- Home
- Entertainment
- Illu Illalu Pillalu Today Episode Nov 28: వల్లీ గుట్టు రట్టు, నగల దొంగ వల్లీనేనని తేల్చేసిన ప్రేమ
Illu Illalu Pillalu Today Episode Nov 28: వల్లీ గుట్టు రట్టు, నగల దొంగ వల్లీనేనని తేల్చేసిన ప్రేమ
Illu Illalu Pillalu Today Episode Nov 28: ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ లో నగల గురించి అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. కానీ ప్రేమ మాత్రం వల్లీనే అసలు దొంగ అని తేల్చేస్తుంది. ఇక ఈ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకోండి.

వార్నింగ్ ఇచ్చిన రామరాజు
ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ లో అసలు నగలు స్థానంలో గిల్టు నగలు ఎలా వచ్చాయోనని రామరాజు ఇంట్లో పంచాయతీ మొదలవుతుంది. మధ్యలో వల్లీ దూరిపోయి ఆ నేరాన్ని ప్రేమ పై వేసేందుకు ప్రయత్నిస్తుంది. ప్రేమ కూడా గట్టిగానే అడ్డుకుంటుంది. ఈలోపు రామరాజు కల్పించుకొని ధీరజ్, ప్రేమలతో ‘ఏరా నిజం చెప్పండి.. మీరు ఆ నగలను తీశారా? నేను మిమ్మల్ని నిందించడం లేదు, తప్పు పట్టడం లేదు. కానీ ఆ నగలు మీ దగ్గరే ఉన్నాయి కాబట్టి ఆ నగల బాధ్యత మీ ఇద్దరిదే. మీరు చెప్పే సంజాయిషీలు, సమాధానాలు నేను వినను. రాత్రి వరకు మీకు టైమిస్తున్నాను. మీరు ఏం చేస్తారో నాకు అనవసరం. రాత్రి లోపు నగలను తీసుకొచ్చి ఇవ్వాలి. లేకపోతే నా కోపం ఇంకోలా ఉంటుంది’ అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. దీంతో ప్రేమ, ధీరజ్ చాలా బాధపడతారు. మధ్యలో వల్లీ కూడా కంగారు పడుతూ ఉంటుంది.
నీ మెడలో తాళికట్టడమే తప్పు
ఆ తర్వాత ప్రేమ, ధీరజ్ రూమ్ లోకి వచ్చి వాదించుకుంటారు. ధీరజ్ నగల గురించి ప్రేమను నిలదీస్తాడు. ప్రేమ తనకు తెలియదని చెబుతుంది. అసలు నగల స్థానంలో రోల్డ్ గోల్డ్ నగలు ఎలా మారాయి అని ప్రేమను ప్రశ్నిస్తాడు. ‘ఆ నగలే తనకు కావాలనుకుంటే అవి ధైర్యంగా మా వాళ్లతో చెప్పి తీసుకోగలనను. నా నగలను చాటుగా దాచుకోవాల్సిన కర్మ తనకు లేదని వివరిస్తుంది’ అని ప్రేమ అంటుంది. వెంటనే ధీరజ్ ‘ఇప్పుడు నాకు అంతా అర్థమైంది. మాతో గొడవ పెట్టుకోవడం కోసం మీ వాళ్లే ఆ నగలను దాచేసి నిందలు వేస్తున్నారని’ అంటాడు. ఇదంతా మీ వాళ్లకు కుట్ర అని అంటాడు. దానికి ప్రేమా ఒప్పుకోదు.
వెంటనే ‘నర్మద వదిన జాబ్ పోగొట్టడం కోసం మీ వాళ్లంతా ఏం చేశారు.. అది చీప్ గా బిహేవ్ చేయడం కాదా? దిగజారి ప్రవర్తించడం కాదా’ అని ప్రశ్నిస్తాడు. ‘నీ మెడలో తాళి ఎందుకు కట్టడం వల్లే నాకు ఈ సమస్యలు’ అని అంటాడు. దాంతో ప్రేమకు విపరీతంగా కోపం వచ్చేస్తుంది. ధీరజ్ కాలు మీద ఓ ఫ్లవర్ వేజ్ ఎత్తేసి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ప్రేమ.
ఇడ్లీ బాబాయ్ కొత్త ప్లాన్
ఇక్కడ నుంచి సీన్ ఇడ్లీ బాబాయ్, భాగ్యం దగ్గరికి మారుతుంది. ఇద్దరూ రామరాజు ఇచ్చిన డబ్బులను పట్టుకొని డాన్సులు వేస్తూ ఉంటారు. రామరాజును మోసం చేసి పది లక్షలు కొట్టేసాం అని ఆనంద పడుతూ ఉంటారు. భాగ్యం కొన్ని అప్పులు తీర్చేద్దామని ఇడ్లీ బాబాయ్ తో చెబుతుంది. దానికి ఇడ్లీ బాబాయి ఒప్పుకోవడం ఈ డబ్బును తన కస్టమర్ ఒకడికి ఇస్తానని అతడు లక్షిస్తే సాయంత్రం కల్లా రెండు లక్షలు చేసి ఇస్తాడని చెబుతాడు. ఈ పది లక్షలు అతనికి ఇస్తే సాయంత్రం కల్లా 20 లక్షలు చేతికి వస్తాయని ఐడియా ఇస్తాడు. ఆ డబ్బులు పట్టుకొని ఇడ్లీ బాబాయ్ వెళ్ళిపోతాడు. ఆ డబ్బులు తీసుకొని మాయా కుమార్ అనే ఒక మోసగాడి దగ్గరికి వెళ్తాడు. ఇడ్లీ బాబాయ్ లక్ష ఇస్తే సాయంత్రానికల్లా రెండు లక్షలు ఇస్తానని చెబుతాడు. ఇడ్లీ బాబాయ్ నమ్మేసి 10 లక్షలు అతని చేతిలో పెట్టేస్తాడు. సాయంత్రానికి వచ్చి 20 లక్షలు తీసుకోమని చెబుతాడు.
వేదవతి భయం
అక్కడినుంచి సీన్ వేదవతి దగ్గరికి మారుతుంది. వేదవతి భయంతో ఇటూ అటూ తిరుగుతుంది. ఇంట్లో నగలు పోవడం ఏంటి? ఆ రోజు బ్యాంకు నుంచి నగలు తెచ్చిన వెంటనే ప్రేమ నగలను వారికి పంపించేసాం కదా, అవి రోల్డ్ గోల్డ్ నగలుగా ఎలా మారాయి అని నర్మదతో చెబుతుంది. నర్మద కూడా కూడా ఆలోచిస్తుం.ది ఈలోపు వేదవతి ప్రేమ, ధీరజ్ ల విషయం బయటపడుతుందేమోనని భయంగా ఉందని, వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకోలేదని తప్పని పరిస్థితుల్లో మనమే బలవంతంగా చేసామని తెలిస్తే ఇంకా గొడవ అవుతుందని అంటుంది. ఈ విషయం మీ మామయ్య గారికి తెలిస్తే ఇంకా పెద్ద పెద్ద గొడవలు అయిపోతాయి అని భయపడుతూ ఉంటుంది వేదవతి.
ఇక్కడ నుంచి సీన్ ఇడ్లీ బాబాయ్ దగ్గరికి మారుతుంది. ఇడ్లీ బాబాయ్ సాయంత్రం మాయ కుమార్ ఆఫీస్ కి వెళ్లి కూర్చుంటాడు. ఈ లోపు ఒక వ్యక్తి వచ్చి మాయాకుమార్ పరారయ్యాడని, లక్షకు రెండు లక్షల ఇస్తానని చెప్పి ఎంతో మంది దగ్గర డబ్బులు తీసుకుని పారిపోయాడని చెబుతాడు. దీంతో ఇడ్లీ బాబాయ్ భయంతో కింద పడిపోతాడు.
వల్లీనే నగల దొంగ
ఇక నర్మదా, ప్రేమ మాట్లాడుకుంటూ ఉంటారు. నగలు ఏమయ్యాయి? అని ఆలోచిస్తూ ఉంటారు. నువ్వు నగలు పంపించే సమయంలో అత్తయ్య, వల్లీ అందరూ అక్కడే ఉన్నారు కదా అని అంటుంది. నర్మదా ‘నువ్విచ్చిన నగలను ఒక్క నిమిషం కూడా లేట్ చేయకుండా మీ ఇంట్లో తిరుపతి ఇచ్చేసి వచ్చాడు. మరి ఒరిజినల్ నగల స్థానంలో గిల్టు నగలు ఎలా వచ్చాయి’ అని అంటుంది. ఆ సమయంలో ప్రేమ ఏదో ఆలోచిస్తూ ఒక విషయాన్ని గుర్తు చేసుకుంటుంది. వల్లీ, తిరుపతి గతంలో మాట్లాడుకున్న సంఘటన ప్రేమకు గుర్తొస్తుంది. వల్లీ.. తిరుపతిని నగలు గురించి ఆరా తీయడం గురించి అడగడం ప్రేమకు గుర్తొస్తుంది. దాంతో ప్రేమకు అనుమానం పెరుగుతుంది.
నర్మదతో నగలను మార్చింది వల్లి అని చెప్పేస్తుంది. ఆరోజు తిరుపతి బాబాయ్ నగలను ఇచ్చేసి వచ్చాక గేటు దగ్గర వల్లీ టెన్షన్ గా తిరుగుతూ ఉందని, నగలను ఓపెన్ చేసి చూసుకున్నారా? ఏమన్నారు? అని పదేపదే అడిగిందని ప్రేమ వివరిస్తుంది. కాబట్టి వల్లినే నగలను మార్చేసిందని ప్రేమ కన్ఫామ్ గా చెప్పేసింది. దీంతో ఇక్కడ ఎపిసోడ్ ముగిసిపోయింది.

