- Home
- Entertainment
- ముద్దులు పెట్టే బుగ్గలు అంటూ మలయాళీ హీరోయిన్ పై రెచ్చిపోయిన హైపర్ ఆది.. ఛాన్స్ దొరకడంతో ఇలా..
ముద్దులు పెట్టే బుగ్గలు అంటూ మలయాళీ హీరోయిన్ పై రెచ్చిపోయిన హైపర్ ఆది.. ఛాన్స్ దొరకడంతో ఇలా..
బుల్లితెరపై డ్యాన్స్ షోలు రసవత్తరంగా ఉంటాయి. కమెడియన్ గా బుల్లితెరపై సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్న హైపర్ ఆది ఢీ లాంటి డ్యాన్స్ షోలో సైతం సందడి చేయడం చూస్తూనే ఉన్నాం.
- FB
- TW
- Linkdin
Follow Us

బుల్లితెరపై డ్యాన్స్ షోలు రసవత్తరంగా ఉంటాయి. కమెడియన్ గా బుల్లితెరపై సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్న హైపర్ ఆది ఢీ లాంటి డ్యాన్స్ షోలో సైతం సందడి చేయడం చూస్తూనే ఉన్నాం. హైపర్ ఆది కడుపుబ్బా నవ్వించే కామెడీ పంచ్ తో పాటు గ్లామర్ ముద్దు గుమ్మలని ఇరకాటంలో పెట్టే విధంగా డబుల్ మీనింగ్ డైలాగులు చెబుతుంటాడు.
ప్రస్తుతం ఢీ ప్రీమియర్ లీగ్ షో జరుగుతోంది. ఈ షోకి శేఖర్ మాస్టర్, పూర్ణ జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు. ప్రదీప్ యాంకర్ గా చేస్తున్నాడు. ఇక హైపర్ ఆది కామెడీ పంచ్ లతో, అల్లరి చేష్టలతో మధ్యలో వినోదం అందిస్తున్నాడు.
డ్యాన్స్ కాంపిటీషన్ కావడంతో కంటెస్టెంట్స్ అంతా హీటెక్కించే డ్యాన్స్ పెర్ఫామెన్స్ లతో రెచ్చిపోతున్నారు. ఇలాంటి పాపులర్ షోలకు తమ చిత్రాల ప్రమోట్ చేసుకునేందుకు తరచుగా సెలెబ్రిటీలు హాజరు కావడం చూస్తూనే ఉన్నాం.
తాజాగా ఢీ ప్రీమియర్ లీగ్ ప్రోమో విడుదలయింది. ఈ ప్రోమోలో ప్రముఖ కొరియోగ్రాఫర్ యశ్వంత్ మాస్టర్ సందడి చేశారు. యశ్వంత్ మాస్టర్ నటించిన తాజా చిత్రం ఆకాశం దాటి వస్తావా చిత్రణ త్వరలో రిలీజ్ కానుంది.
ఈ చిత్రంలో మలయాళీ యంగ్ బ్యూటీ కార్తీక మురళీధరన్ హీరోయిన్ గా నటిస్తోంది. వీళ్ళిద్దరూ ఢీ షోలో సందడి చేశారు. ఈ ప్రోమో ప్రస్తుతం వైరల్ గా మారింది.
కార్తీక మురళీధరన్ తో హైపర్ ఆది చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. ఆమె బుగ్గలు గిల్లుతూ డబుల్ మీనింగ్ డైలాగులు చెబుతూ హైపర్ ఆది రెచ్చిపోయాడు. ఇద్దరికీ హైట్ అసలు మ్యాచ్ కాలేదు. దీనితో హైపర్ ఆది స్టూల్ వేసుకుని మరీ ఫ్లటింగ్ చేస్తున్నాడు. కార్తీకతో మనిద్దరం లేచిపోదాం అని కూడా హైపర్ ఆది అడిగేశాడు.
హైపర్ ఆది రచ్చ అంతటితో ఆగలేదు.. ఇవి ముద్దులు పెట్టాల్సిన బుగ్గలు అంటూ గిల్లాడు. పూర్ణ దగ్గరకి వెళ్లి నీ వయసెంత.. ఎంతైతే ఏంటి సిమ్లా యాపిల్ లా ఉన్నావ్ అని ఆమె పై కూడా కామెంట్స్ చేశాడు.