MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఫస్ట్ టైం ఆదికి దారుణ అవమానం... జడ్జిమెంట్ బాలేదన్నందుకు సిగ్గుందా అని అడిగిన పూర్ణ!

ఫస్ట్ టైం ఆదికి దారుణ అవమానం... జడ్జిమెంట్ బాలేదన్నందుకు సిగ్గుందా అని అడిగిన పూర్ణ!

బుల్లితెర స్టార్ హైపర్ ఆదికి దారుణమైన అవమానం జరిగింది. హీరోయిన్ పూర్ణ జడ్జిమెంట్ తప్పుబట్టినందుకు ఆదిపై పూర్ణ ఫైర్ అయ్యారు. నీకు సిగ్గుందా అని విరుచుకుపడ్డారు.  

2 Min read
Author : Sambi Reddy
| Updated : Nov 03 2022, 11:31 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Dhee 14

Dhee 14


ఢీ సీజన్ 14 జడ్జిగా హీరోయిన్ పూర్ణ వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ప్రియమణి షూటింగ్స్ బిజీ కారణంగా ఆమె రావడం లేదు. దీంతో పూర్ణ రీ ఎంట్రీ ఇచ్చారు. యాని మాస్టర్, గణేష్ మాస్టర్స్ తో కలిసి ఢీ షో జడ్జెస్ గా వ్యవహరిస్తున్నారు. 
 

27
Dhee 14

Dhee 14

ఢీ 14 చివరి దశకు చేరుకుంది. ఎలిమినేషన్ రౌండ్స్ పూర్తయ్యాయి. ప్రస్తుతం సెమీఫైనల్స్ జరుగుతున్నాయి. కంటెస్టెంట్స్ అద్భుతమైన పెర్ఫార్మన్స్ లు ఇస్తున్నారు. అదిరిపోయే డాన్సులతో స్టేజి దద్దరిల్లుతుంది. ఒకరికి మించిన పెర్ఫార్మన్స్ మరొకరు ఇస్తుండగా జడ్జెస్ ఎవరిని ఫైనల్ కి పంపాలో తెలియక అల్లాడుతున్నారు. 
 

37
Dhee 14

Dhee 14


ఇక లేటెస్ట్ సీజన్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. డాన్సర్ శ్వేతాతో హైపర్ ఆది ఫేస్ ఆఫ్ కి దిగాడు. రామ్ చరణ్ ''నీతోనే డాన్స్ టు నైట్'' సాంగ్ కి శ్వేతా, హైపర్ ఆది డాన్స్ చేశారు. అనంతరం స్టేజ్ పైకి వచ్చిన యాంకర్ ప్రదీప్ ఇద్దరిలో విన్నర్ ఎవరో జడ్జెస్ చెప్పాలి అన్నారు. 
 

47
Dhee 14

Dhee 14

ముగ్గురు జడ్జెస్ లో మొదటిగా పూర్ణ... సందేహం ఏముంది, శ్వేతా బాగా చేసింది అన్నారు. దానికి ఆది ఆగ్రహానికి, అసహనానికి గురయ్యాడు. చేతిలో ఉన్న వాటర్ బాటిల్ విసిరేసి... ఫస్ట్ టైం మీ జడ్జిమెంట్ నాకు నచ్చలేదంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు. వేదికపై నుండి కోపంగా వెళ్ళిపోయాడు.
 

57
Dhee 14

Dhee 14

 
నువ్వు ఇలా ప్రవర్తించ కూడదు అంటూ పూర్ణ హైపర్ ఆదిపై ఫైర్ అయ్యారు. దానికి ఆది.. నాకు డాన్స్ రాదు, యాక్టింగ్ రాదని కౌంటర్ ఇచ్చాడు. అయితే నీకు సిగ్గుంటే వెళ్ళు. సిగ్గు లేదనుకుంటే ఇక్కడే ఉండు అని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. 
 

67
Dhee 14

Dhee 14


పూర్ణ మాటలకు మళ్ళీ ఆది.. నాకు సిగ్గు లేదు, సిగ్గు రాదు, ఫ్యూచర్ లో నా సిగ్గేంటో భవిష్యత్ లో మీరే చూస్తారంటూ సీరియస్ గా రియాక్ట్ అయ్యాడు. పూర్ణ మళ్ళీ నోరు మూసుకో అన్నారు. దానికి నాకు నోరు లేదంటూ ఆది మళ్ళీ కౌంటర్ ఇచ్చాడు. 

77
Dhee 14

Dhee 14


ఢీ వేదికగా పూర్ణ-ఆది మధ్య జరిగిన ఈ వాగ్వాదం ఆసక్తికరంగా మారింది. ఐతే ఇదంతా హైప్ కోసమే అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఎపిసోడ్ కి హైప్ తేవడం కోసం పూర్ణ, ఆది ఇలా ప్రవర్తించారు. ఢీ 14 లేటెస్ట్ ప్రోమో ఈ ఇంట్రెస్టింగ్ విషయాలతో సిద్ధం చేశారు. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
రష్మీ గౌతమ్

Latest Videos
Recommended Stories
Recommended image1
సంజూ శాంసన్ vs కీర్తి సురేష్ .. వీరిలో నెంబర్ 1 ఎవరో తెలుసా..?
Recommended image2
Maheshbabu కోసం కదిలి వచ్చిన పవన్ కళ్యాణ్‌, వెంకటేష్‌, నాగార్జున.. కట్‌ చేస్తే సినిమా ఫ్లాప్‌
Recommended image3
1000 Crore Heroes: వెయ్యి కోట్లకుపైగా కలెక్షన్లని రాబట్టిన హీరోలు వీరే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved