హిందీ అమ్మాయితో హైపర్ ఆది డబుల్ మీనింగ్ కామెడీ.. ఆ ఘోరం చూడలేక జానీ మాస్టర్..
తెలుగు ఆడియన్స్ ని అలరిస్తున్న బుల్లితెర డ్యాన్స్ షోలలో ఢీ ఒకటి. అదిరిపోయే డ్యాన్స్ పెర్ఫామెన్స్ లతో పాటు కడుపుబ్బా నవ్వించే కామెడీకి కూడా ఢీషో అడ్డా అవుతోంది.

Hyper Aadi
తెలుగు ఆడియన్స్ ని అలరిస్తున్న బుల్లితెర డ్యాన్స్ షోలలో ఢీ ఒకటి. అదిరిపోయే డ్యాన్స్ పెర్ఫామెన్స్ లతో పాటు కడుపుబ్బా నవ్వించే కామెడీకి కూడా ఢీషో అడ్డా అవుతోంది. కమెడియన్ గా బుల్లితెరపై సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్న హైపర్ ఆది ఢీ లాంటి డ్యాన్స్ షోలో సైతం సందడి చేయడం చూస్తూనే ఉన్నాం. ఢీ షోలో యాంకర్ ప్రదీప్ చేసే హంగామా కూడా నవ్వించే విధంగా ఉంటుంది. ప్రస్తుతం యాంకర్ ప్రదీప్ స్థానంలోకి నటుడు నందు వచ్చారు.
dhee promo
ఢీ సెలబ్రిటీ షో ప్రోమో తాజాగా విడుదలైంది. ఎప్పటిలాగే హైపర్ ఆది రచ్చ రచ్చ చేశాడు. ప్రోమోలో ప్రతి ఒక్కరి డ్యాన్స్ పెర్ఫామెన్స్ ఆకట్టుకునే విధంగా ఉంది. న్యాయనిర్ణేతలుగా జానీ మాస్టర్, ప్రణీత సుభాష్, గణేష్ మాస్టర్ ఉన్నారు. వేదికపై డ్యాన్స్ పెర్ఫామెన్స్ ఇచ్చిన అమ్మాయిలతో హైపర్ ఆది డబుల్ మీనింగ్ కామెడీ పండించాడు.
dhee promo
టైలర్ అవతారం ఎత్తి టేపుతో ఓ అమ్మాయి కొలతలు కొలిచాడు. అర టేపు కూడా లేదు మళ్ళీ దీనికి ఎక్స్ట్రాలు అంటూ సెటైర్ వేశాడు. ఆ అమ్మాయి నాకు ఓకే కొత్త ఫ్రాగ్ కుట్టించి ఇవ్వు అని అడిగింది. దీనికి ఆది స్పందిస్తూ.. ఇదే బావిలో అరిచే ఫ్రాగ్ లాగా ఉంటుంది.. మళ్ళీ దీనికి ఫ్రాగ్ కావాలంట అంటూ ఆడేసుకున్నాడు.
నార్త్ కి చెందిన ఓ హిందీ అమ్మాయి బింబిలికి అనే సాంగ్ కి ఎనెర్జిటిక్ పెర్ఫామెన్స్ ఇచ్చింది. హైపర్ ఆది ఆ అమ్మాయిని కూడా వదల్లేదు. తనదైన స్టైల్ లో ఆ అమ్మాయిని ఫ్లట్ చేశాడు. ఆది డబుల్ మీనింగ్ లో డైలాగులు చెబుతుంటే ఆమెకి అర్థం కాలేదు. కొన్నింటికి అర్థం కాకపోయినా యస్ అని సమాధానం ఇచ్చింది.
మనిద్దరం భార్య భర్తలం.. మనం కలిస్తే ఈ రిజల్ట్ వచ్చింది అంటూ ఆది ఓ అబ్బాయిని చూపించాడు. జానీ మాస్టర్ ఈ అమ్మాయిని ఎక్కడో చూశాను.. కానీ గుర్తు రావట్లేదు అని అంటారు. హైపర్ ఆది డౌటుగా మావోడేగా ఈ పిల్లాడు అని అడిగాడు.. దీనితో జానీ మాస్టర్ నవ్వలేక కుర్చీలోనుంచి లేచి పక్కకి వెళ్లిపోయారు.
ఆ తర్వాత హైపర్ ఆది.. మనిద్దరం అక్కడ కలిశాం కదా.. పిల్లాడి ఇక్కడికి ఎలా వచ్చాడు అని అడిగాడు. ఆమెకి అర్థం కాక యస్ బై మిస్టేక్ అంటూ బదులిచ్చింది. దీనితో జానీ మాస్టర్, ప్రణీత, గణేష్ మాస్టర్ పొట్ట చెక్కలయ్యేలా నవ్వారు.