- Home
- Entertainment
- Rashmika Mandanna:ఈ బాధలు చూశాక మగాడిలా పుట్టాలని ఉంది... వైరల్ గా రష్మిక బోల్డ్ కామెంట్స్
Rashmika Mandanna:ఈ బాధలు చూశాక మగాడిలా పుట్టాలని ఉంది... వైరల్ గా రష్మిక బోల్డ్ కామెంట్స్
స్టార్ లేడీ రష్మిక మందాన కామెంట్స్, యాటిట్యూడ్ కొంచెం బోల్డ్ గా ఉంటాయి. విషయం ఏదైనా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడుతుంది. తాజాగా రష్మిక మగాడిగా పుట్టాలని చెప్పడం విశేషంగా మారింది.

రష్మిక మందాన (Rashmika Mandanna) లేటెస్ట్ మూవీ ఆడవాళ్లు మీకు జోహార్లు. దర్శకుడు కిషోర్ తిరుమల తెరకెక్కించిన ఈ చిత్రం మార్చి 4న విడుదలైంది. ఈ నేపథ్యంలో రష్మిక చిత్ర ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. రష్మిక పెళ్లి, రిలేషన్ వంటి పలు ఆసక్తికర అంశాలపై స్పందించారు.
రష్మిక మాట్లాడుతూ... ”పెళ్లి చూపుల పేరుతో ఆడవాళ్ళు పడే కష్టాలు ఈ సినిమాలో చూశా. నగలు , చీరలు, పవ్వులు .. ఇష్టం ఉన్నా లేకున్నా అన్నీ అలకరించుకొని మగాడి ముందు తల దించుకొని కూర్చోవాలి. ఇలాంటి బాధలు చూశాక.. మరో జన్మ వుంటే మగాడిగా పుడితే బాగున్ను అనిపిస్తుంది. కాలు మీద కాలేసుకొని, ప్రశ్నలు అడుగుతూ ఎంచక్కా కూర్చోవచ్చు”అని చెప్పింది.
ఇక ఎలాంటి పెళ్లి కొడుకు కావాలని అడిగిన ఓ ప్రశ్నకు బదులిస్తూ.. ‘ఇంకా పెళ్లి గురించి అలోచించలేదు. పెళ్లి కొడుకు ఇలా వుండాలి, అలా వుండాలని లేదు. మంచి వాడైతే చాలు” అని తన మనసులో మాట పంచుకుంది రష్మిక.
కొన్నాళ్లుగా రష్మిక-విజయ్ దేవరకొండ (Vijay devarakonda)మధ్య లవ్ ఎఫైర్ నడుస్తుందని వార్త ప్రచారం అవుతుంది. ఇక త్వరలో పెళ్లి కూడా అంటూ జాతీయ మీడియాలో వచ్చిన వార్తలపై విజయ్ దేవరకొండ నాన్ సెన్స్ అంటూ కొట్టిపారేశారు. రష్మిక మాత్రం... సదరు రూమర్స్ ఎంజాయ్ చేస్తాను. అంత సీరియస్ గా తీసుకోను అంటూ చాలా కూల్ ఆన్సర్ ఇచ్చారు. ప్రస్తుతం రష్మిక వయసు 25 కాగా దానికి ఇంకా సమయం ఉందంటుంది.
కెరీర్ బిగినింగ్ లోనే రష్మిక కన్నడ హీరో రక్షిత్ శెట్టి ప్రేమలో పడ్డారు. ఇద్దరికీ నిశ్చితార్థం కూడా జరిగింది. అనూహ్యంగా రష్మిక పెళ్లి ఆలోచన వెనక్కి తీసుకున్నారు. దానితో రక్షిత్ శెట్టితో ఆమె వివాహం రద్దైంది. తెలుగులో రష్మిక వరుస విజయాలతో స్టార్ హీరోయిన్ అయ్యారు.
తెలుగులో పుష్ప 2లో రష్మిక నటించాల్సి ఉంది. ఈ ఏడాది చివర్లో పుష్ప 2 విడుదల కానుంది. త్వరలో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన పుష్ప పార్ట్ 1 భారీ విజయం అందుకుంది. అలాగే హిందీలో మిషన్ మజ్ను, గుడ్ బై చిత్రాలు చేస్తున్నారు.