- Home
- Entertainment
- అవసరమైతే అది కోసుకుంటా, నీ జోలికి మాత్రం రాను... హైపర్ ఆదికి విరక్తి పుట్టించిన లేడీ డాన్సర్!
అవసరమైతే అది కోసుకుంటా, నీ జోలికి మాత్రం రాను... హైపర్ ఆదికి విరక్తి పుట్టించిన లేడీ డాన్సర్!
బుల్లితెర స్టార్ హైపర్ ఆది ఢీ రియాలిటీ షో వేదికగా లేడీ డాన్సర్ తో ఒక డైలాగ్ కొట్టాడు. హైపర్ ఆది మాటలకు సెట్ మొత్తం షాక్ అయ్యారు.

Hyper Aadi
ఈటీవీలో ఏళ్లుగా ప్రసారం అవుతుంది ఢీ డాన్స్ రియాలిటీ షో. 16 సీజన్స్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఢీ సెలబ్రిటీ స్పెషల్ పేరుతో సీజన్ ప్రసారం అవుతుంది. కాగా ఢీ షోకి హైపర్ ఆది స్పెషల్ అట్రాక్షన్. పెర్ఫార్మన్స్ కి మధ్యలో హైపర్ ఆది కామెడీ పంచులు, సెటైర్స్ నవ్వులు పూయిస్తూ ఉంటాయి.
Hyper Aadi
జడ్జెస్, కంటెస్టెంట్స్, యాంకర్స్ టార్గెట్ గా హైపర్ ఆది పంచులు ఆటం బాంబుల్లా పేలుతూ ఉంటాయి. గతంలో హైపర్ ఆది-సుడిగాలి సుధీర్-ప్రదీప్ మాచిరాజు కాంబో సూపర్ హిట్ అయ్యింది. ప్రస్తుతం ఢీలో హైపర్ ఆది మాత్రమే ఉన్నాడు. సుధీర్, ప్రదీప్ తప్పుకున్నారు. నందు కొత్తగా ఎంట్రీ ఇచ్చారు.
Hyper Aadi
కాగా తాజా ఎపిసోడ్లో హైపర్ ఆది మరో స్కిట్ తో ఆకట్టుకున్నాడు. ఆయన కార్తీక దీపం డాక్టర్ బాబు గెటప్ లో వచ్చాడు. ఇక ఢీ వేదిక మీదున్న ఇద్దరు లేడీ డాన్సర్స్ తో కామెడీ చేశాడు. ఓ డాన్సర్ తన కంట్లో నలక పడిందని చెబుతుంది. ఆమె వద్దకు వెళ్లి నలక తీసే ప్రయత్నం చేశాడు హైపర్ ఆది. ఏం చేస్తున్నావ్ అంటూ యాంకర్ నందు ఆపేశాడు.
Hyper Aadi
నలక పడితే కంట్లో ఊదాలి. లేదా నాలుకతో తీయాలి. అదే చేద్దాం అనుకుంటున్నాను అని హైపర్ ఆది సమాధానం చెప్పాడు. ఇది గమనించిన మరో లేడీ డాన్సర్... నా కంట్లో కూడా నలక పడిందని బాధపడింది. దానికి హైపర్ ఆది... అవసరమైతే నా నాలుక కోసుకుంటా. నీ జోలికి మాత్రం రాను, అని పంచ్ విసిరాడు. దాంతో అందరూ గట్టిగా నవ్వేశారు.
Hyper Aadi
అనంతరం కార్తిక దీపం హిమ... ఎందుకు అమ్మకు అన్యాయం చేశావ్? ... అంటుంది. అరేయ్ ఈమెకు ఎవరైనా చెప్పండ్రా.. నేను ఆ డాక్టర్ బాబును కాదని, అంటూ పంచ్ వేశాడు హైపర్ ఆది. ఢీ సెలబ్రిటీ స్పెషల్ ప్రోమో విడుదల కాగా ఈ విశేషాలతో కూడుకుని ఉంది.
Hyper Aadi
డాన్స్ సెలబ్రిటీ స్పెషల్ సీజన్ కి శేఖర్ మాస్టర్, హీరోయిన్ ప్రణీత సుభాష్ జడ్జెస్ గా వ్యవహరిస్తున్నారు. పలువురు బుల్లితెర సెలెబ్స్ ఈ షోలో కంటెస్ట్ చేస్తున్నారు. మరి టైటిల్ విన్నర్ ఎవరవుతారో చూడాలి.