్ లో శ్రీవల్లికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు నర్మద, ప్రేమ. దాచిపెట్టిన నగలను ఆమె చేతితోనే బయటికి తీయించారు. అసలు ఈ ఎపిసోడ్లో ఏం ఏం జరిగిందో తెలుసుకోండి.

స్వామిజీ దొంగనాటకం
శ్రీవల్లి నగలను మొక్కల దగ్గర నేలలో పాతివేస్తుంది. అవి ఎవరికి దొరకవని ధీమాగా ఉంటుంది. కానీ ప్రేమ, నర్మద కలిసి శ్రీవల్లి గుట్టును రట్టు చేసేందుకు ఒక ప్లాన్ వేస్తారు. స్వామీజీని తీసుకొచ్చి నగలను ఎవరు తీసారో చెప్పిస్తున్నామని అంటారు. స్వామీజీ వచ్చి నట్టింట్లో కూర్చుని ఒక ముగ్గు వేస్తారు. ఆ స్వామిజి నగలు ఎవరు దాచి పెట్టారో వారికి కూడా కనబడకుండా చేస్తానని అంటాడు. స్వామీజీ ‘మీ అందరి దగ్గర ఉన్న బంగారం తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. ఒక చిన్న వస్తువును కూడా మిస్ అవ్వకుండా అన్నింటినీ తెచ్చి పెట్టండి. ఏ ఒక్కటి మర్చిపోయినా అవి ఆకులుగా మారిపోతాయి’ అని భయపెడతాడు.
నాలుగు ఫన్నీ మంత్రాలు చదివేసి నగలు కొట్టేసింది ఎవరో చెప్పమని తనలో తానే పూజలు చేస్తాడు. ఒకపక్క శ్రీవల్లి మాత్రం తెగ కంగారు పడిపోతూ ఉండడం ప్రేమ, నర్మద గమనిస్తారు. స్వామిజీ మాట్లాడుతూ కాసేపట్లో నగలు కొట్టేసిన వాళ్ళు వారంతట వారే బయటపడతారు, కొట్టేసిన నగల్ని వాళ్ళంతట వాళ్ళే తీసుకొచ్చి ఇస్తారు అని చెబుతాడు. ఆ నగల్ని మరొక గంటలో ఆ దొంగ నగలను తీసుకొచ్చి ఇవ్వకపోతే ఆ నగలు ఆకులుగా మారిపోతాయి అని చెప్పి వెళ్లిపోతాడు.
అమ్మకి వల్లి ఫోన్
ఇక్కడ నుంచి సీన్.. ఇడ్లీ బాబాయ్ దగ్గరికి మారుతుంది. పది లక్షలు పోగొట్టినందుకు ఇడ్లీ బాబాయిని భాగ్యం చీపురు కట్టతో పొట్టు పొట్టు కొడుతుంది. ఈ లోపు శ్రీవల్లి తల్లికి ఫోన్ చేస్తుంది. శ్రీవల్లి మాట్లాడుతూ ‘అమ్మ కొంపలంటుకున్నాయి. ఆ నర్మద, ప్రేమ ఒక స్వామీజీని తీసుకొచ్చారు’ అంటూ జరిగిందంతా చెప్పేస్తుంది. ‘గంటలో నా అంతట నేనే బయట పడిపోతాను అంటా’ అని వివరిస్తుంది. భాగ్యం కూడా ఇదేంటి కొత్త చిక్కు వచ్చింది. అసలే 10 లక్షల పోయిన బాధలో ఉన్నామని అంటుంది.
నగల దొంగని నేనేనని ఎక్కడ బయటపడిపోతుందేమో అని చాలా భయంగా ఉంది అని చెబుతుంది వల్లీ. ఈ లోపు భాగ్యం ‘నువ్వు భయపడకు నువ్వు పాతిపెట్టిన నగల్ని నేను వచ్చి తీసుకెళ్ళిపోతాను’ అని చెబుతుంది. శ్రీవల్లి నువ్వు త్వరగా వచ్చేయ్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది.
రామరాజు ఇంటికి భాగ్యం
భాగ్యం, ఇడ్లీ బాబాయ్ కలిసి రామరాజు ఇంటికి పరిగెత్తుకుంటూ వస్తారు. వారు రాగానే ప్రేమ, నర్మద వచ్చి గేటు తీయకుండా అడ్డుగా నిల్చుంటారు. నర్మద మాట్లాడుతూ ‘కొట్టేసిన నగలను పట్టుకోవడం కోసం మా ఇంటి చుట్టూ బంధనం వేశారు. బయట వాళ్ళు ఎవరైనా ఇంట్లోకి వస్తే యమధర్మరాజుకు బందీ అయిపోతారు. అందుకే ఇంట్లోకి రావద్దు’ అని చెబుతుంది నర్మద. కానీ భాగ్యం ‘ఆ బంధనాలన్నీ బయట వాళ్లకి, మేము ఇంట్లో వాళ్ళమేగా రావచ్చు’ అని చెబుతుంది. కానీ దానికి నర్మద, ప్రేమ ఒప్పుకోరు. స్వామీజీ బయటి నుంచి ఒక్క పురుగు కూడా రాకూడదని గట్టిగా చెప్పారని నర్మద, ప్రేమ అడ్డుకుంటారు. మరోపక్క శ్రీవల్లి ఇవన్నీ చూసి భయంతో వణికి పోతూ ఉంటుంది. ఇప్పుడు తన అమ్మానాన్నని ఎలాగైనా లోపలికి తీసుకొచ్చేందుకు ప్లాన్ వేస్తే మళ్లీ తనపై డౌట్ వస్తుందేమోనని ఆగిపోతుంది.
గేటుకు అడ్డంగా ప్రేమ, నర్మద
ప్రేమ మాట్లాడుతూ ‘అసలు మీరు ఏం పని మీద వచ్చారు, కొంప మునిగిపోయేంత పని ఏముందని’ అని అడుగుతుంది. ప్రేమ, నర్మదా వారిద్దరినీ ఇంట్లోకి రానివ్వరు. ఇద్దరినీ ఇంటి దగ్గర నుంచి వెళ్లిపోమని చెబుతారు. దీంతో భాగ్యం, ఇడ్లీ బాబాయి చేసేదేం లేక వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు. వేదవతి కుర్చీలో కూర్చుని చాలా సీరియస్ గా ఆలోచిస్తూ ఉంటుంది. ఆమె దగ్గరికి వల్లి వచ్చి ఏమైందని అడుగుతుంది. నగల గురించి చాలా భయమేస్తుందని చెబుతుంది వేదవతి. ఈ లోపు నర్మద ఇంట్లోకి వెళితే.. ప్రేమ వేదవతి దగ్గరికి వస్తుంది.
ఈలోపు నర్మద వచ్చి ఒక ఆకుని తీసుకొచ్చి చూపిస్తుంది. ఈ ఉంగరం స్వామీజీ అడిగినప్పుడు బంధనంలో పెట్టలేదని, దీంతో అది ఆకుగా మారిపోయిందని చెబుతుంది. ఇది చూసి వల్లికి భయం పట్టుకుంటుంది. తన నగలు కూడా ఆకులుగా మారిపోతాయేమో అని కంగారుపడుతుంది. వల్లిని భయపెట్టేందుకే నర్మద ఈ ప్లాన్ వేస్తుంది.
నగలతో వల్లి అడ్డంగా దొరికిపోయింది
దీంతో వల్లి నిజమేనని నమ్మి తను దాచిన నగలన్నీ ఆకులైపోతాయేమోనని బెంగపెట్టుకుంటుంది. వెంటనే ఇంట్లోకి వెళ్లి తల్లికి ఫోన్ చేస్తుంది. ఉంగరం ఆకుగా మారిపోయిందని, నర్మద ఆ ఉంగరం దాయడం వల్లే అది ఆకుగా మారిపోయిందని, ఇప్పుడు మనం దాచిపెట్టిన నగలు కూడా ఆకులుగా మారిపోతాయేమోనని చెబుతుంది. భాగ్యం ఒకసారి ఆ నగలను ఎక్కడ దాచి పెట్టావో... తవ్వి తీసి నగలు బానే ఉన్నాయా లేక ఆకులుగా మారాయో చెక్ చేయమని చెబుతుంది. ఆ నగలు భద్రంగా ఉన్నాయో లేదో చూసి మళ్లీ అదే ప్లేస్ లో పెట్టేయమని చెబుతుంది భాగ్యం. దానికి వల్లి సరేనని చెప్పి చెక్ చేయడానికి వెళుతుంది. నగలను తవ్వి తీసి చూస్తుంది. నగలు ఆకులుగా మారకుండా బానే ఉంటాయి దీంతో ఆనందపడుతుంది. సరిగ్గా అదే సమయానికి అక్కడికి ప్రేమ, నర్మద వచ్చి నిలుచుంటారు. వారిద్దరిని చూసి వల్లి షాక్ అవుతుంది.

