MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • తల్లిదండ్రుల ఎదుటే కన్నీరు మున్నీరుగా ఏడ్చిన శ్వేతా నాయుడు.. హైపర్ ఆది కెలికి మరీ ఇలా..

తల్లిదండ్రుల ఎదుటే కన్నీరు మున్నీరుగా ఏడ్చిన శ్వేతా నాయుడు.. హైపర్ ఆది కెలికి మరీ ఇలా..

ప్రస్తుతం ఢీ సెలబ్రిటీ స్పెషల్ షో జరుగుతోంది. ఈ షోకి నందు యాంకరింగ్ చేస్తున్నారు. జానీ మాస్టర్, గణేష్ మాస్టర్, ప్రణీత సుభాష్ జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు.

2 Min read
Author : Tirumala Dornala
| Updated : Apr 06 2024, 05:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఒకవైపు కామెడీ షోలు మరోవైపు డ్యాన్స్ షోలు బుల్లితెరపై ప్రేక్షకులను అలరిస్తున్నాయి. అదిరిపోయే డ్యాన్స్ పెర్ఫామెన్స్ లతో పాటు కడుపుబ్బా నవ్వించే కామెడీకి కూడా ఢీ షో అడ్డా అవుతోంది.  కమెడియన్ గా బుల్లితెరపై సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్న హైపర్ ఆది ఢీ లాంటి డ్యాన్స్ షోలో సైతం సందడి చేయడం చూస్తూనే ఉన్నాం.   

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ప్రస్తుతం ఢీ సెలబ్రిటీ స్పెషల్ షో జరుగుతోంది. ఈ షోకి నందు యాంకరింగ్ చేస్తున్నారు. జానీ మాస్టర్, గణేష్ మాస్టర్, ప్రణీత సుభాష్ జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఢీ సెలెబ్రిటీ షో ఉగాదికి ముస్తాబవుతోంది. తాజాగా ప్రోమో రిలీజ్ చేశారు. 

37

ఈ షోలో డ్యాన్సర్లతో వారి తల్లి దండ్రులు కూడా హాజరయ్యారు. దీనితో ఢీ షో ఎమోషనల్ గా మారింది. ఇంత ఎమోషనల్ గా సాగిన షోలో కూడా హైపర్ ఆది తనదైన శైలిలో కామెడీతో అలరించారు. డ్యాన్సర్ల తల్లి దండ్రులని హైపర్ ఆది పరిచయం చేసుకునే ప్రయత్నం చేశాడు. 

47

ముఖ్యంగా హైపర్ ఆది.. ఢీ షోతో పాపులర్ అయిన యంగ్ డ్యాన్సర్ శ్వేతా నాయుడు తల్లిదండ్రులని టార్గెట్ చేశాడు. కెలుక్కుని మరీ పరువు పోగొట్టుకున్నాడు. శ్వేతాకి పెళ్లి ఎప్పుడు చేస్తున్నారు అని హైపర్ ఆది ఆమె తల్లిదండ్రులని అడిగాడు. ఆమె తండ్రి.. మంచి అబ్బాయి దొరికితే చేస్తాం అని అన్నారు. అంటే నేనొచ్చి అడుగుతున్నాను.. నేను మంచి అబ్బాయిని కాదా అని ప్రశ్నించాడు. పక్కనే ఉన్న వ్యక్తి,, ఏంటి నీకు ఇంకా పెళ్లి కాలేదా అంటూ హైపర్ ఆది పరువు తీశాడు. 

57

ఆ తర్వాత డ్యాన్సర్లు అంతా అదిరిపోయే పెర్ఫామెన్స్ ఇచ్చారు. శ్వేతా నాయుడు మాత్రం శ్యామ్ సింగరాయ్ చిత్రంలోని 'ధీమ్ తానా ధీమ్ ధీమ్ తానా జతులతో అనే సాంగ్ కి అదిరిపోయేలా క్లాసికల్ డ్యాన్స్ పెర్ఫామ్ చేసింది. ఎప్పుడూ మోడ్రన్ డ్యాన్సులతో అలరించే శ్వేతా నాయుడు.. ఇలా క్లాసికల్ డ్యాన్స్ చేయడంతో అంతా షాక్ అయ్యారు. 

67

గణేష్ మాస్టర్ మాట్లాడుతూ.. శ్వేతా ఇప్పటి వరకు చేసిన డ్యాన్స్ మొత్తం ఒకెత్తు ఈ క్లాసికల్ డ్యాన్స్ మాత్రం మరో ఎత్తు అని ప్రశంసించారు. తన తల్లిదండ్రుల ముందు క్లాసికల్ డ్యాన్స్ చేయడం చాలా ఆనందంగా ఉందంటూ శ్వేతా కన్నీరు మున్నీరుగా ఏడ్చేసింది. ఆమె తల్లిదండ్రులు వేదికపైకి వెళ్లి ఓదార్చారు. 

77

ఆమెని ఎంకరేజ్ చేస్తూ హైపర్ ఆది చెప్పిన మాట హైలైట్ అనే చెప్పాలి. సినిమాల్లో శ్రీలీల ఎలాగో ఇక నుంచి టీవీల్లో శ్వేతా నాయుడు అలాగ.. ఇరక్కొట్టేస్తోంది డ్యాన్స్ అంటూ హైపర్ ఆది ప్రశంసించాడు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
Latest Videos
Recommended Stories
Recommended image1
Kovai Sarala: పెళ్లిపై కోవై సరళ షాకింగ్‌ కామెంట్‌.. సింగిల్‌గా ఉండటానికి అసలు కారణం ఇదే ?
Recommended image2
Suresh Guru : కామెడీ వీడియోలతో 4M ఫాలోవర్స్ ఏంటి..! నెలకు రూ.5 లక్షల ఆదాయమేంటి..!! ఎవరీ సురేష్ గురు?
Recommended image3
Ram Charan: ఉపాసనపై రామ్ చరణ్ ఫన్నీ కామెంట్స్, పెద్ది ముందే వచ్చి ఉంటే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved