ఏషియన్ గేమ్స్ లో మెడల్ గెలిచిన అమ్మాయి దీనస్థితి.. గొప్ప మనసు చాటుకున్న హైపర్ ఆది
తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో విడుదలైంది. ఇందులో హైలైట్ ఏంటంటే ఈ షోకి ఊహించని సెలెబ్రిటీలు అతిథులుగా హాజరయ్యారు.
రష్మీ, హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్, ఇమ్మాన్యూల్, ఇంద్రజ వీరంతా శ్రీదేవి డ్రామా కంపెనీ ద్వారా వినోదం అందిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీదేవి డ్రామా కంపెనీ వేదికపై కామెడీతో పాటు ఇటీవల రొమాన్స్ కూడా ఎక్కువవుతోంది. ఏకంగా లిప్ కిస్సులు పెట్టుకోవడం చూస్తూనే ఉన్నాము.
తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో విడుదలైంది. ఇందులో హైలైట్ ఏంటంటే ఈ షోకి ఊహించని సెలెబ్రిటీలు అతిథులుగా హాజరయ్యారు. అందులో ఒకరు బిగ్ బాస్ శివాజీ, ఫుడ్ స్టాల్ తో సంచలనం సృష్టిస్తున్న కుమారి ఆంటీ అదే విధంగా ఏషియన్ గేమ్స్ లో బ్రాంజ్ మెడల్ సాధించిన తెలుగు అథ్లెట్ నందిని అగసర అతిథులుగా హాజరయ్యారు.
శివాజీ, కుమారి ఆంటీ నవ్వించే ప్రయత్నం చేశారు.ఇమ్మాన్యూల్, వర్ష కామెడీ కూడా నవ్వులు పూయించింది. ఇమ్మాన్యూల్, వర్ష మధ్య సంబంధం ఉంది అంటూ మంగళవారం చిత్రంలో లాగా గోడలపై రాసి ఉంటారు. ఈ సన్నివేశంలో హైపర్ ఆది, వర్ష, ఇమ్మాన్యూల్ మధ్య కామెడీ ఆకట్టుకుంది.
ఎఫైర్స్ ఎక్కువగా జరుగుతున్నాయి అని హైపర్ ఆది ఇంద్రజతో చెప్పగా అయితే ముందుగా ఆపేయాల్సింది నువ్వే అంటూ పంచ్ పేల్చింది. కుమారి ఆంటీ బావున్నారా నాన్న అంటూ అందరినీ పలకరించింది. అంతేకాదు భోజనం కూడా వడ్డించింది.
ఇక ఏషియన్ గేమ్స్ బ్రాంజ్ మెడల్ విన్నర్ తెలుగు అమ్మాయి నందినిని రష్మీ ఆహ్వానించింది. అయితే ఆమె కుటుంబ ఆర్థిక పరిస్థితి అందరి కంట కన్నీళ్లు చెప్పించే విధంగా ఉంది. ఒక సమయంలో గాయం కావడంతో దానికి చికిత్స కోసం డబ్బు మొత్తం ఖర్చయిపోయింది అని.. తినడానికి తిండి కూడా లేదని నందిని తన పరిస్థితి వివరించింది.
తన ట్యాలెంట్ తో మెడల్స్ గెలిచి ఇంటి నిండా పెట్టేయగలదు. కానీ ఆమెకి కడుపు నిండా తిండి లేదు అంటూ హైపర్ ఆది ఆమె దీన స్థితిని వివరించాడు. అంతే కాదు హైపర్ ఆది తన గొప్ప మనసు చాటుకున్నారు. ఈ ఎపిసోడ్ కి వచ్చే పేమెంట్ మొత్తాన్ని తాను నందిని కోసం ఇచ్చేస్తున్నట్లు ప్రకటించాడు. ఆ తర్వాత ఇంద్రజ, ఇతర కమెడియన్లు కూడా నందినికి సహాయం చేస్తామని హామీ ఇచ్చారు.