అక్కినేని వారి కొత్త కోడలికి అంత అవమానం జరిగిందా, అందంగా లేవన్నారని ఓపెన్ అయిన శోభిత!
అక్కినేని వారి కొత్తకోడలు శోభిత ధూళిపాళ్ళకు తీరని అవమానం జరిగిందట. నువ్వు అందంగా లేవని అవమాన పరిచారట. ఈ విషయాలు ఆమె స్వయంగా వెల్లడించారు.
తెలుగు అమ్మాయి శోభిత దూళిపాళ్ల అక్కినేని వారి కోడలు అయ్యారు. నాగార్జున పెద్ద కుమారుడు నాగ చైతన్యను ఆమె ప్రేమ వివాహం చేసుకుంది. రెండేళ్లకు పైగా నాగ చైతన్య-శోభిత రిలేషన్ లో ఉన్నారు. తరచుగా విదేశాలకు వెళ్లి విహరించేవారు. వీరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దాంతో శోభిత-నాగ చైతన్య డేటింగ్ చేస్తున్నారని కథనాలు వెలువడ్డాయి.
ఈ వార్తలను శోభిత ఖండించారు. నాగ చైతన్య టీమ్ సైతం అవన్నీ పుకార్లే అని స్పష్టత ఇచ్చారు. కట్ చేస్తే ఆగస్టు 8న ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. నాగార్జున నివాసంలో అత్యంత నిరాడంబరంగా నాగ చైతన్య-శోభితల ఎంగేజ్మెంట్ జరిగింది. కొత్త కోడలు శోభితను నాగార్జున తనకు కుటుంబంలోకి ఆహ్వానిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
కాగా డిసెంబర్ 4న శోభిత-నాగ చైతన్య వివాహం చేసుకున్నారు. అన్నపూర్ణ స్టూడియోలో ఈ పెళ్లి వేడుక నిర్వహించారు. పెళ్లి కూడా సింపుల్ గా ముగించారు. కేవలం 300 మందికి మాత్రమే ఆహ్వానం లభించింది. శోభిత బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి కాగా... వారి సాంప్రదాయం ప్రకారం వివాహం చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శోభిత పలు ఆసక్తికర సంగతులు పంచుకున్నారు.
శోభితకు కెరీర్ బిగినింగ్ లో అనేక అవమానాలు ఎదురయ్యాయట. నువ్వు అందంగా లేవు. నీవు మోడల్ గా పనికిరావు. కనీసం మోడల్ వెనుక అవుట్ ఫోకస్ కి కూడా వేస్ట్ అని అవమానించారట. ఆ మాటలు బాధపెట్టినప్పటికీ పట్టుదలతో ప్రయత్నాలు చేసి సక్సెస్ అయ్యానని ఆమె అన్నారు.
నేను ఎన్నాళ్లగానో ఎదురు చూస్తున్న ప్రేమ నాగ చైతన్య రూపంలో దొరికింది. ఆయన భర్తగా రావడం నా అదృష్టం. నాగ చైతన్యలోని సింప్లిసిటీ, దయ, కేరింగ్ నాకు ఎంతగానో నచ్చాయని శోభిత అన్నారు. శోభిత బాగా వంట కూడా చేస్తుందట. పులిహోర, ముద్ద పప్పు, పచ్చిపులుసు, ఆవకాయ్ శోభితకు ఇష్టమైన వంటకాలు అట. భరతనాట్యం, కూచిపూడి కూడా నేర్చుకుందట. పుస్తకాలు చదవడం, కవితలు రాయడం హాబీ అట.
శోభిత బాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. తెలుగులో శోభిత రెండు చిత్రాలు మాత్రమే చేసింది. గూఢచారి, మేజర్ చిత్రాల్లో ఆమె హీరోయిన్ గా చేసింది. గూఢచారి 2లో సైతం శోభిత నటిస్తున్నారని సమాచారం. తమిళ్, ఇంగ్లీష్ చిత్రాల్లో కూడా శోభిత నటించారు. వచ్చిన ప్రతి సినిమాకు సైన్ చేయను. పాత్ర నచ్చితేనే ఒప్పుకుంటాను. ఎప్పుడూ సిల్వర్ స్క్రీన్ పై కనిపించాలని కోరుకోనని శోభిత అన్నారు.