ప్రేమదేశం అబ్బాస్ దుస్థితి.... రెంట్, సిగరెట్స్ కి కూడా కష్టమైంది, చివరికి మెకానిక్ గా మారాను!
లవర్ బాయ్ ఇమేజ్ తో పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన అబ్బాస్ మెకానిక్ అయ్యాడట. కుటుంబ పోషణకు టాక్సీ డ్రైవర్ గా మారాడట. తాజా ఇంటర్వ్యూలో అబ్బాస్ షాకింగ్ విషయాలు షేర్ చేశారు.
Abbas
నటుడు అబ్బాస్ నేషనల్ మీడియాతో మాట్లాడుతూ... కోవిడ్ సమయంలో నేను న్యూజిలాండ్ లో ఉన్నాను. జూమ్ కాల్ లో నా ఫ్యాన్స్ తో ముచ్చటించాను. ఇబ్బందుల్లో ఉన్నవాళ్లకు చేతనైన సాయం చేయాలి. ముఖ్యంగా సమస్యలతో ఆత్మహత్య చేసుకోవాలనుకునే వాళ్ళ మనసులు మార్చాలి. ఎందుకంటే ఒక దశలో నేను కూడా అలాంటి ఆలోచనలు ఎదుర్కొన్నాను.
టెన్త్ గ్రేడ్ లో ఫెయిల్ అయ్యాను. అదే సమయంలో గర్ల్ ఫ్రెండ్ వదిలేసిపోయింది. చనిపోదాం అనిపించింది. రోడ్డు పక్కన నిల్చుని వేగంగా వచ్చే వాహనం క్రింద పడాలని చూశాను. అయితే అదే వాహనం వెనుక ఓ బైకర్ వస్తున్నాడు. నేను ఆ వాహనం కింద పడితే బైకర్ వెనక నుండి దాన్ని గుద్దే ప్రమాదం ఉంది. నా వలన ఏ సంబంధం లేని వ్యక్తికి నష్టం కలుగకూడదు అనుకున్నాను.
వేదనలో కూడా మరొకరి మంచి గురించి నేను ఆలోచించాను. నాకు చదువు పెద్దగా అబ్బలేదు. అకడమిక్స్ ఆధారంగా ఒకరి టాలెంట్ జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు. ఎవరి ప్రతిభ వాళ్ళది. మనం మానసిక వేదనలో ఉన్నప్పుడు ఆ ఫీలింగ్స్ మరొకరితో పంచుకోవాలి. గుండెల్లో దాచుకుని కృంగిపోకూడదు. నా అభిమానులకు నేను ఇచ్చే సలహా ఇదే.
Abbas
కెరీర్ బిగినింగ్ లో నేను సక్సెస్ చూశాను. తర్వాత పరాజయాలు ఎదురయ్యాయి. రెంట్, సిగరెట్స్ వంటి కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని పరిస్థితి వచ్చింది. ఆఫర్ కావాలంటూ నిర్మాత ఆర్బీ చౌదరిని కలిశాను. ఆయన పూవేలి మూవీలో ఛాన్స్ ఇచ్చారు. తర్వాత నేను నటన వదిలేశాను. కారణం నాకు బోర్ కొట్టేసింది.
కుటుంబ పోషణ కోసం ప్రత్యామ్నాయం వెతుక్కోవాలి అనుకున్నాను. న్యూజిలాండ్ వెళ్ళాను. అక్కడ బైక్ మెకానిక్ గా చేశాను. టాక్సీ నడిపాను. న్యూజిలాండ్ లో కొన్ని పత్రికలకు ఇంటర్వ్యూలు ఇచ్చాను. వాళ్ళు నా కామెంట్స్ వక్రీకరించారు. నాకు మానసిక సమస్యలు తలెత్తాయని కూడా పుకార్లు వచ్చాయి.
సినిమాల్లోకి రావాలని నేను అనుకోలేదు. ఏదో కొన్ని డబ్బులు వస్తాయని ప్రేమ దేశం మూవీలో నటించాను. ఆ సినిమా ప్రీమియర్ కి సాధారణ ప్రేక్షకుడిగా వెళ్లి చూశాను. మా ఇంటి ముందు వేల మంది అభిమానులు కూడారు. నాకు ఆశ్చర్యం వేసింది. నాకు కేవలం 19 సంవత్సరాలు. అంతటి ప్రేమను ఊహించలేదని అబ్బాస్ చెప్పుకొచ్చారు...
ప్రేమదేశం మూవీతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైన అబ్బాస్ తెలుగు, తమిళ భాషల్లో పలు హిట్ చిత్రాల్లో నటించారు. సపోర్టింగ్, సెకండ్ హీరో, విలన్ రోల్స్ సైతం చేశాడు. ఎలాంటి నేపథ్యం లేని అబ్బాస్ కి తగినంత ప్రోత్సాహం లభించలేదని చెప్పాలి.