MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పెళ్లి చేసుకున్న సంగతి మర్చిపోయిన స్టార్ హీరోయిన్... తాళి కట్టిన వాడి పరిస్థితి ఏంటి?

పెళ్లి చేసుకున్న సంగతి మర్చిపోయిన స్టార్ హీరోయిన్... తాళి కట్టిన వాడి పరిస్థితి ఏంటి?

స్టార్ హీరోయిన్ తాప్సీ పెళ్లి చేసుకున్న సంగతి మర్చిపోయిందట. ఆమె మాటలకు జనాలు అవాక్కు అవుతున్నారు. మరి తాళి కట్టిన భర్త పరిస్థితి ఏంటని వాపోతున్నారు. 

2 Min read
Author : Sambi Reddy
Published : Jul 26 2024, 06:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

నార్త్ బ్యూటీ తాప్సీ పన్నును కే రాఘవేంద్రరావు సిల్వర్ స్క్రీన్ కి పరిచయం చేశాడు. 2010లో విడుదలైన ఝుమ్మంది నాదం ఆమె డెబ్యూ చిత్రం. మ్యూజికల్ లవ్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం పర్లేదు అనిపించుకుంది. మంచు మనోజ్ హీరో కాగా మోహన్ బాబు కీలక రోల్ చేశాడు. 


 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

మరో మంచు హీరో విష్ణుకు జంటగా వస్తాడు నా రాజు టైటిల్ తో ఓ మూవీ చేసింది. ఇది డిజాస్టర్ అని చెప్పాలి. అనూహ్యంగా ప్రభాస్ మూవీ మిస్టర్ పర్ఫెక్ట్ లో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ పట్టేసింది. కాజల్ అగర్వాల్ ఆ మూవీలో మరొక హీరోయిన్. మిస్టర్ పర్ఫెక్ట్ తాప్సీ కెరీర్లో ఫస్ట్ హిట్ అని చెప్పొచ్చు. అనంతరం మొగుడు, వీర, దరువు, గుండెల్లో గోదావరి చిత్రాల్లో నటించింది. 

35

కొన్నేళ్లుగా తాప్సీ బాలీవుడ్ మీద ఎక్కువ దృష్టి పెట్టింది. అక్కడ వరుసగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తుంది. నార్త్ లో ఫేమ్ తెచ్చుకున్నాక కెరీర్ ఇచ్చిన సౌత్ మీద ఆమె ఆరోపణలు చేయడం కొసమెరుపు. రాఘవేంద్రరావు తన నడుము మీద పండ్లు, కొబ్బరి కాయలు వేయడాన్ని ఓ సందర్భంలో తాప్సీ వ్యంగ్యంగా మాట్లాడింది. తాప్సీ కి సౌత్ పట్ల చిన్న చూపు ఉందని ఆమె చేసిన కామెంట్స్ ద్వారా అర్థమైంది. 

 

 

45

కాగా ఆమె లేటెస్ట్ మూవీ ఫిర్ ఆయీ హసీన్ దిల్ రుబా విడుదలకు సిద్ధం అవుతుంది. ఆగస్టు 9న థియేటర్స్ లోకి రానుంది. ఈ  చిత్ర ప్రమోషన్స్ లో తాప్సీ పాల్గొంటుంది. కాగా ఓ మీడియా ప్రతినిధి తాప్సీ కి కంగ్రాట్స్ చెప్పాడు. దాంతో ఇంకా నా మూవీ విడుదల కాలేదు. హిట్ కాలేదు. అప్పుడే కంగ్రాట్స్ ఎందుకని తాప్సీ... సదరు మీడియా ప్రతినిధి తో అన్నది. మీరు పెళ్లి చేసుకున్నందుకు కంగ్రాట్స్ చెప్పానని  మీడియా ప్రతినిధి అన్నాడు.

55

నాకు పెళ్ళైన విషయం నాకు గుర్తు లేదు. మర్చిపోయానని తాప్సీ అనడంతో అతను షాక్ అయ్యాడు. పెళ్లే గుర్తు లేకపోతే కట్టుకున్న భర్త ఏం గుర్తుంటాడని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. డెన్మార్క్ కి చెందిన మథియాస్ బోయే అనే బాడ్మింటన్ ప్లేయర్ ని తాప్సీ 2024 మార్చిలో ప్రేమ వివాహం చేసుకుంది. దాదాపు 11 ఏళ్లుగా రిలేషన్ లో ఉన్న వీరిద్దరూ నిరాడంబరంగా పెళ్లి చేసుకున్నారు.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
OG Singer: ఓజీ ఫైర్‌ స్ట్రోమ్‌ సింగర్‌ కొత్త పాట చూశారా?.. ఊపేస్తున్న `ఓఎంజీ` సాంగ్‌
Recommended image2
Thudakkam: సైకోని ఒక ఆట ఆడుకున్న మోహన్ లాల్ కూతురు, ప్లాన్ చేసి మరీ కొట్టింది.. ఓటీటీలో దుమ్ములేపుతున్న మూవీ
Recommended image3
Venkatesh Remuneration: ఆదర్శ కుటుంబం మూవీకి వెంకటేష్‌ ఊహించని రెమ్యూనరేషన్‌.. ఏకంగా 3 రెట్లు ఎక్కువ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved