టాలీవుడ్ డైరెక్టర్స్ అందరికీ అదే పని, నా నడుముని అన్ని యాంగిల్స్ లో.. ఇలియానా వివాదాస్పద వ్యాఖ్యలు వైరల్
గోవా భామ ఇలియానా పోకిరి చిత్రంతో టాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది. నాజూకు నడుము ఒంపులతో ఇలియానా యువత హృదయాల్లో కొలువైపోయింది. ఒకప్పుడు సౌత్ లో యువతకు కలల రాణిగా వెలుగు వెలిగింది ఇలియానా.
గోవా భామ ఇలియానా పోకిరి చిత్రంతో టాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది. నాజూకు నడుము ఒంపులతో ఇలియానా యువత హృదయాల్లో కొలువైపోయింది. ఒకప్పుడు సౌత్ లో యువతకు కలల రాణిగా వెలుగు వెలిగింది ఇలియానా. టాలీవుడ్ లో కెరీర్ దూసుకుపోతున్న టైంలో ఇలియానా తీసుకున్న నిర్ణయాలే కెరీర్ కు శాపంలా మారాయి.
బాలీవుడ్ ని దున్నేయాలని బయలుదేరడంతో చుక్కెదురు తప్పలేదు. దీనితో కెరీర్ ట్రాక్ తప్పింది. హీరోయిన్ గా అవకాశాలు తగ్గాయి. లవ్ ఎఫైర్, బ్రేకప్ లాంటి వ్యవహారాలు ఇలియానాని కుంగదీశాయి.
ప్రస్తుతం ఇలియానా అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. ఖాళీ సమయంలో గోవా లాంటి ప్రదేశాల్లో వెకేషన్స్ లో ఎంజాయ్ చేస్తోంది. అలాగే అవకాశం చిక్కినప్పుడు సినిమాల్లో నటిస్తోంది. ఇటీవల ఇలియానా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. పెళ్లి కాలేదు అప్పుడే గర్భం, పిల్లలు ఏంటి అంటూ అంతా షాక్ అయ్యారు. చాలా రోజుల పాటు తన బిడ్డకు తండ్రి ఎవరనే విషయాన్ని కూడా ఇలియానా దాచిపెట్టింది.
ileana d'cruz
అయితే ఇటీవల అతడి ఫోటో షేర్ చేయడంలో ఇలియానా లైఫ్ పార్ట్నర్ డీటెయిల్స్ బయటకి వచ్చాయి. అతడి పేరు మైఖేల్ డోలాన్ అని తెలుస్తోంది. ప్రస్తుతం ఇలియానా తన బిడ్డతో మాతృత్వాన్ని ఎంజాయ్ చేస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా ఇంటర్వ్యూలో ఇలియానా టాలీవుడ్ దర్శకులపై సంచలన వ్యాఖ్యలు చేసింది.
టాలీవుడ్ లో చాలా కాలం స్టార్ డమ్ అనుభవించిన ఇలియానా ఇప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలతో రెచ్చిపోతోంది. ఓ ఇంటర్వ్యూలో యాంకర్ టాలీవుడ్ లో మీకు ఏ దర్శకుడు సరైన గుర్తింపు దక్కే పాత్ర ఇచ్చారు అని ప్రశ్నించగా ఇలియానా తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. టాలీవుడ్ లో నేను స్టార్ హీరోలతో, స్టార్ డైరెక్టర్స్ తో నటించాను. ఏ దర్శకుడు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్ర ఇవ్వలేదు. వాళ్ళందరి ఫోకస్ నా నడుము పైనే. ఎప్పుడు నా నడుముని ఏ యాంగిల్ లో చూపించాలి అని మాత్రమే ఆలోచించేవారు అంటూ ఇలియానా పేర్కొంది.
ప్రతి చిత్రంలో నా నడుము కోసమే అన్నట్లుగా వారి ఫోకస్ ఉండేది దీనితో చిరాకు అనిపించేది అని ఇలియానా పేర్కొంది. దీనితో ఇలియానా వ్యాఖ్యలని కొందరు ఫ్యాన్స్ సమర్థిస్తుంటే మరికొందరు మాత్రం ఇలియానాకి స్టార్ డమ్ వచ్చిందే టాలీవుడ్ దర్శకుల వల్ల అని అంటున్నారు. ఇలియానా వ్యాఖ్యలు ఏరు దాటాక తెప్ప తగలేయడంలా ఉందని అంటున్నారు.