నేను దారుణంగా దెబ్బతిన్న.. షాకిస్తున్న యాంకర్ అనసూయ ఇన్‌స్టా పోస్ట్.. వైరల్.. చీరలో చంపేస్తుందిగా!
హాట్ యాంకర్ అనసూయ ఓ వైపు గ్లామర్ ఫోటోలతో, మరోవైపు నెటిజన్ల ట్రోల్స్ తో తరచూ వార్తల్లో నిలుస్తుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కానీ తాజాగా ఆమె పెట్టిన పోస్ట్, అందులోని అర్థం హాట్ టాపిక్ అవుతుంది.
`జబర్దస్త్` కామెడీ షోతో పాపులర్ అయ్యింది అనసూయ(Anasuya). యాంకర్‌గా ఆమె చేసిన రచ్చ ఆమెని పాపులర్ చేసింది. ఆమె వేసే గ్లామర్ డ్రెస్సులు ఆమెకి సోషల్ మీడియాలో ఫాలోయింగ్‌ని పెంచాయి. ఆమెకి క్రేజ్‌ని తీసుకొచ్చారు. షోలో ఆమె చేసే కామెడీ, ఆమెపై వేసే పంచ్‌లు పాజిటివ్,నెగటివ్ ఏదైనా ఆమెని హైలైట్‌గా మార్చాయి. Anchor Anasuya Photos.
అయితే అందరికి షాకిస్తూ `జబర్దస్త్` షో నుంచి అనసూయ తప్పుకున్న విషయం తెలిసిందే. ఆమె తనపై వచ్చే బాడీ షేమింగ్ కామెంట్లని తట్టుకోలేక వెళ్లిపోతున్నట్టు తెలిపింది. కొన్ని రోజులు సుడిగాలి సుధీర్‌తో `సూపర్ సింగర్ జూనియర్` షోకి యాంకర్‌గా చేసిన అనసూయ చేతిలో ప్రస్తుతం షోస్ లేవు. యాంకర్‌గా ఖాళీగానే ఉన్న ఈ బ్యూటీ సినిమాల పరంగా మాత్రం ఫుల్ బిజీగా ఉంది.
ఇదిలా ఉంటే లేటెస్ట్ గా ఆమె హైదరాబాద్‌లో ఓ జ్యూవెల్లరి షోరూమ్ ప్రారంభోత్సవంలో పాల్గొంది. ఉల్లిపొరలాంటి శారీలో హోయలు పోయింది. నాభీ అందాలు కనిపించేలా పోజులిచ్చింది. చూపరుల మతిపోగోడుతుంది. ప్రస్తుతం అనసూయ లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
ఇదిలా ఉంటే తాజాగా ఆమె పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది. హాట్ టాపిక్ అవుతుంది. అనసూయ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఆవేదన భరితమైన పోస్ట్ పెట్టింది. `నేను నరకంగా దెబ్బతిన్నా, కానీ నేను గాయపడిన విధంగా ఎవరినీ బాధ పెట్టను` అని పేర్కొంది. ఇదే ఇప్పుడు షాకిస్తుంది. అనసూయ దేన్ని ఉద్దేశించి పెట్టిందనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఇది `వర్డ్ పోర్న్` కొటేషన్ నుంచి తీసుకుని పోస్ట్ చేయడం విశేషం.
కొటేషన్ ఎక్కడి నుంచి తీసుకున్నా.. అందులోని భావం మాత్రం ఆలోచింప చేస్తుంది. అనసూయ బాధని తెలియజేస్తుంది. నిజానికి అనసూయపై సోషల్ మీడియాలో చాలా కామెంట్లు, విమర్శలు, ట్రోల్స్ వస్తుంటాయి. ఆమె బాడీపై, వేసే దుస్తులపై కూడా ట్రోల్స్ నడుస్తుంటాయి. పొట్టి డ్రెస్ వేసిందని, ప్యాంట్ మర్చిపోయిందని, ఆ డ్రెస్ ఏంటీ, ఆ పోజులేంటి అని, జబర్దస్త్ ఫ్యామిలీ చూసే షో అని నానా రకాలుగా కామెంట్లు, ట్రోల్స్, మీమ్స్ తో ఆడుకుంటారు.
ఈ క్రమంలో అనసూయ చాలా సార్లు బాధపడే ఉంటుంది. ఆమె చాలా సార్లు వాటిపై రియాక్ట్ అయ్యింది కూడా. తన ఆవేదన వ్యక్తం చేసింది. బోల్డ్ గానూ రియాక్ట్ అయ్యింది. అయినా విమర్శలు ఎదుర్కొంది. ఏ విధంగానూ అనసూయనే ట్రోల్స్ కి గురయ్యేది . ఆమెనే బాధపడేది. ఈ క్రమంలో ఆమె మనసు చాలా గాయపడి ఉంటుంది. అదే విసయాన్ని ఇప్పుడు ఈ పోస్ట్ రూపంలో ఆమె పేర్కొని ఉండొచ్చు అని అంటున్నారు నెటిజన్లు. కొటేషన్‌లో తన భావం, తన బాధ ఉందని అంటున్నారు. మరి అనసూయ పెట్టి ఉద్దేశ్యం ఏంటనేది ఆమెకే తెలుసు.