MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మరో సారి తల్లి కాబోతున్న మహేష్ బాబు హీరోయిన్ ఎవరో తెలుసా?

మరో సారి తల్లి కాబోతున్న మహేష్ బాబు హీరోయిన్ ఎవరో తెలుసా?

సౌత్ ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు చేసిన ఓ హీరోయిన్ సడెన్ గా సినిమాలు మానేసింది. పెళ్లి కూడా చేసుకోకుండానే ఓ బిడ్డకు తల్లి అయిన ఆ బ్యూటీ.. తాజాగా మరోసారి తల్లి కాబోతున్నట్టు చెప్పకనే చెప్పింది.

1 Min read
Author : Mahesh Jujjuri
Published : May 29 2025, 06:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Image Credit : Ileana Dcruz instagram

తెలుగు సినిమాలతో కెరీర్‌ను ప్రారంభించిన గోవా బ్యూటీ ఇలియానా డిక్రూజ్ తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది. ఒకప్పుడు ప్రభాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్, విజయ్, రవితేజ లాంటి స్టార్ హీరోలతో కలిసి ఎన్నో సూపర్‌హిట్ సినిమాల్లో నటించిన ఆమె... ఇప్పుడు సినిమాలకు దూరంగా లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటోంది ఇలియాన. నెట్టింట అభిమానులతో జీవితానికి సంబంధించి కీలక విషయాలను ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూ వస్తోంది.

24
Image Credit : Ileana Dcruz instagram

ఇక తాజాగా ఇలియానా మరోసారి తల్లికాబోతున్నట్టు సమాచారం. ఆమె ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో స్నేహితురాలితో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసింది. ఆ ఫోటోలో ఇద్దరికి స్పష్టంగా బేబీ బంప్ కనిపించింది. "Bump buddies" అనే క్యాప్షన్‌తో ఆ ఫోటోను పోస్టు చేయడం ద్వారా ఇలియానా తాను మరోసారి గర్భవతినని పరోక్షంగా ప్రకటించినట్టయింది. ఇది చూసిన అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Related Articles

Related image1
మహేష్ బాబు తో ఐటమ్ సాంగ్ చేసి, తర్వాత తల్లిగా కూడా నటించిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
Related image2
రాజమౌళి తరువాత మహేష్ బాబు ప్లాన్ ఏంటి? ఎవరితో సినిమా చేయబోతున్నాడంటే?
34
Image Credit : instagram

ఇలియానా 2023లో తన మొదటి బిడ్డకు జన్మనిచ్చింది. అమెరికన్ ఫోటోగ్రాఫర్ మైఖేల్ డోలన్‌తో డేటింగ్‌లో ఉన్న ఆమె.. పెళ్లికాకుండానే తల్లిగా మారింది. తన కొడుకుకు "ఫీనిక్స్ డోలన్" అనే పేరు పెట్టినట్టు వెల్లడించింది. తన కుమారుడి ఫోటోలు, మొదటి పుట్టినరోజు వేడుకల క్షణాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వచ్చింది. వీరికి మొదటి బిడ్డ కలిగిన తరువాతే వారు పెళ్లి చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం రెండో సారి తల్లి కాబోతోంది ఇలియాన.

44
Image Credit : our own

తెలుగులోదేవదాసు సినిమాతో తన కెరీర్ ను ప్రారంభించిన ఇలియానా, మొదటి సినిమాతోనే ఘన విజయం అందుకున్నారు. తర్వాత పోకిరి, జల్సా, జులాయి, ‘శక్తి’ , కిక్ వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తమిళం, హిందీలో కూడా ఇలియాన హిట్ సినిమాలు చేసింది. ప్రస్తుతం సినిమాల నుంచి బయటపడినా.. వ్యక్తిగత జీవితానికి సంబంధించి ప్రతి అప్‌డేట్‌ను అభిమానులతో షేర్ చేసుకుంటూ.. సోషల్ మీడియా ద్వారా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది ఇలియానా.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
మహేష్ బాబు ఘట్టమనేని
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Box Office Clash: యష్ టాక్సిక్ దెబ్బకు రణ్‌వీర్ 'ధురంధర్ 2' ఢమాల్, 24 గంటల్లోనే సీన్ రివర్స్
Recommended image2
ఉదయ్ కిరణ్ ఆమెని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు, అందుకే ఆస్తులు దక్కలేదు అంటూ నటి వ్యాఖ్యలు
Recommended image3
Karthika Deepam 2 అరుదైన రికార్డు.. స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసిన స్టార్ మా, కారణం ఏంటంటే?
Related Stories
Recommended image1
మహేష్ బాబు తో ఐటమ్ సాంగ్ చేసి, తర్వాత తల్లిగా కూడా నటించిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
Recommended image2
రాజమౌళి తరువాత మహేష్ బాబు ప్లాన్ ఏంటి? ఎవరితో సినిమా చేయబోతున్నాడంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved