MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 6 హిట్లు, 10 ఫ్లాపులతో స్టార్ హీరోయిన్ అయిన నటి, ఆ తప్పు చేసి అడ్రెస్ లేకుండా పోయింది

6 హిట్లు, 10 ఫ్లాపులతో స్టార్ హీరోయిన్ అయిన నటి, ఆ తప్పు చేసి అడ్రెస్ లేకుండా పోయింది

ఇండస్ట్రీలో స్టార్ గా ఎదగాలంటే చాలా కష్టం. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో దర్శక నిర్మాతలు చాలా సెంటిమెంట్లు పెట్టుకుంటారు. ఒక్కసారి ఫ్లాప్ పడితే హీరోయిన్ కెరీర్ లో నిలదొక్కుకోవడం చాలా కష్టం.

2 Min read
Author : Tirumala Dornala
Published : Feb 13 2025, 11:03 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Ileana

Ileana

ఇండస్ట్రీలో స్టార్ గా ఎదగాలంటే చాలా కష్టం. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో దర్శక నిర్మాతలు చాలా సెంటిమెంట్లు పెట్టుకుంటారు. ఒక్కసారి ఫ్లాప్ పడితే హీరోయిన్ కెరీర్ లో నిలదొక్కుకోవడం చాలా కష్టం. అదృష్టం కొద్దీ కెరీర్ బిగినింగ్ లోనే హిట్ చిత్రం దక్కితే ఆ హీరోయిన్ కెరీర్ ఎక్కవ కాలం కొనసాగే అవకాశం ఉంటుంది. ఒక్కసారి క్రేజ్ వచ్చాక ఫ్లాపులు పడ్డప్పటికీ పెద్దగా నష్టం ఉండదు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25

క్రేజీ హీరోయిన్ ఇలియానా విషయంలో ఇదే జరిగింది. ఇలియానాని దేవదాసు చిత్రంతో డైరెక్టర్ వైవిఎస్ చౌదరి పరిచయం చేశారు. తొలి చిత్రంలోనే ఇలియానా గ్లామర్ షో చేసింది. పైగా ఆ చిత్రం సూపర్ హిట్ కావడంతో టాలీవుడ్ దర్శకుల చూపు ఆమెపై పడింది. దేవదాసు చిత్రం ఆమెని ఇండస్ట్రీకి పరిచయం చేస్తే ఆ వెంటనే నటించిన చిత్రం మాత్రం ఇలియానా సినీ జీవితాన్నే మార్చేసింది. ఆ మూవీ ఏంటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పూరి జగన్నాధ్, మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కిన పోకిరి చిత్రం అది. 

35
Ileana

Ileana

పోకిరి చిత్రం తర్వాత ఇలియానా క్రేజ్ ఎంతలా వ్యాపించింది అంటే వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి. అప్పటి వరకు టాలీవుడ్ లో కోటి రూపాయల రెమ్యునరేషన్ అందుకున్న హీరోయిన్ ఎవరూ లేరు. ఆ రికార్డు ఇలియానాకి మాత్రమే దక్కింది. అప్పట్లో హీరోయిన్ కి కోటి రూపాయల పారితోషికం అంటే మాటలు కాదు. అయినా ఇలియానా డేట్ల కోసం నిర్మాతలు ఎగబడేవారు. 

45
Ileana

Ileana

అంత క్రేజ్ సాధించిన ఇలియానాకి టాలీవుడ్ లో 50 శాతం విజయాలు కూడా లేవు. తెలుగులో ఇలియానా మొత్తం 16 చిత్రాల్లో నటించింది. అందులో హిట్ అయిన చిత్రాలు 6 మాత్రమే. మిగిలిన 10 చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. కానీ ఇలియానాకి యువతలో ఉన్న క్రేజ్ తో ఆమెని దర్శక నిర్మాతలు కొనసాగించారు. టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న టైంలోనే ఇలియానా పెద్ద తప్పు చేసింది. 

55

బాలీవుడ్ పై వ్యామోహంతో టాలీవుడ్ చిత్రాలని వదిలేసింది. కానీ బాలీవుడ్ లో ఆమెకి ఏమాత్రం కలసి రాలేదు. పెద్దగా అవకాశాలు కూడా రాలేదు. ఇంతలో టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ మొత్తం పోయింది. ఆ సమయంలో ఇలియానా పర్సనల్ లైఫ్ లో కూడా ఇబ్బందులు ఎదుర్కొంది. ఓ వ్యక్తితో బ్రేకప్ కావడంతో డిప్రెషన్ లోకి వెళ్ళింది. దీనితో ఆమెకి అవకాశాలు ఇచ్చే నిర్మాతలు కరువయ్యారు. అమర్ అక్బర్ ఆంటోని చిత్రంతో టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చింది కానీ వర్కౌట్ కాలేదు.ఇలియానా తెలుగులో నటించిన చిత్రాల్లో దేవదాసు, పోకిరి, ఆట, జల్సా, కిక్, జులాయి చిత్రాలు విజయం సాధించాయి. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Ileana Mother: తల్లీ కూతుళ్లే డిసైడ్ అయ్యారు, ఇలియానా వల్గర్ గా కనిపించిన మూవీ.. నాకేం సంబంధం లేదు
Recommended image2
వెంకటేష్ హీరోయిన్ ఆస్తి.. ఆమె భర్త ఆస్తికంటే ఎక్కువా..? ఎవరి ఆస్తి ఎంత?
Recommended image3
Salman Khan: కెరీర్‌లో ఒక్క స్క్రిప్ట్ కూడా చదవలేదు.. భాయ్ చెప్పిన షాకింగ్ నిజం!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved