- Home
- Entertainment
- Idli Kottu Day 1 Collections: ధనుష్ ఇడ్లీ కొట్టు మూవీ ఫస్ట్ డే బాక్సాఫీసు వసూళ్లు.. కుబేరని దాటలేదా?
Idli Kottu Day 1 Collections: ధనుష్ ఇడ్లీ కొట్టు మూవీ ఫస్ట్ డే బాక్సాఫీసు వసూళ్లు.. కుబేరని దాటలేదా?
Idli Kottu Day 1 Collections: ధనుష్ దర్శకత్వం వహించి నటించిన `ఇడ్లీ కొట్టు` సినిమా బుధవారం విడుదలైంది. ఈ చిత్రానికి మొదటి రోజు కలెక్షన్లు చాలా దారుణంగా ఉన్నాయి.

ధనుష్ `ఇడ్లీ కొట్టు` మూవీకి నెగటివ్ టాక్
ధనుష్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన మూవీ `ఇడ్లీ కొట్టు`. తమిళంలో వచ్చిన `ఇడ్లీ కడై` మూవీకిది తెలుగు అనువాదం. ఈ చిత్రంలో నిత్యా మీనన్, షాలినీ పాండే హీరోయిన్లుగా నటించారు. సత్యరాజ్, అరుణ్ విజయ్, సముద్రఖని, పార్థిబన్ వంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు. వండర్ బార్ పిక్చర్స్, డాన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించాయి. దసరా పండుగని పురస్కరించుకుని బుధవారం ఈ చిత్రం విడుదలయ్యింది.
`ఇడ్లీ కొట్టు`కి నెగటివ్ టాక్
`రాయన్` చిత్రం తర్వాత ధనుష్ దర్శకత్వం వహించిన మూవీ `ఇడ్లీ కొట్టు`. `రాయన్` పెద్దగా ఆడకపోయినా మొదటి మంచి వసూళ్లని రాబట్టింది. కానీ `ఇడ్లీ కొట్టు` వెనకబడిపోయింది. ఈ చిత్రానికి ప్రారంభం నుంచే నెగటివ్ టాక్ వచ్చింది. స్లోగా సాగడం, కథలో డ్రామా పండకపోవడం, ఎమోషన్స్ బలంగా పండకపోవడంతో ఆడియెన్స్ కి ఎక్కలేదు. చాలా వరకు ఇది ఓటీటీ మూవీ అనే కామెంట్ వచ్చింది. పైగా పబ్లిసిటీ కూడా చేయలేదు. సినిమా వస్తుందనే విషయమే తెలియదు. దీంతో ఆ ప్రభావం సినిమాపై పడింది. అది ఓపెనింగ్స్ పై గట్టి ప్రభావం చూపించింది.
`ఇడ్లీ కొట్టు` మొదటి రోజు కలెక్షన్లు
ఈ నేపథ్యంలో `ఇడ్లీ కొట్టు` సినిమా మొదటి రోజు వసూళ్ల వివరాలు బయటకొచ్చాయి. దీని ప్రకారం, భారతదేశంలో మొదటి రోజు రూ.10.40 కోట్లు వసూలు చేసింది. తమిళనాడులో రూ.9.75 కోట్లు, తెలుగు వెర్షన్ రూ.65 లక్షలు రాబట్టింది. తెలుగులో మరీ దారుణమైన ఓపెనింగ్స్ ని రాబట్టడం గమనార్హం. ఇక ఓవర్సీస్‌లో కోటి వరకు వచ్చినట్టు తెలుస్తోంది. మొత్తంగా ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు రూ.12 కోట్ల గ్రాస్ (ఆరు కోట్ల షేర్) వచ్చిందని ట్రేడ్ వర్గాల టాక్.
`కుబేర`ని టచ్ చేయలేకపోయిన `ఇడ్లీ కొట్టు`
ధనుష్ చివరిగా `కుబేర` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. దీనికి తెలుగు దర్శకుడు శేఖర్ కమ్ము దర్శకత్వం వహించారు. నాగార్జున, రష్మిక మందన్నా ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం మొదటి రోజు ఇండియాలో సుమారు రూ.15కోట్లు చేసింది. తెలుగులోనే పది కోట్లు రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.27కోట్లు కలెక్ట్ చేసింది. ఇప్పుడు `ఇడ్లీకొట్టు`కి అందులో సగం కూడా రాలేకపోవడం గమనార్హం.